• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ram Nagar Bunny Review: థియేటర్లలోకి యాటిట్యూడ్‌ స్టార్‌ మూవీ.. ‘రామ్‌ నగర్‌ బన్నీ’తో హిట్ కొట్టినట్లేనా? 

    నటీనటులు : చంద్రహాస్‌, విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితు మంత్రా, మురళీధర్‌ గౌడ్‌ తదితరులు

    రచన, దర్శకత్వం : శ్రీనివాస్‌ మెహత్‌

    సంగీతం : అశ్విన్‌ హేమంత్‌

    సినిమాటోగ్రఫీ : అస్కర్‌ అలీ

    ఎడిటిర్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌

    నిర్మాతలు: ప్రభాకర్‌, మలయజ ప్రభాకర్‌

    విడుదల తేదీ: 04-10-2024

    బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్‌ (Prabhakar) కుమారుడు చంద్రహాస్‌ (Chandrahas) యాటిట్యూడ్‌ స్టార్‌ (Attitude Star)గా సోషల్‌ మీడియాలో తెగ పాపులర్ అయ్యాడు. అతడు నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘రామ్‌ నగర్‌ బన్నీ’ గురించి కూడా కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది. సినిమా నచ్చకపోతే టికెట్ డబ్బులు వాపస్‌ అంటూ చంద్రహాస్‌ చేసిన కామెంట్స్‌ తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? యాటిట్యూడ్‌ స్టార్‌ హిట్‌ కొట్టాడా? హీరోగా ఆకట్టుకున్నాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథేంటి

    రామ్‌నగర్ ఏరియాలో ఉండే బన్నీ (చంద్రహాస్‌)కి అమ్మాయిలు అంటే వీక్‌నెస్. చూసిన ప్రతి అ‍మ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. అలా ఏకంగా ముగ్గురితో (విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి)తో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు లవ్‌ ట్రాక్‌ నడిపిస్తాడు. అనుకోని పరిస్థితులు ఎదురై పెళ్లి చేసుకుంటానని ఓ ఆంటీకి సైతం మాటిస్తాడు. ఆమె కంపెనీలోనే ఉద్యోగానికి కూడా చేరతాడు. అయితే ఆంటీపై తనకు ఎలాంటి ఇష్టం లేదని బన్నీ గ్రహిస్తాడు. తను నిజంగా ప్రేమిస్తోందని శైలు (విస్మయ శ్రీ)ని అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే శైలుకు మరొకరితో ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అవుతుంది. అప్పుడు బన్నీ ఏం చేశాడు? శైలు ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? అన్నది తెలియాలంటే థియేటర్లలో చూడాల్సిందే. 

    ఎవరెలా చేశారంటే

    నటుడు చంద్రహాస్‌ పలు వేదికలపై చూపించిన యాటిట్యూడే ఈ సినిమాకు ప్రధాన బలం అయ్యింది. నటుడిగా తొలి చిత్రమే అయినప్పటికీ నటన పరంగా ఎంతో ఆకట్టుకున్నాడు. ఎక్కడా భయం, బెరుకు లేకుండా నటించాడు. డ్యాన్స్‌, పైట్స్‌లో అదరగొట్టాడు. రొమాంటిక్‌ సీన్స్‌లోనూ మెప్పించాడు. శైలుగా చేసిన విస్మయ శ్రీ క్యూట్‌గా ఉంది. బన్నీ ప్రేమించిన మిగతా ముగ్గురు అమ్మాయిలు ఓకే అనిపించారు. బన్నీ తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్ కామెడీ పరంగా తనవంతు ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్ర దారులు పర్వాలేదనిపించారు.

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    దర్శకుడు శ్రీనివాస్ మహత్ యూత్‌ను ఆకట్టుకునే విధంగా ‘రామ్‌ నగర్‌ బన్నీ’ని తెరకెక్కించారు. చంద్రహాస్ కోసమే ఈ కథను రాసినట్టుగా అనిపిస్తుంది. సింపుల్ కథకు అద్భుతమైన స్క్రీన్‌ప్లేను జోడించి ఫుల్ ఎంటర్ టైన్ చేశాడు దర్శకుడు. చంద్రహాస్‌ని ఒక సూపర్ హీరో మాదిరిగా కాకుండా జులాయిగా తిరిగే సాధారణ కుర్రాడిగా చూపించి సక్సెస్‌ అయ్యాడు. సినిమా చూస్తున్నంతసేపు సరదాగా సాగిపోతూ ఉంటుంది. అక్కడక్కడ కామెడీ సీన్స్, కాసిన్ని ఎమోషనల్ సీన్స్, మధ్యలో నాలుగు పాటలు, ఇవి కాదన్నట్లు రెండు ఫైట్స్‌ను కలగలిపి పక్కా కమర్షియల్‌ మూవీగా తీర్చిదిద్దారు. సాగదీత సన్నివేశాలు, ఎమోషనల్‌ సీన్స్‌లో చంద్రహాస్‌ తడబాటు కాస్త మైనస్‌గా చెప్పుకోవచ్చు.  

    టెక్నికల్‌గా 

    సాంకేతిక అంశాల విషయానికొస్తే మూడు పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. కానీ హైదరాబాద్ సిటీనీ చూపించే డ్రోన్ షాట్స్, ఓ పాటలో సెల్ఫీ విజువల్స్ పెద్దగా వర్కౌట్‌ కాలేదు. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. 

    ప్లస్‌ పాయింట్స్‌

    • చంద్రహాస్‌ నటన
    • కమర్షియల్‌ హంగులు
    • సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • సాగదీత సన్నివేశాలు
    • పేలవమైన ఎమోషనల్‌ సీన్స్‌

    Telugu.yousay.tv Rating : 3/5 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv