నటీనటులు : శక్తి రిత్విక్, ఐయల్, కని తిరు, షామ్, కిషోర్, కాళి వెంకట్, వీటీవీ గణేష్, శరణ్య, రామచంద్రన్ తదితరులు
డైరెక్షన్ : రసు రంజిత్
సంగీతం : యువన్ శంకర్ రాజా
ఎడిటింగ్ : రిచర్డ్ కెవిన్
సినిమాటోగ్రఫీ : ఓం నారాయణ్
నిర్మాతలు : కృష్ణ, కె. ఎస్. మధుబాల
ఓటీటీ వేదిక : డిస్నీ + హాట్‌స్టార్
కిషోర్ (Kishore), కని తిరు (Kani Tiru), బాల నటుడు శక్తి రిత్విక్, బాల నటి రుద్ర ప్రధాన పాత్రల్లో నటించిన తాజా తమిళ వెబ్‌సిరీస్ ‘పారాచూట్’ (Parachute). రాసు రంజిత్ ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. 5 ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ సిరీస్ నవంబర్ 29న ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగు, తమిళం, హిందీ సహా 7 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. పిల్లల కిడ్నాప్ నేపథ్యంలో రూపొందిన ఈ సిరీస్ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (Parachute Review)
కథేంటి
షణ్ముగం (కిషోర్), లక్ష్మి (కని తిరు) భార్య భార్తలు. పిల్లలు వరుణ్ (శక్తి రిత్విక్), రుద్ర (ఇయల్)తో షణ్ముగం కఠినంగా వ్యవహరిస్తుంటాడు. చిన్న తప్పుచేసిన చితకబాదేస్తుంటాడు. దీంతో పిల్లలకు తండ్రి అంటే విపరీతమైన భయం ఏర్పడుతుంది. అయితే వరుణ్‌కు పారాచూట్ (తండ్రి నడిపే మోపెడ్ బైక్) పై రైడ్‌కి వెళ్లాలని కోరికగా ఉంటుంది. ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి చెల్లిని తీసుకొని మోపెడ్‌పై వెళ్తాడు. నాటకీయ పరిణామాల వల్ల పారాచూట్ కనిపించకుండా పోతుంది. మరోవైపు ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ (కృష్ణ) డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఒక శ్రీమంతుడి కొడుకుపై చేయి చేసుకుంటాడు. అతడి ఖరీదైన బైక్‌ను స్టేషన్‌కి తీసుకెళ్తాడు. ఈ రెండు కథలకు లింకేంటి? పారాచూట్‌ను కనిపెట్టే ఇంటికి వెళ్లాలని భావించిన పిల్లలు ఏంచేశారు? పిల్లల కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఎలా వేదన పడ్డారు? పారాచూట్‌తో పాటు స్టేషన్‌లో పెట్టిన ఖరీదైన బైక్‌ను ఎవరు దొంగిలించారు? దాని వల్ల ట్రాఫిక్ పోలీసుకు వచ్చిన కష్టాలేంటి? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
పేరెంట్స్ పాత్రల్లో నటుడు కిషోర్ (Parachute Review), నటి కని తిరు చక్కటి నటన కనబరిచారు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన భార్య భర్తలుగా వారు జీవించారు. ముఖ్యంగా కిషోర్ పిల్లలపై అపారమైన ప్రేమ ఉన్నప్పటికీ బయటకు కఠినంగా ఉండే తండ్రి పాత్రలో అదరగొట్టాడు. కొడుకు, కూతురుగా చేసిన బాల నటులు శక్తి రిత్విక్, ఇయల్ బాగా చేశారు. ప్రధానంగా ఈ పిల్లలిద్దరి చుట్టూ కథ తిరుగింది. ముఖ్యంగా కూతురిగా ఇయల్ మంచి మార్కులు కొట్టేసింది. ఎమోషనల్ సీన్స్‌లో ఇయల్ ఎక్స్‌ప్రెషన్స్ హృదయాలను బరువెక్కిస్తాయి. ట్రాఫిక్ పోలీసుగా కృష్ణ పర్వాలేదనిపించాడు. పొరుగింటి వ్యక్తిగా కాళి వెంకట్ కూడా పాత్ర కూడా బాగుంది. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
పారాచూట్ మిడిల్ క్లాస్ ఫాదర్ కథ అని చెప్పుకోవచ్చు. బయట ఉన్న ఫ్ట్రస్ట్రేషన్‌ను తీసుకొచ్చి పిల్లల మీద చూపిస్తే వారు ఇలాంటి బాధలు అనుభవిస్తారో దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. చిన్న తప్పు చేస్తే చితకబాదే తండ్రి పారాచూట్ పోయిందంటే ఇంక ఎలా రియాక్ట్ అవుతాడోనని భావించి దానిని కనిపెట్టేందుకు ఆరాటపడటం ఆకట్టుకుంది. పిల్లల పట్ల మెురటుగా ప్రయత్నించే తండ్రిని ఓ వైపు చూపిస్తూనే పిల్లల కోసం తాపత్రయ పడే పోలీసు ఆఫీసర్ పాత్రను సమాంతరంగా చూపించి మెప్పించాడు. పిల్లల ఆచూకి కోసం వెతికే క్రమంలో వారి పట్ల తాను ఎంత పెద్ద తప్పుచేశాననో షణ్ముగం రియలైజ్ అయ్యే సీన్ హృదయాలను బరువెక్కిస్తుంది. షణ్ముగంతో పోలీసు ఆఫీసర్ చెప్పే డైలాగ్స్ ప్రతీ కనెక్ట్ అవుతాయి. క్లైమాక్స్‌లో ఇచ్చిన ఎమోషనల్ టచ్ ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. అయితే రొటిన్ స్టోరీ, నెమ్మదిగా సాగే కథనం, పెద్దగా మలుపులు లేకపోవడం, కొన్ని సాగదీత సన్నివేశాలు సిరీస్‌కు మైనస్‌గా మారాయి.
సాంకేతికంగా..
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే (Parachute Review) యువన్ శంకర్ రాజా ఇచ్చిన సంగీతం సిరీస్‌కు బాగా ప్లస్ అయ్యింది. భావోద్వేగాలకు తగ్గట్లు ఆయన అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నారాయణ్ కెమెరా పనితీనం మెప్పిస్తుంది. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు. సిరీస్‌ను ఇంకాస్త ట్రిమ్ చేసి కథనంలో వేగం పెంచి ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్
- ప్రధాన తారాగణం నటన
- భావోద్వేగాలు
- సంగీతం
మైనస్ పాయింట్స్
- రొటీన్ స్టోరీ
- నెమ్మదిగా సాగే కథనం
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