• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Pushpa 2 Dialogues: ‘పుష్ప 2’లో గూస్‌బంప్స్‌ తెప్పించిన డైలాగ్స్‌.. ఓ లుక్కేయండి! 

    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం డిసెంబర్‌ 5న వరల్డ్‌ వైడ్‌గా విడుదలైంది. ఈ సినిమాకు సర్వత్రా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. అల్లు అర్జున్ నటన, యాస, బాడీ లాంగ్జేవ్‌ నెక్స్ట్‌ లెవల్లో ఉన్నాయంటూ ఆడియన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న జీవించేసిందంటూ ప్రశంసిస్తున్నారు. బన్నీకి సుకుమార్ ఇచ్చిన మాస్ ఎలివేషన్స్ పూనకాలు తెప్పించిందని చెబుతున్నారు. డైలాగ్స్ (Pushpa 2 Dialogues) కూడా సినిమాలో బాగా పేలాయని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ ప్రారంభ సీన్‌ నుంచి క్లైమాక్స్‌ వరకూ ఉన్న హైలెట్‌ డైలాగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం. 

    అల్లు అర్జున్‌ ఎంట్రీ డైలాగ్‌

    జపాన్‌ పుష్ప రాజ్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ను చూపించారు దర్శకుడు సుకుమార్‌. పుష్ప నుంచి ఎర్ర చందనం తీసుకున్న జపాన్ డీలర్లు డబ్బు ఇవ్వకుండా మోసం చేస్తారు. ఈ క్రమంలో కంటైనర్‌లో దుడ్డుతో పాటు వెళ్లిన పుష్ప వారికి చిక్కుతాడు. ఈ క్రమంలో వచ్చే ఎంట్రీ డైలాగ్ హైలేట్‌గా నిలుస్తుంది. జపాన్‌ భాషలో బన్నీ మాట్లాడటం విశేషం. 

    పుష్ప రాజ్‌: హలో! బాగుండారా? నా జపాన్‌ బ్రదర్స్‌. (జపాన్‌ భాషలో)

    ఎప్పటి నుండో నా సరుకు యాడికెళ్తుందో సూడాలని అనుకునే వాడిని. ఇన్నాళ్లకు కుదిరుండాది. అంటూ బన్నీ తనను బంధించిన వారిపై విరుచుకుపడతాడు. 

    కమెడియన్‌ సత్య : యో.. ఏందప్ప నీకు జపాన్‌ భాష వచ్చా?

    పుష్ప రాజ్‌ : నలభై దినాలు కంటైనర్‌లో ప్రయాణిస్తూనే 30 దినాల్లో జపాన్‌ భాష (30 రోజుల్లో జపాన్‌ నేర్చుకోవడం ఎలా అనే బుక్‌ను చూపిస్తూ) నేర్చుకున్నాలే అప్ప. ఎట్టా ఉండాది నా జపనీస్‌ భాష.

    సత్య: అదిరి పోయింది.. అదిరిపోయింది. ఇంతకీ జపాన్‌ ఎందుకు వచ్చినావ్‌ అప్ప?

    పుష్పరాజ్‌ : జపాన్‌కు దుడ్డు (ఎర్ర చందనం) వచ్చింది గానీ, డబ్బు రాలేదప్ప. ఇండియా వాడ్ని మోసం చేస్తే ఎట్టా ఉంటదో సూపించడానికి వచ్చినా..

    సత్య: పైసలు కోసం ఇంత దూరం వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటావా?

    పుష్పరాజ్‌: నాకు రావాల్సింది అణా అయినా, అర్ధ అణా అయినా.. అది ఏడు కొండలు పైన ఉన్నా అయినా, ఏడు సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్పగాడి అలవాటు. 

    పుష్పరాజ్‌: ఐయామ్‌ యూనివర్స్ బాస్‌.. పుష్ప ఈజ్‌ ద బాస్‌ (జపాన్‌ భాషలో) 

    పోలీసు స్టేషన్‌ డైలాగ్స్‌

    ఎర్ర చందనం తరలిస్తున్న పుష్ప రాజ్‌ మనుషులను ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ పట్టుకొని జైల్లో వేస్తాడు. తన వారికోసం స్టేషన్‌కు వచ్చిన పుష్ప చెప్పే డైలాగ్స్ మెప్పిస్తాయి. 

