ప్రముఖ టెక్ కంపెనీ పోకో (Poco) భారత మార్కెట్‌లో సరికొత్త స్మార్ట్ ఫొన్‌ను మీడియం బడ్జెట్‌లో విడుదల చేసింది. ఈ మొబైల్‌ను కంపెనీ ‘పోకో ఎక్స్6 నియో’ (POCO X6 Neo) మోడల్ పేరుతో ఎంతో శక్తివంతమైన ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. ఇందులోని ఫీచర్లు టెక్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు ఇదే ప్రైస్ సెగ్మెంట్లో రెడ్‌మీ 13c విడుదలైంది. దీనిలో ఆకట్టుకునే ఫీచర్లు అయితే ఉన్నాయి. రూ.15 వేల లోపు కొత్తగా ఫోన్ కొనాలని భావించే వారికి వీటిలో ఏది బెస్ట్ ఛాయిసో ఓసారి సమీక్షిద్దాం.పథ్యంలో POCO X6 నియో స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్లు, ఇతర విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెుబైల్ స్క్రీన్
Poco X6 Neo మెుబైల్.. 6.67 అంగుళాల AMOLED స్క్రీన్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. దీనికి 1080 x 2400 pixels రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, Corning Gorilla Glass 5 ప్రొటెక్షన్, 1,000 nits peak brightness అందించారు. ఈ ఫోన్ Android 14 OS, Mediatek Dimensity 6080 ప్రొసెసర్‌పై పని చేస్తుంది. Octa-core సీపీయూ, Mali-G57 MC2 జీపీయూ ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌గా ఉన్నాయి.
మరోవైపు Redmi 13C మెుబైల్ 6.74 అంగుళాల full HD+ IPS LCD స్క్రీన్‌తో రానుంది. దీనికి హై క్వాలిటీ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందించారు. Android 13 ఆధారిత MIUI 14.0.1 ఆపరేటింగ్, MediaTek Helio G85 SoC ప్రొసెసర్‌తో ఈ ఫోన్ పనిచేయనుంది.
ర్యామ్ & స్టోరేజ్
ఈ పోకో మెుబైల్ రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి అందుబాటులో ఉంది. 8GB RAM / 128GB ROM, 12GB RAM / 256GB స్టోరేజ్‌తో ఆప్షన్లలో పొందవచ్చు. ర్యామ్‌ను 24GB వరకూ వర్చువల్‌గా పెంచుకునే ఆప్షన్ ఉంది.
ఈ రెడ్‌మీ మెుబైల్ రెండు వేరియంట్లలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. 4GB RAM / 128GB ROM, 8GB RAM / 256GB స్టోరేజ్ సామర్థ్యంతో వచ్చింది.
బ్యాటరీ
Poco X6 Neo మెుబైల్‌ను పవర్‌ఫుల్ బ్యాటరీని కలిగి ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కలిగిన Li-Po 5000mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీని మెుబైల్‌కు ఫిక్స్ చేశారు. ఇది మెుబైల్‌ను చాలా ఫాస్ట్‌గా ఛార్జ్ చేయడంతో పాటు ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. USB Type C సాయంతో మెుబైల్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు.
రెడ్‌మీ 13సీ మెుబైల్ పవర్‌ఫుల్ బ్యాటరీ సెటప్‌తో వచ్చింది. 5000 mAh Li-Po బ్యాటరీతో ఫోన్ రాబోతున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ మెుబైల్‌కు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది.
కెమెరా
ఈ నయా పోకో మెుబైల్‌లో ప్రధానంగా ఆకర్షిస్తున్న ఫీచర్ కెమెరా. దీనిని డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో తీసుకొచ్చారు. ఇందులో ఏకంగా 108MP ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే 2MP డెప్త్ సెన్సార్‌ను ఫిక్స్ చేశారు. ముందువైపు సెల్ఫీ కోసం 16MP కెమెరాను అమర్చారు. ఈ మెుబైల్ ద్వారా నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.
ఈ మెుబైల్‌లో కూడా 12C మోడల్ మాదిరి డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌ను తీసుకొచ్చారు. 50MP ప్రైమరీ కెమెరా + 2MP మాక్రో సెన్సార్ ఫోన్‌కు వెనక భాగంలో అమర్చారు. ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాలతో నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చు.
కనెక్టివిటీ ఫీచర్లు
Poco X6 Neo మెుబైల్…Wi-Fi 802.11 a/b/g/n/ac, Bluetooth 5.3, GPS, GLONASS, GALILEO, BDS వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే సైడ్ మౌంటెండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యాక్సిలోమీటర్ (accelerometer), గైరో (gyro), ప్రాక్సిమిటీ (proximity), కాంపస్ (compass) సెన్సార్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి. రెడ్‌మీ మెుబైల్.. 4G నెట్‌వర్క్, Dual SIM + microSD, Wi-Fi 5GHz, 3.5mm ఆడియో జాక్, 68 x 78 x 8.09mm కొలతలతో 192g బరువును కలిగి ఉండనుంది.
కలర్ ఆప్షన్స్
ఈ నయా మెుబైల్‌ను పోకో మూడు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అస్ట్రాల్ బ్లాక్ (Astral Black), హారిజాన్ బ్లూ (Horizon Blue), మార్టియన్ ఆరెంజ్ (Martian Orange) రంగుల్లో ఈ ఫోన్‌ను పొందవచ్చు.
రెడ్‌మీ 13సీ మెుబైల్ మెుత్తం నాలుగు రంగుల్లో రానున్నట్లు కంపెనీ రివీల్ చేసిన ఫొటోలను బట్టి తెలుస్తోంది. బ్లాక్ (Black), బ్లూ (Blue), లైట్ బ్లూ (Light blue), లైట్ గ్రీన్ (Light green) కలర్ ఆప్షన్స్‌తో లాంచ్ కానుంది.
ధర ఎంతంటే?
అమెజాన్‌లో పోకో ఎక్స్6 నియో 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,999 కాగా.. 12జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.17,999గా ఉంది. HDFC, SBI, Axis Bank కార్డు కొనుగోలుపై ఆఫర్లు పొందవచ్చు.
అమెజాన్‌లో రెడ్ మీ13C 6జీబీ+128 ధర రూ.12,999 ఉండగా.. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.14,499గా ఉంది.
చివరగా
ఈ రెండు ఫోన్లు ఫీచర్ల పరంగా చాలా సిమిలర్‌గా ఉన్నాయి. పోకో కంటే కాస్త ధర తక్కువగా ఉండాలనుకుంటే రెడ్‌మీ 13C 5G మొబైల్‌ను ఎంచుకోవచ్చు. ఆఫర్స్ ఉపయోగించుకుంటే మరికొంత ధర తగ్గుతుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!