స్మార్ట్‌ఫోన్‌ల తయారీ దిగ్గజ సంస్థ ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ల సిరీస్ Find X8 పేరుతో భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ సిరీస్‌లో రెండు ప్రధాన మోడళ్లు, Find X8, Find X8 ప్రో లాంచ్ కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ColorOS 15 తో అందుబాటులో ఉంటాయి. ఈ సిరీస్ ఇప్పటికే చైనాలో విడుదల కాగా, భారత్ మార్కెట్లో త్వరలోనే ఈ ఫోన్లు(Oppo Find X8 Series) అందుబాటులోకి రానున్నాయి. త్వరలో ఇ-కామర్స్ సంస్థ Flipkart ద్వారా వీటి విక్రయం ప్రారంభం కానుంది, ప్రస్తుతం ముందస్తు బుకింగ్ చేసుకొనేందుకు వీలుంది.
ఒప్పో Find X8 సిరీస్ లాంచ్ తేదీ
తాజాగా ఒప్పో ప్రకటించిన వివరాల ప్రకారం, Find X8 సిరీస్ నవంబర్ 21, 2024న భారత మార్కెట్లో విడుదల కానుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ లాంచ్ ఈవెంట్ బాలిలో ఉదయం 10.30 గంటలకు (IST) ప్రారంభం కానుంది. Find X8 సిరీస్ ప్రత్యేకతలు, ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు వివరిస్తూ ఒప్పో ఇండియా అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ గ్యాడ్జెట్ గురించి ప్రకటన వెలువరించింది.
Find X8 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు
డిస్‌ప్లే:
Find X8 స్మార్ట్‌ఫోన్ 6.59 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ మరియు 2160Hz టచ్ శాంప్లింగ్ రేట్ కలిగిన ఈ డిస్‌ప్లే అత్యంత స్పష్టతను అందిస్తుంది. ఈ డిస్‌ప్లే ఒప్పో క్రిస్టల్ షీల్డ్, డాల్బీ విజన్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది.
ప్రాసెసర్ -ర్యామ్:
Find X8 మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఈ చిప్‌సెట్ G925 GPUతో పాటు 16GB LPDDR5X ర్యామ్, 1TB UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. (Oppo Find X8 Series)స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15తో పని చేస్తుంది.
కెమెరాలు:
కెమెరా విభాగంలో 50MP సోనీ LYT 700 ప్రైమరీ కెమెరా, 50MP శాంసంగ్ S5KJN5 అల్ట్రావైడ్ లెన్స్, 3X ఆప్టికల్, 120X డిజిటల్ జూమ్ సామర్థ్యంతో 50MP సోనీ LYT-600 టెలిఫోటో కెమెరా ఉన్నాయి. వీడియో, ఫోటోగ్రఫీ పరంగా ఇది అత్యుత్తమ పనితీరును అందించనుంది.
బ్యాటరీ:
5630mAh బ్యాటరీతో Find X8 స్మార్ట్‌ఫోన్ లాంగ్ లాస్టింగ్ బ్యాకప్ కలిగినది. 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్థ్యాలు కూడా ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణలు.
Find X8 ప్రో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు
డిస్‌ప్లే:
Find X8 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల మైక్రో కర్వడ్ LTPO అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే మరింత శక్తివంతమైన ప్రదర్శనను అందిస్తుంది.
ప్రాసెసర్ మరియు OS:
Find X8 ప్రో మోడల్ కూడా మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 వేరియంట్ (Oppo Find X8 Series)ఈ మోడల్‌లో కూడా లభిస్తుంది.
కెమెరాలు:
Find X8 ప్రో కెమెరా సెటప్ విభాగంలో 50MP సోనీ LYT 808 ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ప్రత్యేకంగా 6x ఆప్టికల్ జూమ్ మరియు 120x డిజిటల్ జూమ్ సామర్థ్యాలతో ఉన్న 50MP సోనీ IMX858 లెన్స్ మరింత క్లియర్ ఫోటోలను అందించగలదు.
సెల్ఫీ కెమెరా:
ఈ మోడల్ కూడా 32MP సోనీ IMX615 లెన్స్‌తో సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం మరింత మెరుగైన అనుభవాన్ని అందిస్తుంది.
బ్యాటరీ – ఛార్జింగ్:
5910mAh సామర్థ్యంతో కూడిన బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్‌లతో ఈ ఫోన్ అన్ని అవసరాలను తీర్చుతుంది. అదనంగా, ఈ మోడల్ IP68/69 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.
భద్రత
Find X8 ప్రో మోడల్‌లో భద్రత కోసం ఇన్‌ఫ్రారెడ్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్లు ఉన్నాయి.
ధర
వీటి ధరల వివరాలు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. భారత్‌లో దీని ధర రూ.₹49,990 (12జీబీ ర్యామ్- 256జీబీ స్టోరేజ్) వరకు ఉండే అవకాశం ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!