    పుష్ప: పుష్ప: నా పిల్లకాయలను లోపల ఏశావా ఏంది? ఒక గంటలో మా శీను గాడి (జైల్లో ఉన్న వ్యక్తి) పెళ్లి ఉండాది. వాళ్లని తోలుకపోవడానికి వచ్చిన.

    సీఐ: శీనుగాడి పేరున ఎఫ్‌ఐఆర్‌ రాశారు. మెుత్తం 230 మంది. ఒక్కరు తక్కువైనా లెక్క తేడా వస్తాది. 

    పుష్ప: అట్నా.. రేయ్‌ (తన పక్కన ఉన్న వారితో) మన వాళ్లలో శ్రీనివాస్‌ ఎవరు ఉన్నార్రా. (ఒక వ్యక్తి నేనున్నా అంటూ ముందుకు వస్తాడు)

    సీఐ: అదెట్లా కుదిరిద్ది పుష్ప. ముందు మాదిరి లేదు పుష్ప. రూల్స్‌ అన్నీ మారిపోయాయ్‌.

    పుష్ప : సీఐ గారికి రూల్స్ మారి పోయాయంట్రా. నేను చెప్పేదా రూల్‌ ఏంటో. చెవులు పెద్దవి చేసుకొని వినండి. ఈడ జరిగేదంతా ఒకటే రూలు. అది పుష్పగాడి రూలు.

    సీఎంతో మీటింగ్‌ అప్పుడు..

    ఎంపీ సిద్దప్ప (రావు రమేష్‌)తో కలిసి సీఎంను కలవడానికి పుష్ప బయలుదేరతాడు. ఈ క్రమంలో సీఎంతో ఫొటో దిగమని శ్రీవల్లి సూచిస్తుంది. దీంతో సీఎంతో ఫొటో దిగేందుకు శాలువ కప్పుతుండగా సీఎం హేళన చేస్తూ చెప్పే డైలాగ్‌ కథను మలుపు తిప్పుతాయి. 

    ఎంపీ సిద్ధప్ప: పుష్ఫ భార్య మంచి ఫొటో అడిగుండాది. ఫొటో బాగా తీయ్‌ (కెమెరామెన్‌తో)

    సీఎం: ఏంటీ సిద్దప్పు నువ్వు..

    ఎంపీ సిద్దప్ప: ఏ అన్నా..

    సీఎం: ఈ స్మగ్లర్లు.. పార్టీకి ఫండ్‌ ఇచ్చినంత ఈజీగా మనం ఫొటోలు ఇవ్వలేం. చెప్పులు కాళ్లను మోస్తున్నాయని చేతులకు తొడుక్కుంటామా ఏందీ.

    సీఎం: సిద్దప్ప.. పిల్లోడు కదా. పెళ్లాం మాట విని ఫొటోల కోసం వచ్చుంటాడు. పుష్ప.. పెళ్లాం మాట విని బాగుపడినోడు ఎవ్వడు లేడు. మదిలో పెట్టుకో.

    సీఎంతో మీటింగ్‌ తర్వాత..

    సీఎం చెప్పిన మాటలకు బాగా హార్ట్‌ అయిన పుష్ప బయటకు వచ్చి సోఫాలో కూర్చొని ఉంటాడు. సీఎంతో మాట్లాడిన కొద్దిసేపటికి ఎంపీ సిద్దప్ప (రావు రమేష్‌) బయటకు వస్తాడు. ఈ క్రమంలో పుష్ప – సిద్ధప్ప మధ్య వచ్చే సంభాషణ సినిమాకు కీలక మలుపు తిప్పుతుంది. 

    పుష్ప: ఏం.. సార్‌. పని అయ్యుండాదే?

    ఎంపీ సిద్దప్ప: శాఖ ఏంటో తెలీదు గానీ.. మినిస్ట్రీ అయితే ఇస్తా అన్నాడు. మనమే కొంచెం దుడ్డు (లంచం) ఎక్కువ తడపాలా!

