ఒప్పో (Oppo) మెుబైల్స్‌కు భారత మార్కెట్‌లో మంచి గుడ్‌విల్ ఉంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ సరికొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ టెక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఒప్పో.. మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ‘Oppo Reno 11 5G’ పేరుతో కొత్త సిరీస్‌ను తీసుకొచ్చింది. ‘Reno 11 5G’ ‘Reno 11 Pro 5G’ స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్‌లోకి వచ్చాయి. గతేడాది నవంబర్‌లోనే ఈ సిరీస్ చైనాలో విడుదలై టెక్ ప్రియుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ పొందింది. తాజాగా భారత్‌లోనూ అడుగుపెట్టడంతో అందరి దృష్టి వీటిపై పడింది. ఈ నేపథ్యంలో Reno 11 Pro ఫోన్ ఫీచర్లు, ధర ఇతర విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మెుబైల్ స్క్రీన్
ఈ ఒప్పో మెుబైల్.. 6.7 అంగుళాల AMOLED Full HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 1,080×2,412 pixels క్వాలిటీ, 120Hz రిఫ్రెష్ రేటును దీనికి అందించారు. MediaTek Dimensity 8200 SoC ప్రొసెసర్, Android 14 ఆధారిత ColorOS 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్ వర్క్ చేయనుంది. నాలుగేళ్ల పాటు ఉచితంగా ఆండ్రాయిడ్ వెర్షన్స్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
ర్యామ్ & స్టోరేజ్
Oppo Reno 11 Pro 5G మెుబైల్‌ను శక్తివంతమైన ర్యామ్, లార్జ్ స్టోరేజ్ సామర్థ్యంతో తీసుకొచ్చారు. 12GB RAM / 256GB స్టోరేజ్‌ను మెుబైల్‌కు అందించారు. అధిక ర్యామ్‌ను కలిగి ఉండటం వల్ల ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుంది.
కెమెరా
నయా ఒప్పో ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో లాంచ్ అయ్యింది. ఇందులో 50 MP Sony IMX890 ప్రైమరీ కెమెరా + 32 MP టెలిఫొటో సెన్సార్ + 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్ కోసం ఫోన్ ముందు భాగంలో 32MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. వీటి సాయంతో నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని ఒప్పో వర్గాలు తెలిపాయి.
బ్యాటరీ
Reno 11 Pro 5G మెుబైల్‌కు 4,600mAh బ్యాటరీని ఫిక్స్ చేశారు. దీనికి ఏకంగా 80W Super VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. ఇది అత్యంత వేగంగా మెుబైల్‌ను ఛార్జ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరోవైపు Reno 11 Pro వేరియంట్‌లో 5,000mAh బ్యాటరీని అమర్చారు.
కనెక్టివిటీ ఫీచర్లు
ఈ ఒప్పో ఫోన్ 5G నెట్‌వర్క్‌కు సపోర్టు చేస్తుంది. ఇందులో Wi-Fi 802.11 a/b/g/n/ac/ax, Bluetooth, GPS, NFC, USB Type-C వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఫేస్ అన్‌లాక్, డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలోమీటర్, గైరోస్కోప్, Ambient light సెన్సార్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.
కలర్ ఆప్షన్స్
Oppo Reno 11 Pro మెుబైల్ రెండు రంగుల్లో రిలీజయ్యింది. పియర్ల్ వైట్ (Pearl White), రాక్ గ్రే (Rock Grey) కలర్ ఆప్షన్స్‌లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేయవచ్చు. అటు Oppo Reno 11 5G మోడల్.. రాక్ గ్రే (Rock Grey), వేవ్ గ్రీన్ (Wave Green) రంగుల్లో విడుదలైంది.
ధర ఎంతంటే?
Oppo Reno 11 5G (8GB RAM + 128GB storage) ధరను రూ.29,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే ప్రో మోడల్‌లో 12GB RAM + 256GB వేరియంట్ ధరను రూ.39,999గా ప్రకటించింది. జనవరి 18 నుంచి ప్రో మోడల్ సేల్స్ ప్రారంభం కానుండగా.. 25వ తేదీ నుంచి Oppo Reno 11 5G ఫోన్స్ అందుబాటులోకి వస్తాయి. ఒప్పో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లోనూ వీటిని కొనుగోలు చేయవచ్చు. SBI, ICICI, IDFC ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులకు సంబంధించిన కార్డు కొనుగోళ్లపై ఫ్లిప్‌కార్ట్‌లో రూ.4000 వరకూ రాయితీ పొందవచ్చు.