భారత్‌లో మంచి ఆదరణ కలిగి ఉన్న మెుబైల్ కంపెనీల్లో ‘రియల్‌మీ’ (Realme) ఒకటి. చైనాకు చెందిన ఈ మెుబైల్ తయారీ సంస్థ.. అధునాతన స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తూ వినియోగదారుల అభిమానాన్ని సంపాదించింది. కాగా ఈ సంస్థ తన రియల్‌మీ 11 సిరీస్‌లోని మరో సరికొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్‌మీ 11ఎక్స్ 5జీ (Realme 11x 5G) పేరుతో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆగస్టు 30న ఈ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. రియల్‌మీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ మెుబైల్‌పై అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో ఈ నయా ఫోన్ ప్రత్యేకతలు, ధర, ఫీచర్లు వంటి అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఫోన్ డిస్‌ప్లే
రియల్‌మీ 11ఎక్స్ 5జీ (Realme 11x 5G) మెుబైల్ 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో దీన్ని తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ 13+ రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టమ్‌ను దీనికి అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది.
స్టోరేజ్ సామర్థ్యం
రియల్‌మీ 11ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో లాంఛ్ అయింది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో డైనమిక్ ర్యామ్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో గరిష్టంగా ర్యామ్ 16జీబీ వరకు పెంచుకోవచ్చు.
కెమెరా క్వాలిటీ
రియల్‌మీ 11ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగా పిక్సెల్ పోర్ట్‌రైట్ సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఫిక్స్ చేశారు.
బిగ్ బ్యాటరీ
Realme 11x 5G ఫోన్‌కు బిగ్ బ్యాటరీని అందించారు. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీని ఫిక్స్ చేశారు. ఇది 33వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ మెుబైల్ లాంగ్ బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది.
అదనపు ఫీచర్లు
ఈ మెుబైల్ అద్భుతమైన 5G సేవలను అందిస్తుంది. 4జీ, వైఫై, బ్లూటూత్ 5.2, టైప్ సీ పోర్ట్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి.
కలర్స్
Realme 11X 5G స్మార్ట్‌ఫోన్‌ను రెండు రంగుల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. మిడ్‌నైట్ బ్లాక్, పర్‌పుల్ డాన్ రంగుల్లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు.
ధర ఎంతంటే?
Realme 11X 5G 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999. ఆగస్ట్ 30న సేల్ ప్రారంభం అవుతుంది. SBI , HDFC కార్డుతో కొంటే రూ.1,500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ స్టోర్స్‌తో పాటు రియల్‌మీ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!