    పుష్ప : అది కాదు.. షెకావత్‌ (ఫహాద్‌ ఫాజిల్‌) ట్రాన్స్‌ఫర్ అయ్యుండాదా అని అడుగుతున్నా?

    ఎంపీ సిద్దప్ప: కుదరదు అన్నాడప్ప. పోలీసు వాళ్లతో సర్దుకుపోవాలి గానీ వచ్చిన ప్రతీ వాడితో కలియపెట్టుకొని ట్రాన్సఫర్‌ కోరితే కుదరదన్నాడప్పా.  నువ్వు కూడా వద్దన్నావని విడిచేసినా.

    పుష్ప: వాడు వద్దనడం వేరు.. నేను వద్దనడం వేరు. చాలా తేడా ఉండాది. 

    ఎంపీ సిద్దప్ప: ఏందప్ప మాట మారుతుండాది? సీఎం గారిని ఆడు ఈడు అంటున్నావ్‌. ఫొటో ఇవ్వలేదని మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నావ్‌ కదా.

    పుష్ప : అదేం లేదప్ప. సీఎం అన్నాక సవాలక్ష సమస్యలు ఉంటాయి. రేపు ఏ సీఎం అయినా అలాగే అంటాడు. 

    ఎంపీ సిద్దప్ప: నేను అయితే అలా ఎందుకు అంటా? శుభ్రంగా ఇస్తా

    పుష్ప : ఏందీ.. ఫొటో ఇస్తావా?

    ఎంపీ సిద్దప్ప: ఇస్తానప్పా.. ఎందుకు ఇవ్వను..

    పుష్ప : అయితే మీరే సీఎం (సిద్దప్ప వెంటనే షాకవుతాడు)

    ఎంపీ సిద్దప్ప: ఏందీ (షాక్‌లో)

    పుష్ప : మీరే సీఎం అప్పా.. 

    ఎంపీ సిద్దప్ప: నేను సీఎం ఆ.. (నవ్వుతూ) మతి ఉండే మాట్లాడుతున్నావా?

    పుష్ప: ఏమప్పా.. పుష్ప లాంటోడ్ని పక్కన పెట్టుకొని పిల్లి పిత్రి పదవులు (మంత్రి) ఏంటి సామి. పెద్దగా ఆలోచించండి సారు. నా పక్కన పుష్ప లాంటోడు ఉంటే నేను అట్లనే ఆలోచిస్తా. 

    ఎంపీ సిద్దప్ప: ఆలోచించొచ్చు గానీ.. సీఎం అంటే చాలా అవుద్దీ అప్పా.

    పుష్ప : ఎంత అవుతది?

    ఎంపీ సిద్దప్ప: తక్కువలో తక్కువ రూ.100 కోట్లు.

    పుష్ప : రూ.500 కోట్లు ఇస్తా.. సరిపోద్దా (థియేటర్లలో ఒకటే విజిల్స్‌)

    ఎంపీ సిద్దప్ప: అంత డబ్బు ఎట్టా తెస్తావప్పా?

    పుష్ప: దుడ్డు (డబ్బు) గురించి పుష్పకు వదిలేసి.. ఢిల్లీ వెళ్లి ప్రతాప్‌సింగ్‌ (జగపతిబాబు)ను కలవండి.

    జగపతి బాబుతో ఫస్ట్ ఫోన్‌కాల్‌..

    కేంద్ర మంత్రి ప్రతాప్‌సింగ్‌ (జగపతిబాబు) సింగ్‌తో పుష్ప ఫోన్‌లో మాట్లాడే సంభాషణ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది. సీఎం సీటు గురించి ఎంపీ సిద్దప్ప అతడితో మాట్లాడుతున్న క్రమంలోనే ప్రతాప్‌ సింగ్ సోదరుడ్ని పుష్ప కలిసి రూ.5 కోట్లు ఇస్తాడు. దీంతో తన అన్నకు ఫోన్‌ చేసి ఆ డబ్బు గురించి చెప్తాడు. అప్పుడు పుష్ప-ప్రతాప్‌ సింగ్‌ సంభాషణ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుంది.  

    పుష్ప: హలో.. నమస్తే! నా పేరు పుష్ప. మార్కెట్‌లో అందరూ ఎర్ర చందనం పుష్ప అంటుంటార్లే.

    ప్రతాప్‌సింగ్‌: తెలుసప్పా.. కొండారెడ్డి పావలా వాటానే కదా నువ్వు. వింటూనే ఉన్నా. 

    పుష్ప: నువ్వు పావల వాటా గాడితో మాట్లాడుతున్నావ్‌ అనుకుంటే.. నేను క్వారీలో లారీ ఆపే గుమస్తా గాడితో మాట్లాడుతున్నాని ఫీలవ్వాల్సి వస్తది. చరిత్రలు ఎందుకులే అన్నా తవ్వుకోవడం.

    ప్రతాప్‌సింగ్‌: ఏందీ ఆ రూ.5 కోట్ల కథ.

    పుష్ప: అది నీకు కాదులే అన్న. నీతోడ బుట్టినోడికి. ఫోన్‌ కలిపిచ్చినందుకు. ఎన్ని దినాలు పాత సోఫాలో కూర్చొని ఉంటావ్‌. నీకో కొత్త కూర్చి పంపిస్తాలే. దాంట్లో కూర్చో. 

    పుష్ప: సోఫా అంటే మామూలు సోఫా కాదన్న అది. చానా కాస్ట్లీ సోఫా. రూ.25 కోట్ల రూపాయల సోఫా అది. 

    ప్రతాప్‌ సింగ్: ఏ టెండర్‌ కోసమో చెప్పు. క్వారీనా? మైనింగా?. స్టేట్‌లో ఏ పక్క కావాలో చెప్పు.

    పుష్ప: హా హా హా..  మెుత్తం స్టేటే కావాలా. సిద్దప్ప స్టేట్‌కి సీఎం కావాలా.

    ప్రతాప్‌ సింగ్‌: నువ్వు నిర్ణయం తీసుకుంటే సరిపోద్దా?

    పుష్ప: సరిపోద్ది అన్నా. పుష్పగాడి నిర్ణయం తిరుపతి లడ్డు మాదిరి. ఒకసారి ఇచ్చినాక కాదనడానికి లే. కళ్లకద్దుకొని తీసుకోవాల్సిందే. సిద్దప్ప సీఎం అయ్యేది ఖాయం. కాదంటే నాకాడా చాలా సోఫాలు ఉన్నాయిలే.

    ప్రతాప్‌ సింగ్‌తో మీటింగ్ తర్వాత

    ఎంపీ సిద్దప్ప: ఏందప్ప ఇది ఫోన్ కనిపినోడికి రూ.5 కోట్లు, మాట్లాడినోడికి రూ.25 కోట్లా. ఇట్టా సింటికేట్‌ డబ్బంతా పొప్పులు, బెల్లాల మాదిరి పంచుకుంటూ పోతే ఎవరు సమాధానం చెప్పేది. 

    పుష్ప: నీకు ఇచ్చే లెక్క మారదు సారు.. సిండికేట్‌కు వచ్చే లెక్క మారుద్ది.

    ఎంపీ సిద్దప్ప: టన్నుకు అదే రూ.కోటిన్నర లెక్క.. ఎట్లా మారుద్ది.

    పుష్ప: మంగళం శ్రీనుకి అమ్మితే టన్నుకు రూ.50 లక్షలు.. మురుగన్‌కు అమ్మితే టన్ను రూ.కోటిన్నర. అదే మురుగన్‌ అమ్మేటోడికి మనం పోగలిగితే..

    ఎంపీ సిద్దప్ప: ఆశ్చర్యం, ఆనందం కలసిన ముఖంతో 

    పుష్ప: పుష్పగాడి చూపు దేశం దాటేసుండాది. ఏందీ.. పుష్ప అంటే నేషనల్‌ అనుకుంటివా? ఇంటర్‌నేషనల్‌..

    ఇంటర్నేషనల్‌ స్మగ్లర్‌తో డీల్‌..

    స్మగ్లర్‌: పుష్ప రెండక్షరాలు.. నామ్ ఛోటా హై లేకిన్‌ సౌండ్‌ బడా.. బూమ్‌

    పుష్ప: సౌండ్‌ నచ్చుండాదా నీకు.. ఇప్పుడు దందా మాట్లాడదాం చెప్పబ్బా.

    స్మగ్లర్‌: మాల్‌ ఎంత (హిందీలో)

    పుష్ప: 2000 టన్నులు (ఎర్ర చందనం)

    స్మగ్లర్‌: హా హా హా.. టన్నుకు ఎంత?

    పుష్ప : రూ. రెండున్నర కోట్లు

    స్మగ్లర్: జోక్‌ చేస్తున్నావా? పుష్ప

    పుష్ప: దందా విషయంలో పుష్ప జోకులెయ్యడు. పుష్పతో దందా అంటే చాలా మజా వస్తుంది. 

    స్మగ్లర్‌: సరే 2000 టన్నుల మాల్‌ రూ.5000 కోట్లు

    పుష్ప: కాదు.. రూ.4,900 కోట్లు

    స్మగ్లర్‌: రూ.100 కోట్లు ఎందుకు తగ్గించావ్‌ పుష్ప? మాల్‌ సరిపడ లేదా?

    పుష్ప: మిగతా రూ.100 కోట్లకి నవ్వుతూ.. (హెలికాఫ్టర్‌ తీసుకొని వెళ్లిపోతాడు)

    సిండికేట్ మీటింగ్‌ సమయంలో..

    సిండికేట్‌ సభ్యులు: షెకావత్‌ మన కోసం కాచుకొని ఉన్నాడు. ఈ సమయంలో అంత సరుకు పంపించడం కరెక్టెనా?

    పుష్ప: కరెక్టో కాదో పుష్ప ఆలోచించడప్ప.. ఒరు నిర్ణయం తీసుకుంటాడు. అది కరెక్ట్ అవుతుంది అంతే. 

    పుష్ప – రష్మిక సంభాషణ

    ఓ సీన్‌లో శ్రీవల్లి (రష్మిక) కాలుకి దెబ్బ తగలుతుంది. పుష్ప స్వయంగా ఆమె కాలు పట్టుకొని మందు రాస్తుంటాడు. అప్పుడు వారి మధ్య వచ్చే డైలాగ్స్‌ క్యూట్‌గా అనిపిస్తాయి.

    శ్రీవల్లి: కాలు వదిలేయ్‌ సామి..

    పుష్ప: ఏమి..

    శ్రీవల్లి: అసలే మీరు పుష్పరాజ్‌. పెళ్లా కాలు పట్టుకుంటాడని నాకు మాట రానీకు.

    పుష్ప: ఏయ్‌.. పౌరుషంలోనే కాదు.. ప్రేమ విషయంలోనూ పుష్పరాజ్‌ తగ్గేదేలే (అంటు శ్రీవల్లి కాలితో తన గడ్డని నిమురుతాడు)

    పుష్ప – షెకావత్‌ 

    ఫస్ట్‌ పార్ట్‌ క్లైమాక్స్‌లో జరిగిన దానికి పుష్ప సారీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ మీటింగ్‌ ఏర్పాటు చేస్తాడు. అప్పుడు పుష్ప- షెకవాత్‌ మధ్య వచ్చే సంభాషణ వారి మధ్య మరింత శత్రుత్వాన్ని పెంచుతుంది.

    ఎంపీ సిద్దప్ప: పుష్ప చెప్పేయప్పా

    పుష్ప: సారీ చెప్పే ముందు పుష్ప చేసే ఎటకారపు చర్యలు భలే నవ్వు తెప్పిస్తాయి.

    పుష్ప: సరే.. సారీ

    షెకావత్‌ : బ్రహ్మాజీతో పుష్ప సారీ చెప్పింది విన్నావా?

    బ్రహ్మాజీ: సారీ చెప్పింది కాదు సార్‌.. చెప్పాడు అనాలి.

    షెకావత్‌: పుష్ప ఫైర్‌ అయ్యుంటే చెప్పాడు అనేవాడ్ని.. సారి చెప్పి ఫ్లవర్‌ అయ్యాడుగా అందుకే చెప్పింది. 

    ‘పుష్ప అంటే ఫైర్‌ అనుకుంటివా.. వైల్డ్‌ ఫైర్‌’

    జాతర సందర్భంలో వచ్చే డైలాగ్స్‌

    అజయ్‌: వీరందర్నీ కొట్టినావని చెప్పి నిన్ను మాలో కలుపుకోవాలా? నువ్వు ఎప్పటికీ ఉత్త పుష్పరాజే.

    శ్రీవల్లి: యో పెద్ద మనిషి నీ కూతుర్ని కాపాడితే అంతా డ్రామా లాగా అనిపిస్తుందా? నీ బిడ్డకే కాదు ఏ ఆడబిడ్డైనా ఇట్లానే కాపాడతాడు. ఓ జన్మయ్య నీది.

    పుష్ప అమ్మ: శ్రీవల్లి.. పెద్ద చిన్న చూసి మాట్లాడు.

    శ్రీవల్లి: నీ కొడుకును అంటే నువ్వు ఊరుకుంటావేమోగానీ, ఎవడైనా నా మెుగుడ్ని అంటే నేను ఊరుకుండేదే లేదు. 

    కిడ్నాపర్లకు పుష్పరాజ్‌ మాస్‌ వార్నింగ్‌

    సినిమా చివర దశకు చేరుకునే క్రమంలో అజయ్‌ కూతుర్ని కొందరు కిడ్నాప్‌ చేస్తారు. ఓ న్యూస్‌ ఛానెల్‌ వేదికగా కిడ్నాపర్లకు పుష్పరాజ్‌ ఇచ్చే వార్నింగ్‌ హైలెట్ అనిపిస్తుంది. 

    పుష్పరాజ్‌: నా పేరు పుష్ప.. పుష్ప రాజ్‌. మీరు నాకు పరిచయం అక్కర్లేదు పాయింట్‌కు వస్తున్నా.

    పుష్పరాజ్‌: బిడ్డను ఎత్తుకు పోతార్రా మీరు.. అంత దమ్ముండాదా? కొడ**రా. ఇప్పుడు చెబుతున్నా చెవులు పెద్దవి చేసుకొని వినండి. 

    పుష్పరాజ్‌: మీకు ఈ క్షణం నుంచి గంట టైమ్ ఇస్తాండా. ఆ బిడ్డను యాడ నుంచి ఎత్తుకెళ్లారో ఆడనే దింపాలా. అట్ట పోయి ఇట్ట వచ్చినట్లుండాలా.

    పుష్పరాజ్‌: అట్ట కాదని ఆ బిడ్డమీద ఒక్క చిన్న గీత పడాలా.. గంగమ్మ తల్లి జాతరలో యాటను నరికినట్లు రప్పా రప్పా నరుకుతా.. ఒక్కొక్కడిని రప్పా రప్పా రప్పా.. 

    మెగా ఫ్యామిలీకి కౌంటర్లుగా అనిపించే డైలాగ్స్‌

    అల్లు అర్జున్‌ వర్సెస్‌ మెగా ఫ్యామిలీ మధ్య వివాదం రాజుకున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేథ్యంలో పుష్ప 2 లోని కొన్ని డైలాగ్స్  చర్చనీయాంశమవుతున్నాయి. చిరు ఫ్యామిలీకి కౌంటర్‌గా వాటిని మూవీలో పెట్టారన్ని మెగా ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ఆ డైలాగ్స్‌పై లుక్కేద్దాం. 

    మీ బాస్‌కే నేను బాస్‌’

    ఒక‌డు ఎదుగుతుంటే చూడ‌లేక వాడు డౌన్ కావాల‌ని కోరుకునేవాళ్లు చాలా మందే ఉంటారు’ 

    ‘నేను తగ్గాలని చాలా మంది చూస్తున్నారు’

    ‘ఎత్తులో ఉన్న‌ప్పుడు ఈగోలు ఉండ‌కూడ‌దు’ 

    ‘పెళ్లాం మాట వింటే ఎట్టుంటాదో ప్రపంచానికి చూపిస్తా’ 

    ‘పావలా పర్సంటేజ్ వాటా గాడివి ఏంటిరా? 

    ‘ఎవడ్రా నువ్వు ఇలాగే వాగితే అనంతపురం తీసుకెళ్లి గుండు కొట్టిస్తా..’

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv