• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Oppo A38 Review: ఒప్పో ‘A’ సిరీస్‌ నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌.. లీకైన ఫీచర్లు. ప్రత్యేకతలు తెలిస్తే షాకే..!

    చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్‌ తయారీ కంపెనీల్లో ఒప్పో (Oppo) ఒకటి. ఈ సంస్థ నుంచి రిలీజయ్యే స్మార్ట్‌ఫోన్స్‌కు భారత్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఒప్పో నుంచి ఏ ఫోన్‌ వచ్చినా దానిపై దేశంలో ఎనలేని ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒప్పో సరికొత్త మెుబైల్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ‘A’ సిరీస్‌ ఫోన్లపై ఫోకస్‌ పెట్టిన ఈ కంపెనీ.. ‘Oppo A38’ పేరుతో నయా మెుబైల్‌ను తీసుకురాబోతోంది. అయితే ఈ ఫోన్‌ వివరాలు, విడుదల తేదీని ఒప్పో అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ మెుబైల్‌కు సంబంధించిన ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 

    ఫోన్‌ డిస్‌ప్లే

    ఒప్పో A38 స్మార్ట్‌ఫోన్‌ 6.56 అంగుళాల LCD HD+ డిస్‌ప్లేతో తీసుకొస్తున్నారు. ఇది 1612×720 పిక్సెల్ రిజల్యూషన్‌ కలిగి ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌ను ఫోన్‌కు అందించారు. ఈ మెుబైల్‌ Qualcomm Snapdragon 680 SoCతో పనిచేయనుంది. ఈ ఏడాది జనవరిలో వచ్చిన Oppo A36 మెుబైల్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్ రానుంది.

    స్టోరేజ్‌ సామర్థ్యం

    Oppo A38 స్మార్ట్‌ఫోన్‌ 4GB RAM / 128GB స్టోరేజ్‌ సామర్థ్యంతో రానుంది. ఈ మెుబైల్‌ Android 13 OSతో పాటు Oppo’s ColorOS 13తో పనిచేయనుంది. 

    బిగ్‌ బ్యాటరీ

    ఒప్పో A38 ఫోన్ 5,000mAH బ్యాటరీతో రానుంది. USB Type-C ఛార్జింగ్‌ సపోర్ట్‌తో ఇది పనిచేయనుంది. నీరు, డస్ట్‌ను తట్టుకునేలా IP54 rating రెసిస్టెన్స్‌తో ఈ నయా మెుబైల్‌ రానుందని భావిస్తున్నారు. 

    కెమెరా క్వాలిటీ

    Oppo A38 స్మార్ట్‌ఫోన్‌ క్వాలిటీ కెమెరా సెటప్‌తో తీసుకొస్తున్నారు. ఇందులో ప్రైమరీ కెమెరాగా  50MP ఫిక్స్‌ చేశారు. ఇది 2MP మాక్రో సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్‌తో రానుంది. ఇక ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్ చేయనున్నారు. 

    కలర్స్

    Oppo A38 స్మార్ట్‌ఫోన్‌ రెండు రంగుల్లో మార్కెట్‌లోకి రానున్నట్లు సమాచారం. బ్లాక్‌, గోల్డ్‌ కలర్స్‌లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు.

    ధర ఎంతంటే?

    Oppo A38 స్మార్ట్‌ఫోన్‌ ధరను అధికారికంగా ప్రకటించలేదు. అయితే దీని వెల దాదాపు EUR 159 (ఐరోపా కరెన్సీ) ఉంటుందని వార్తలు వస్తున్నాయి. మన కరెన్సీ ప్రకారం ఇది రూ.14,200లకు సమానం. ఈ ఫోన్‌ భారత్‌లోనూ ఇంచుమించుగా ఇదే ధరతో అందుబాటులోకి రానుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

     

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv