• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Parineeti Chopra Wedding: పెళ్లి బంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.. వీరి గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?

    ప్రముఖ బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్ధా (Raghav Chadha) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం (సెప్టెంబర్‌ 24) సా. 6.30 గంటలకు ఈ జంట బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకుంది. 

    వీరి పెళ్లికి రాజస్థాన్‌ ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్ వేదికైంది. వెడ్డింగ్‌ కోసం అత్యంత ఖరీదైన మహారాజా సూట్‌ను కూడా బుక్‌ చేశారు. అయితే కొద్దిమంది అతిథుల సమక్షంలోనే పరిణీతి, రాఘవ్‌ చద్దా వివాహం జరగడం గమనార్హం. 

    ఈ వివాహనికి ముఖ్య అతిథులుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌లు హాజరైనట్లు తెలిసింది. వీరితో పాటు సానియా మీర్జా, మనీష్ మల్హోత్రా వంటి సెలెబ్రీస్ కూడా వివాహ వేదికపై సందడి చేశారు. అయితే పరిణితీ చోప్రా అక్క ప్రియాంక చోప్రా ఈ పెళ్లికి హాజరు కాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.

    ఇక పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా బంధం విషయానికి వస్తే వారిది ప్రేమ వివాహం అన్నది అందరికి తెలిసిందే. అయితే వీరి మధ్య ప్రేమ లండన్‌లో చిగురించిందట. కొన్నాళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటి అయ్యింది.

    ఇక వీరి ఏంగేజ్ మెంట్ మే 13న ఢిల్లీలో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన పిక్స్ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఒకరు రాజకీయ నాయకులు, మరొకరు బాలీవుడ్ నటి కావడంతో ఇరు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు.

    పరిణీతి ఎంగేజ్‌మెంట్ కోసం ఆమె కజిన్ ప్రియాంక చోప్రా కూడా లండన్‌ నుంచి ఇండియాకు వచ్చారు. తన కూతురుతో కలిసి సిస్టర్ ఎంగేజ్‌మెంట్‌లో హ్యాపీగా గడిపారు. ప్రియాంకచోప్రాతో పాటు పరిణీతి ఫ్రెండ్స్, బాలీవుడ్ తారలు కూడా హాజరయ్యారు.

    తాజాగా పెళ్లి తంతు కూడా పూర్తి అవ్వడంతో ఫ్యాన్స్‌తో పాటు సెలెబ్రిటీస్ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే కొందరు సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా స్టార్ కపుల్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పరిణీతి, రాఘవ్‌ వివాహ ఫొటోలను షేర్‌ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అటు ప్రియాంక చోప్రా సైతం తన బ్లెస్సింగ్స్‌ ఈ జంటకు ఎప్పుడూ ఉంటాయని ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అటు మలైక అరోరా, సానియా మిర్జా, మనీష్‌ మల్హోత్రా సహా పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభినందనలు తెలియజేశారు.

    రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ యువ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక పరిణితీ చోప్రా హిందీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. పరిణితీ చోప్రా ఆస్తుల విషయానికి వస్తే.. ఓ వెబ్ సైట్ ప్రకారం ఆమె నికర ఎసెట్స్ విలువ దాదాపు రూ.60 కోట్లు ఉన్నట్లు టాక్. ఇప్పటికీ అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో పరిణీతి చోప్రా ఒకరు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv