• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Realme 12 Pro: రియల్‌మీ నుంచి మరో శక్తివంతమైన ఫోన్‌.. ఫీచర్లు చూస్తే షాకే!

    ప్రముఖ చైనీస్‌ మెుబైల్‌ తయారీ కంపెనీ రియల్‌మీ (Realme) భారత్‌లో సరికొత్త మెుబైల్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. Realme 12 Pro 5G పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. గతేడాది జూన్‌లో తీసుకొచ్చిన ‘రియల్ మీ 11 ప్రో 5G’ మెుబైల్‌లో కీలకమైన అప్‌గ్రేడ్స్‌ చేసి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. తాజాగా విడుదలైన Realme 12 Pro పోస్టర్‌, టీజర్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరోవైపు విడుదలకు ముందే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు బయటకు వచ్చాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. 

    ఫోన్‌ స్క్రీన్‌

    ఈ Realme 12 Pro మెుబైల్‌.. 6.7 అంగుళాల AMOLED స్క్రీన్‌తో రానున్నట్లు సమాచారం. దీనికి 1080p రిజల్యూషన్‌ను అందించినట్లు తెలిసింది. Android v13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, Qualcomm Snapdragon 888 Plus ప్రొసెసర్‌తో ఇది పని చేయనుంది. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    ఈ నయా రియల్‌మీ మెుబైల్‌..  6GB RAM / 128GB ROM, 8GB RAM / 256GB, 12GB RAM / 512 GB, 16GB RAM / 1TB స్టోరేజ్ ఆప్షన్స్‌లో లాంచ్‌ కానున్నట్లు టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. MicroSD కార్డు సాయంతో స్టోరేజ్‌ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే వెసులుబాటు కూడా ఫోన్‌లో ఉండనుంది. 

    కెమెరా

    Realme 12 Pro మెుబైల్‌ నాణ్యమైన కెమెరా సెటప్‌తో లాంచ్‌ కాబోతోంది. ఇందులో 64MP Sony IMX890 ప్రైమరీ సెన్సార్‌ + 12MP పెరిస్కోప్‌ షూటర్‌ + 5MP + 2MP సపోర్టింగ్‌ సెన్సార్లు ఉంటాయని సమాచారం. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఫోన్‌ ముందు భాగాన 32MP ఫ్రంట్‌ కెమెరాను అమర్చినట్లు ప్రచారం జరుగుతోంది. 

    శక్తివంతమైన బ్యాటరీ

    ఈ రియల్‌మీ ఫోన్‌ను పవర్‌ఫుల్‌ బ్యాటరీతో తీసుకొస్తున్నారు. సూపర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు కలిగి 5000mAh బ్యాటరీని మెుబైల్‌కు అందిస్తున్నట్లు రియల్‌మీ వర్గాలు పేర్కొన్నాయి. USB Type-C కేబుల్‌ ద్వారా ఫోన్‌ ఛార్జ్‌ చేసుకోవచ్చు.

    కనెక్టివిటీ ఫీచర్లు

    ఈ రియల్‌మీ ఫోన్‌ 5G నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో Wi-Fi 4 (802.11 b/g/n), Bluetooth v5.3, GPS, Glonass వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌, లైట్‌ సెన్సార్‌, ప్రాక్సిమిటీ, యాక్సిలోమీటర్‌, గైరోస్కోప్‌ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

    ధర ఎంతంటే?

    Realme 12 Pro మెుబైల్‌ రెండు వేరియంట్లలో లాంచ్‌ కానుంది. 12 Pro, 12 Pro+ మోడల్స్‌లో ఈ మెుబైల్‌ను పొందవచ్చు. ఫిబ్రవరిలో ఈ ఫోన్లు దేశీయ మార్కెట్‌లోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. వేరియంట్‌ ఆధారంగా ధరలు ఉండనున్నాయి. అయితే ఈ ధరల గురించి రియల్‌మీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, Realme 12 Pro (8 GB RAM / 128 GB స్టోరేజ్‌) ధర రూ.42,990 వరకూ ఉండవచ్చని కంపెనీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv