‘గేమ్ ఛేంజర్’ (Game Changer) తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) చేస్తున్న ప్రాజెక్ట్ ‘RC 16’. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం మైసూర్‌లో షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ నటించనుంది. ఇటీవలే తెలుగు స్టార్ నటుడు జగపతిబాబు సైతం ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా మరో బాలీవుడ్ నటుడు సైతం ‘RC 16’ ప్రాజెక్టులో అడుగుపెట్టాడు. ఈ విషయాన్ని స్పెషల్ పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు.
మున్నా భాయ్ ఆగమనం..
హిందీ వెబ్ సిరీస్ ‘మీర్జాపూర్’ (Mirzapur Series) ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ సిరీస్‌లో మున్నాభాయ్ పాత్ర తెగ హైలెట్ అయ్యింది. సిరీస్ విజయవంతం కావడంలో ఆ పాత్ర చేసిన దివ్యేందు (Divyenndu) కీలక పాత్ర పోషించాడు. అటువంటి దివ్యేందు తాజాగా ‘RC 16′ జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్నితెలియజేస్తూ దర్శకుడు బుచ్చిబాబు (Director Buchi Babu) స్పెషల్ పోస్టు రిలీజ్ చేశాడు. దీనికి ఆసక్తికర క్యాప్షన్ పెట్టాడు. ‘మా భయ్యా, మీ భయ్యా, మున్నా భయ్యా. వెల్‌కమ్ దివ్యేందు. లెట్స్ రాక్ ఇట్’ అని రాసుకొచ్చాడు. అయితే ఇందులో అతడు నెగిటివ్ రోల్ చేసే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు దివ్యేందు రాకతో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దివ్యేందు ఎంత కష్టపడ్డాడో!
బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ 1983 జూన్ 19న జన్మించాడు. ఢిల్లీ యూనివర్సిటీకి అనుసంధానంగా ఉన్న కిరోరి మల్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ చేశాడు. యాక్టింగ్‌లో రెండేళ్ల డిప్లమో కోర్స్ చేశాడు. సినిమాల్లోకి రాకముందు పలు యాడ్స్‌లో దివ్యేందు నటించాడు. ‘ఆజా నచ్లె’ (2007) చిత్రంలో మైనర్ రౌడీగా తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై అడుగుపెట్టాడు. తొలి మూడేళ్లు చిన్న వేషాలు వేసుకుంటూ అనేక స్ట్రగుల్స్ పడ్డాడు. 2011లో వచ్చిన ‘ప్యార్ కా పంచ్‌నామా’ చిత్రంతో ఇండ్రస్ట్రీలో కాస్త గుర్తింపు తగ్గింది. 2018లో వచ్చి మీర్జాపూర్ సిరీస్ అతడి కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. దాని తర్వాత వరుసగా హిందీ చిత్రాల్లో అవకాశాలు దక్కాయి. అదే ఏడాది వచ్చిన ‘బట్టి గుల్ మీటర్ చాలు’ సినిమాలో ముఖ్యమైన పాత్రలో మెరిశాడు. ఆ తర్వాతి ఏడాది ‘బద్నాం గలి’ చిత్రంలో ఏకంగా లీడ్ రోల్ చేశాడు. ఈ ఏడాది ‘మడ్‌గాన్ ఎక్స్‌ప్రెస్’తో హిందీ ఆడియన్స్‌ను పలకరించారు. ప్రస్తుతం హీరోగ ‘అగ్ని’ చిత్రంలో చేస్తున్నాడు. ఇప్పుడు రామ్‌చరణ్ మూవీలో అవకాశం దక్కించుకొని తెలుగు ప్రేక్షకులను నేరుగా ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు.
రెండేళ్లుగా స్ట్రిప్ట్‌పైనే..
దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu) ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించాడు. తన రెండో చిత్రమే రామ్ చరణ్‌తో చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు. RC 16 ప్రాజెక్టు కోసం దాదాపు రెండేళ్ల నుంచి బుచ్చిబాబు వర్క్ చేస్తున్నారు. సోర్ట్స్ డ్రామాగా వీలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా రానుంది. ఇందులో దివ్యేందుతో పాటు కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ (Siva Raj Kumar) సైతం కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ‘పెద్ది’ (RC 16 Title) అనే టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి ఏ.ఆర్. రెహమాన్ బాణీలు అందించనున్నాడు.
‘RC16’ కథ ఇదే?
‘RC16’ చిత్రాన్ని బుచ్చిబాబు వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. మలయుద్ధం కాన్సెప్ట్‌లో ఈ సినిమా రానున్నట్లు టాక్. ఏపీకి చెందిన మల్ల యుద్ద వీరుడు కోడి రామ్మూర్తి నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్రకు తగ్గట్లు బలిష్టంగా కనిపించేలా చరణ్ మేకోవర్ అవుతున్నాడు. ఇందుకు తగ్గట్లుగా బాడీని బిల్డ్ చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే గతంలో ‘బీస్ట్ మోడ్ ఆన్’ అంటూ ఓ ఫొటోను సైతం అభిమానులతో చరణ్ పంచుకున్నాడు. ‘గేమ్ ఛేంజర్’ లుక్‌తో పోలిస్తే చరణ్ బాడీతో పాటు, లాంగ్ హెయిర్, గడ్డం పెంచాడు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