• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Oscars 95: దీపిక పదుకొణె చేతుల మీదుగా ‘RRR’కు ఆస్కార్ అవార్డ్..?

    బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె చేతుల మీదుగా ‘ఆర్ఆర్ఆర్’ బృందం ఆస్కార్ అవార్డు అందుకోనుందా? బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్‌కి అవార్డు కన్‌ఫర్మ్ అయినట్లేనా? ‘నాటు నాటు’ పాట ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం, ఇలా గెలుపొందిన అవార్డును దీపిక పదుకొణె చేతుల మీదుగా తీసుకోవడం ఒక విధంగా సాధ్యమేనని విశ్లేషకులు చెబుతున్నారు.  అదెలాగో తెలుసుకుందాం. 

    ప్రజెంటర్‌గా దీపిక

    ఆస్కార్ అవార్డుకు దీపిక పదుకుణె ప్రజెంటర్‌గా ఎంపికైంది. అవార్డులు ప్రదానం చేసే సెలబ్రిటీల జాబితాను ఆస్కార్ ఈ నెల 2న ప్రకటించింది. ఈ జాబితాలో ఆస్కార్ నిర్వాహకులు దీపిక పదుకొణెను చేర్చారు. ఈ విషయాన్ని దీపిక పదుకొణె తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేసింది. దీంతో ఈ ఏడాది ప్రజెంటర్ల జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక వ్యక్తిగా దీపిక పదుకొణె నిలిచింది. ఇది భారతీయ సినిమాకే గర్వకారణం.  

    పోటీలో భారతీయ చిత్రాలు..

    ఈ సారి కచ్చితంగా ఆస్కార్ అవార్డును పొందే చిత్రాలలో ‘ఆర్ఆర్ఆర్’ ఒకటని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట గట్టి పోటీనిస్తోంది. ఈ సాంగ్‌తో పాటు మరో రెండు భారతీయ డాక్యుమెంటరీలు ఆస్కార్ బరిలో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. హిందీ భాషలో తెరకెక్కిన ‘ఆల్ దట్ బ్రీత్స్’(All That Breathes) ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ అవార్డుకు పోటీ పడుతోంది. దీనితో పాటుగా బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డుల నామినేషన్ల జాబితాలో తమిళంలో రూపొందిన ‘ద ఎలిఫెంట్ విస్పరర్స్’(The Elephant Whisperers) చోటు దక్కించుకుంది. 

    ‘నాటు నాటు’కే కన్‌ఫర్మ్?

    ఆస్కార్ వేడుకలో ‘నాటు నాటు’ సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్‌ని ఇవ్వాలని సింగర్స్‌కి ఆస్కార్ నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. ఈ మేరకు రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ అమెరికాకు పయనం కానున్నారు. ఆస్కార్ వేదికపై ప్రదర్శన ఇచ్చేందుకు సింగర్స్‌ని ఆహ్వానించడం, అందులోనూ ‘నాటు నాటు’.. అవార్డుకు పోటీ పడుతున్న పాట కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ‘నాటు నాటు’కే ఆస్కార్ అవార్డు దక్కుతుందన్న ఊహలు మరింత బలపడ్డాయి. సింగర్స్‌ని వేదికపై లైవ్‌లో పాడించి తమ నిర్ణయం సరైందేనని చెప్పకనే చెప్పాలని ఆస్కార్ నిర్వహకులు భావిస్తున్నట్లు టాక్.  

    గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో..

    ఆస్కార్ స్థాయి అంతటి గోల్డెన్ గ్లోబ్ అవార్డును ‘నాటు నాటు’ దక్కించుకుంది. ఇలా గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న విభాగంలోనే ఆస్కార్ అవార్డును పొందిన సందర్భాలు బోలెడున్నాయి. దీంతో ‘నాటు నాటు’కు ఆస్కార్ అవార్డ్ పక్కా అంటూ చర్చ జరుగుతోంది.  పైగా, పలు అంతర్జాతీయ అవార్డులు కూడా రావడంతో ఆస్కార్ పక్కా అని అంటున్నారు. 

    దీపిక పదుకొణె చేతుల మీదుగా?

    ఆస్కార్‌కు దీపిక ప్రజెంటర్‌గా వెళ్తుంది. అయితే, తాను ఏ అవార్డు ఇవ్వబోతోందనే విషయంపై క్లారిటీ లేదు. ఈ మేరకు ఒకవేళ ఆమె చేతుల మీదుగా ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును అందింపజేసే అవకాశాలను కొట్టిపారేయలేం. నిర్వాహకులు ఈ విధంగా ప్లాన్ చేసి ఉంటే భారత అభిమానులకు ఇక పూనకాలే. అందులోనూ ఈ అవార్డును ‘నాటు నాటు’ గెలుచుకుంటే అంతకన్నా గర్వకారణం ఏముంటుంది. గతేడాది జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్ ట్రోఫీని దీపిక పదుకొణె ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. 

    ఊహకే అందదు..

    దీపిక పదుకొణె చేతుల మీదుగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును ఆర్ఆర్ఆర్ బృందం స్వీకరించడమనే దృశ్యాన్ని మాటల్లో వర్ణించలేం. భారతీయ సినిమాకు ఇంతకన్నా గొప్ప గౌరవం ఇంకేమీ ఉండదు. ఆ అపురూప క్షణాల్ని అస్సలు ఊహించలేం. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్ విభాగాల్లోనూ భారతీయ సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ విభాగాలకు దీపిక పదుకొణె ప్రజెంటర్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. 

    గొప్ప జ్ఞాపకంగా..

    ఏదేమైనా, 95వ ఆస్కార్ అవార్డుల వేడుక భారతీయులకు మధురమైన అనుభూతిని కలిగించనుంది. మార్చి 12న(భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13న) లాస్‌ఏంజెలెస్‌లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ వేడుకకు అతిరథ మహారథులందరూ హాజరవుతారు. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన సెలబ్రిటీలు, దిగ్గజ టెక్నిషియన్లు వేడుకలో పాలు పంచుకొంటారు. ఇంతటి మహత్తరమైన వేడుకలో భారతీయ చిత్రాలకు అవార్డులు దక్కడం, వాటిని మన భారతీయురాలి చేతుల మీదుగా ఇప్పించడమనేది చరిత్రలో నిలిచిపోతుంది. భారతీయ సినిమా చరిత్రలోనే ఇదొక మరుపురాని జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv