ఒప్పో (Oppo) మెుబైల్స్‌కు భారత మార్కెట్‌లో మంచి గుడ్‌విల్ ఉంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ టెక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఒప్పో.. మరో సరికొత్త ఫ్లిప్ మెుబైల్‌తో భారత్‌లో అడుగుపెట్టబోతోంది. ఇప్పటికే చైనాలో రిలీజైన ‘Oppo Find N3 Flip’ ఫోన్‌ను ఇప్పుడు ఇండియాలోకి తీసుకొస్తోంది. ఈ ఫ్లిప్ ఫోన్.. పవర్‌ఫుల్ ప్రాసెసర్, అద్భుతమైన బ్యాటరీ లైఫ్, హై పర్ఫార్మెన్స్ ఫీచర్‌లతో రాబోతున్నట్లు ఒప్పో వర్గాలు పేర్కొన్నాయి. మరి ఇందులో నిజమెంత? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? వంటి అంశాలు ఈ కథనంలో చూద్దాం.
ఫోన్ స్క్రీన్
ఫైండ్ N3 ఫ్లిప్ మెుబైల్ 6.8 అంగుళాల FHD+ మెయిన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 2484×1116 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్, SCHOTT UTG గ్లాస్ ద్వారా ప్రొటెక్షన్ అందించారు. అలాగే ఈ మెుబైల్ 3.26 అంగుళాల ఎక్స్‌టెర్నల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి 382 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ సపోర్ట్‌ను అందించారు.
అడ్వాన్స్‌డ్ OS
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ColorOSతో రన్ అవుతుంది. అలాగే దీనికి Qualcomm Snapdragon 8 Gen 2 SoC ప్రొసెసర్‌ను అందించారు. స్మార్ట్‌ఫోన్ కన్వీనియంట్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో ఈ ఫ్లిప్ మెుబైల్ రానుంది.
బ్యాటరీ సామర్థ్యం
ఫైండ్ N3 ఫ్లిప్ మెుబైల్ 4,805 mAh బ్యాటరీతో రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందించినట్లు తెలుస్తోంది. ఇది ఫోన్ వేగంగా ఛార్జ్ అయ్యేందుకు సహాయపడుతుంది.
ర్యామ్ & స్టోరేజ్
ఫైండ్ N3 ఫ్లిప్ మెుబైల్.. ఏకంగా 16GB RAMతో రాబోతోంది. అలాగే ఈ ఫోన్‌కు 1TB వరకూ స్టోరేజ్ సామర్థ్యాన్ని అందించారు. దీని వల్ల స్టోరేజ్ గురించి ఎలాంటి ఢోకా అవసరం లేదు.
కెమెరా క్వాలిటీ
ఒప్పో లేటెస్ట్ ఫ్లిప్.. పవర్‌ఫుల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 32MP టెలిఫోటో లెన్స్‌ను ఉన్నాయి. సెల్ఫీ ఇష్టపడే వారి కోసం 32MP ఫ్రంట్ కెమెరాను ఫిక్స్ చేశారు. ఇది క్లియర్, షార్ప్ సెల్ఫీలను అందిస్తుంది.
ధర ఎంతంటే?
ఫైండ్ N3 ఫ్లిప్ మెుబైల్ ఇవాళ (అక్టోబర్ 12) సా. 7 గంటలకు భారత్‌లో లాంచ్ కానుంది. ఒప్పోకి చెందిన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో లాంచింగ్ ఈవెంట్‌ను వీక్షించవచ్చు. ఆ సమయంలోనే ఈ ఫోన్ ధరను ఒప్పొ రివీల్ చేయనుంది. అయితే ఈ ఫ్లిప్ మెుబైల్ ధర రూ.94,999 ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!