2025 ఆస్కార్‌కు మన దేశం నుంచి ‘లాపతా లేడీస్’ అధికారికంగా ఎంపికైన విషయం విదితమే. దీంతో ఇందులో కీలక పాత్ర పోషించిన ప్రతిభా రత్న పేరు ఒక్కసారిగా వైరల్ అవుతోంది.
తొలి చిత్రంతోనే ఆస్కార్ బరిలో నిలిచేందుకు రెడీ అవ్వడంతో ఈమె గురించి తెలుసుకునేందుకు సినీ లవర్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.
తను నటించిన లాపతా లేడీస్ భారత్ తరపున ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపికవ్వడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ప్రతిభా తెలిపింది.
‘లాపతా లేడీస్’ సెలక్ట్ కావాలని తాను ఎంతగానో కోరుకున్నానని, ఫైనల్‌గా తమ ఆశలు నిజమయ్యాయని ప్రతిభా పేర్కొంది.
ఇక ‘లాపతా లేడీస్’ చిత్రానికి బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించారు. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్ ముఖ్య పాత్రలు పోషించారు.
ప్రతిభా రత్న వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమె డిసెంబర్ 17, 2000లో హిమాచల్ ప్రదేశ్‌లోని షిమ్లాలో జన్మించింది.
స్కూల్లో చదువుకునే రోజుల్లోనే రంగస్థలంలో నటించింది. నటనపై ఆసక్తితో సోదరితో కలిసి సిమ్లా నుంచి ముంబయికి వచ్చేసింది.
అలా ముంబయిలో ఫిల్మ్ మేకింగ్‌లో డిగ్రీ పూర్తి చేసింది. నటనలో కావాల్సిన అన్ని మెళుకువులను నేర్చుకుంది.
ఈ క్రమంలోనే నృత్యంలోనూ ప్రత్యేక శిక్షణ తీసుకుంది. పలు స్టేజీ షోలలో ప్రదర్శన ఇచ్చి ప్రశంసలు అందుకుంది.
‘కురబాన్ హువా’ సీరియల్ ద్వారా 2020లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. నాలుగేళ్ల పాటు టెలివిజన్‌లో అలరించింది.
‘లాపతా లేడీస్’ చిత్రం ద్వారా తొలిసారి బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇందులో జయా సింగ్/పుష్ప రాణిగా కనిపించి ఆకట్టుకుంది.
బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండీ’ వెబ్‌సిరీస్‌లోనూ ఈ అమ్మడు నటించింది. షమా అనే పాత్రలో కనిపించింది.
ఫిట్‌నెస్‌కు ప్రతిభ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటుంది. ఆసనాలు, స్టంట్‌లతో ఎప్పుడూ ఫిట్‌గా ఉండే ప్రయత్నం చేస్తుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ప్రతిభా రత్న చురుగ్గా వ్యవహరిస్తోంది. తన గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
ప్రస్తుతం ప్రతిభా రత్న అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ను 1.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె షేర్ చేసిన ప్రతీ ఫొటోను లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?