• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Poonam Pandey Dies: సంచలనాలకు కేరాఫ్‌ ‘పూనం పాండే’ ఇకలేరు.. ఆమె ఎంత ఫేమస్సో తెలుసా?

    వివాదాస్పద నటి, ఇంటర్నెట్ సంచలనం పూనమ్ పాండే (Poonam Pandey) కన్నుమూశారు. గర్భాశయ క్యాన్సర్ కారణంగా ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. 

    గత కొంత కాలంగా సర్వైకల్ క్యాన్సర్‌ (Cervical Cancer)తో బాధపడుతున్న ఆమె.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 

    32 ఏళ్లకే ఆమె చనిపోవడంతో కుటుంబసభ్యులు, మిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అటు సినీ ఇండస్ట్రీలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.

    పూనమ్ పాండే తన నటన కంటే.. వివాదాస్పద ప్రకటనలతోనే తరచూ వార్తల్లో నిలిచేవారు. తన స్టైల్, బోల్డ్ లుక్స్‌తో అందరిని ఆకట్టుకునేవారు. 

    2011 వరల్డ్ కప్ (2011 World Cup) ఫైనల్‌కు ముందు పాండే (Poonam Pandey Dies) చేసిన ఒక వీడియో అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. 

    భారత జట్టు ఫైనల్ మ్యాచ్‌లో గెలిస్తే తాను బట్టలు విప్పుతానని పూనం పాండే చేసిన ప్రకటన యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది.

    ఈ బోల్డ్‌ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం (Poonam Pandey Dies) సృష్టించాయి. ఆమె ధైర్యానికి, సాహసోపేతమైన నిర్ణయాలకు ఇవి అద్దం పడతాయని ఆ సందర్భంలో కొందరు కామెంట్లు కూడా చేశారు. 

    పూనం పాండే వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించింది. ‘గ్లాడ్రాగ్స్‌ మన్‌హంట్‌ & మెగా మోడల్‌ కంటెస్టెంట్‌’ పోటీల్లో ఆమె టాప్‌-9లో నిలిచారు. 

    2013లో ‘నషా’ అనే బోల్డ్‌ చిత్రం ద్వారా పూనం బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2014లో ‘లవ్‌ ఇజ్‌ పాయిజన్‌’ అనే కన్నడ చిత్రంలోనూ ఆమె నటించింది.. 

    తెలుగులోనూ పూనం పాండే (Poonam Pandey Dies) ఓ సినిమా చేసింది. 2015లో ‘మాలిని & కో’ అనే చిత్రంలో ఆమె నటించింది. 

    ఆ తర్వాత ‘ఆ గయా హీరో’ చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌ చేసిన పూనం పాండే.. చివరిగా బాలీవుడ్‌లో ‘ద జర్నీ ఆఫ్‌ కర్మా’ (2018) చిత్రంలో ఆమె నటించింది. 

    బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగాన రనౌత్‌ (Kangana Ranaut) హోస్ట్‌గా వ్యవహరించిన లాకప్‌ తొలి సీజన్‌లో ఆమె కంటెస్టెంట్‌గా పాల్గొనడం గమనార్హం. 

    2020 కొవిడ్‌ సమయంలో పూనం పాండే తన బాయ్‌ ఫ్రెండ్‌ శ్యామ్‌ను పెళ్లి చేసుకుంది. క్వారంటైన్‌ నిబంధనల కారణంగా వీరి పెళ్లి నిరాడంబరంగా జరిగింది. 

    అయితే 11 రోజులకే భర్తపై ముంబాయి పోలీసులు కంప్లైంట్‌ ఇచ్చి ఈ భామ వార్తల్లో నిలిచింది. భర్త తనను మానసికంగా వేధిస్తూ చిత్ర హింసలకు గురిచేస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv