ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ పోకో (Poco) నుంచి సరికొత్త మెుబైల్ లాంచ్ అయ్యింది. ‘Poco C65’ పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్ ప్రపంచానికి పరిచయం అయ్యింది. మెుత్తం రెండు వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి గ్లోబల్ ముందుకు వచ్చింది. ‘Poco C55’ మెుబైల్‌కు అప్‌డేట్ వెర్షన్‌గా ‘Poco C65’ రూపొందించినట్లు తయారీ సంస్థ వెల్లడించింది. గత ఫోన్‌తో పోలిస్తే దీనిలో ఎన్నో అడ్వాన్స్డ్ ఫీచర్లను అమర్చినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ‘పోకో సీ65’ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి విశేషాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
మెుబైల్ డిస్‌ప్లే
ఈ పోకో మెుబైల్ 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 1,600 x 720 pixels రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్‌ను కలిగి ఉంది. Corning Gorilla Glass ప్రొటెక్షన్‌ను డిస్‌ప్లేకు అందించారు.
ప్రాసెసర్
Android 13 ఆధారిత MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్, MediaTek Helio G85 SoC ప్రొసెసర్‌తో ఇది పనిచేయనుంది.
ర్యామ్ & స్టోరేజ్
ఈ ఫోన్‌ను పోకో రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. 6GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 256GB స్టోరేజ్ ఆప్షన్స్‌ను కలిగి ఉంది. microSD కార్డు ద్వారా స్టోరేజ్ సామర్థ్యాన్ని1TB వరకూ పెంచుకోవచ్చని కంపెనీ తెలిపింది. మీ అవసరానికి అనుగుణంగా ఉన్న వేరియంట్‌ను ఎంచుకోవచ్చు.
బ్యాటరీ
Poco C65 మెుబైల్‌ను 5,000mAh బ్యాటరీతో తీసుకొస్తున్నారు. దీనికి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందించారు. దీని ద్వారా మెుబైల్‌ను చాలా వేగంగా ఛార్జ్ చేసుకునే వీలు ఏర్పడుతుంది.
కెమెరా క్వాలిటీ
ఈ పోకో స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50 MP ప్రైమరీ కెమెరా, 2 MP మాక్రో లెన్స్ ఉన్నాయి. ఇక ముందు వైపు 8 MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ కెమెరాలతో అద్భుతమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని పోకో ప్రతినిధులు చెబుతున్నారు.
అదనపు ఫీచర్లు
Poco C65 మెుబైల్.. G VoLTE, Wi-Fi, Bluetooth 5.1, GPS, GLONASS కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే 3.5mm ఆడియో జాక్, FM radio సపోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింటర్ సెన్సార్‌ను దీనికి అందించారు. 168mm x 78mm x 8.09mm కొలతల్లో ఈ స్మార్ట్‌ఫోన్ రానుంది.
కలర్ ఆప్షన్స్
Poco C65 స్మార్ట్‌ఫోన్ మెుత్తం మూడు కలర్ వేరియంట్లలో లాంచ్ అయ్యింది. బ్లాక్ (Black), బ్లూ (Blue), పర్పుల్ (Purple) రంగుల్లో మీకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
ధర ఎంతంటే?
పోకో సీ65 మెుబైల్స్ ప్రస్తుతం అమెరికాలో సేల్స్‌కు వచ్చాయి. అతి త్వరలో భారత్‌లోనూ అందుబాటులోకి రానున్నాయి. అయితే అమెరికా రేట్ల ప్రకారం 6GB + 128GB వేరియంట్ ధర రూ.10,700గా ఉంది. 8GB + 256GB స్టోరేజ్ ఉన్న ఫోన్ వెల రూ.12,400 వరకూ ఉండవచ్చు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం