• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • POCO F5 5G,Xiaomi 13 Ultra,Oppo Reno 10…రాబోయే 3 నెలల్లో మార్కెట్లో సందడి చేసే ఫోన్లు ఇవే!

    మొబైల్ కంపెనీలకు ఇండియా అతి పెద్ద మార్కెట్‌. అందుకే అన్ని వర్గాలను టార్గెట్‌ చేసుకుని నిత్యం ఏదో ఫోన్‌ రిలీజ్‌ చేస్తూనే ఉంటాయి. కొన్ని ప్రత్యేకంగా భారత్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసి తయారు చేస్తే… కొన్ని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసి స్వల్ప మార్పులతో ఇండియాకు తీసుకొస్తారు. రాబోయే 3 నెలల్లో ఇలా మిడ్‌ రేంజ్ నుంచి ప్రీమియమ్‌ ఫోన్ల వరకూ చాలానే రాబోతున్నాయి. గూగుల్‌, షావోమీ, శాంసంగ్‌, రియల్‌మీ, వివో ఇలా అన్ని కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకువస్తున్నాయి.

    POCO F5 5G, POCO C51

    ఇండియన్‌ మార్కెట్‌లోకి  POCO F5 5G, POCO C51 ఫోన్లను తీసుకురావాలని పోకో భావిస్తోంది. ఏప్రిల్ 6, ఏప్రిల్‌ 7న ఈ రెండు ఫోన్లు లాంచ్‌ అవుతాయని తెలుస్తోంది. POCO F5 5G కొత్త స్నాప్‌డ్రాగన్ 7XX సిరీస్ ప్రాసెసర్, 12GB వరకు RAM, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన AMOLED డిస్‌ప్లేతో రానుంది. POCO C51 హిలియో G36 ప్రాసెసర్‌, 5000mAh బ్యాటరీతో రానుంది. 

    Oppo Reno 10 సిరీస్‌

    ఓప్పో కూడా పలు ఫోన్లలు ఇండియన్‌ మార్కెట్‌లో విడుదల చేయాలని చూస్తోంది. వచ్చే మూడు నెలల్లోనే ఈ ఫోన్‌ కూడా లాంచ్‌ చేయనుంది. Snapdragon 778G ప్రాసెసర్‌, 6.73 ”  AMOLED స్క్రీన్‌,50 MP + 8 MP + 2 MP ట్రిపుల్‌ కెమెరా సెటప్‌, 8+256GB మెమోరీ సామర్థ్యంతో ఈ ఫోన్‌ వచ్చే అవకాశముంది.

    Xiaomi 13 Ultra

    షావోమీ ఏప్రిల్‌లో ఈ ఫోన్‌ను రిలీజ్‌ చేయాలని చూస్తోంది. లేటెస్ట్  ప్రీమియమ్‌ Snapdragon 8 Gen 2 చిప్‌సెట్‌, 4,900mAh బ్యాటరీ, 50-మెగాపిక్సల్‌ కెమెరా వంటి ఫీచర్లతో ఇది రాబోతోంది. 

    Vivo X Fold 2

    వివో నుంచి ఫోల్డబుల్‌ మొబైల్‌ Vivo X Fold 2 రాబోతోంది. 120W చార్జింగ్‌ కెపాసిటీతో ఉండే ఈ ఫోన్‌ వచ్చే 3 నెలల్లోనే మార్కెట్‌లోకి వచ్చే అవకాశముంది. ఫోల్డబుల్‌ ఫోన్లలో ఇదే ఫాస్టెస్ట్ చార్జింగ్‌ ఫోన్‌గా నిలవనుంది.

    Pixel Fold

    గూగుల్‌ నుంచి రాబోతున్న ఫోల్డబుల్‌ మొబైల్‌ Pixel Fold. దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు కానీ, వచ్చే రెండు నెలల్లోనే దీనిని కూడా లాంచ్ చేసే అవకాశముంది. గూగుల్‌ I/O 2023 కార్యక్రమంలో దీనిని ఆవిష్కరించనున్నారు.

    iQoo Z7 Pro, iQoo Neo 8 Series

    iQoo నుంచి కూడా కొన్ని ఫోన్లు రాబోతున్నాయి అందులో iQoo Z7 Pro ఒకటి. Snapdragon 782G ప్రాసెసర్‌,  8 GB ర్యామ్‌, 5000mAh బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ రానుంది. దీని ధర రూ.32 వేలకు పైగా ఉంటుందని అంచనా.iQoo Neo 8 సిరీస్‌ కూడా ఇండియన్‌ మార్కెట్లోకి వచ్చే అవకాశముంది.   MediaTek Dimensity 9000 Plus ప్రాసెసర్‌ 12GB ర్యామ్‌తో ఈ ఫోన్ వస్తుంది. దీని ధర ఇంచుమించుగా రూ.45వేలు ఉండొచ్చు. మేలో ఈ ఫోన్‌ మార్కెట్‌లోకి వస్తుందని పలువురు టిప్‌స్టర్లు సూచించారు.

     Galaxy A24 5G

    శాంసంగ్‌ నుంచి రాబోతున్న మరో మిడ్ రేంజ్‌ 5G ఫోన్‌ ఇది. జూలైలో విడుదలయ్యే అవకాశముంది. Snapdragon 695 చిప్‌సెట్‌,  6 GB RAMతో వస్తుంది. 64 MP + 5 MP + 2 MP ట్రిపుల్ కెమెరా సెటప్‌, 5000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర సుమారు రూ.25వేలు ఉంటుందని అంచనా.

    Huawei P60 Pro

    హవేవి నుంచి రాబోయే ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ ఇది. Qualcomm Snapdragon 8+ Gen 1ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇప్పటికే చైనాలో విడుదలైన ఈ ఫోన్‌ గ్లోబల్‌ మార్కెట్‌లోనూ అడుగుపెడుతుందని తెలుస్తోంది. 

    వీటితో పాటు ఇప్పటికే లాంచ్‌ కన్ఫర్మ్‌ అయిన ఫోన్లు కూడా ఉన్నాయి. ఏప్రిల్‌ 12న Realme Narzo N55 లాంచ్‌ అవుతుంది. Asus ROG Phone 7 ఏప్రిల్‌ 13న గ్లోబల్‌ మార్కెట్‌లో విడుదల కానుంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv