పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భారీ ప్రాజెక్టులతో దూకుడు పెంచాడు. బాహుబలి మూవీతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ రెబల్ స్టార్ పాన్ ఇండియా సినిమాలపైనే దృష్టిసారించాడు. ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమలోనే ఎక్కువ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్న ఏకైక హీరో ఇతడే అనడం అతిశయోక్తి కాదు.
ఇంతకి ప్రభాస్ రానున్న రెండుమూడేళ్లలో ఎన్ని సినిమాల్లో నటిస్తున్నాడు..? వాటి వివరాలు ఏంటో మీరు తెలుసుకోండి.
రాధేశ్యామ్
ఓ థ్రిల్లింగ్ లవ్‌స్టోరీతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెంచుకున్నారు. ప్రభాస్ హస్తముద్రిక నిపుణుడిగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ పాన్ ఇండియా చిత్రం మార్చి 11న రిలీజ్‌కానుంది. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో అంచనాలు మరింత పెరిగాయి.
సలార్
సెన్సేషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రూ.150 కోట్లతో తెరకెక్కుతుంది. చిత్రీకరణ దాదాపు పూర్తవడంతో ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ నటిస్తుంది. అలాగే జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించనున్నాడు. విజయ్ కిరగండూరు నిర్మాతగా వ్యవహరించారు.
ఆదిపురుష్
రామాయణ ఇతిహాసం కథాంశంతో ప్రేక్షకులముందుకు రానున్న ఓ భారీ ప్రాజెక్టు మూవీ ఇది. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో తీస్తున్న ఈ సినిమా 2023, జనవరి 12న రిలీజ్‌కానుంది. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓంరౌత్‌లు నిర్మాతలు.
ప్రాజెక్టు K
వైజయంతి బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఓ సైంటిఫిక్ ఫిక్షన్‌తో రాబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొణే నటించనుంది. అలాగే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి దీపికా ఇటీవలే హైదరాబాద్ వచ్చి వెళ్లింది.
స్పిరిట్
ప్రభాస్ హీరోగా నటించనున్న 25వ సినిమా ఇది. ఈ మూవీని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్నాడు. రెబల్ స్టార్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ క్యారెక్టర్‌తో అభిమానులను అలరించనున్నట్లు ఇప్పటికే సినీ పరిశ్రమలో టాక్ వినిపిస్తుంది. అలాగే ఎనిమిది భాషాల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషాలతో పాటు మాండరిన్, జపానీస్, కొరియన్ లాంగ్వేజెస్‌లో కూడ రిలీజ్ కానుంది.
మారుతి దర్శకత్వంలో
వరుస పాన్ ఇండియా ప్రాజెక్టుల అనంతరం తక్కువ బడ్జెట్‌తో ప్రభాస్ నటించబోయే సినిమా ఇదే అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కె ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ కథాంశంతో రూపుదిద్దుకుంటుందట. అలాగే డార్లింగ్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారట. ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!