ప్రముఖ చైనీస్ టెక్ దిగ్గజం రియల్‌మీ (Realme) మరో అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌తో భారత మార్కెట్‌లో అడుగుపెట్టబోతోంది. ‘Realme 12 Pro Series’ అతి త్వరలోనే లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. రియల్‌మీ 12 ప్రో (Realme 12 Pro), రియల్‌మీ 12 ప్రో ప్లస్ (Realme 12 Pro+) వేరియంట్లలో ఈ సిరీస్ లాంచ్ కానుంది. అయితే విడుదలకు ముందే ఈ సిరీస్‌కు సంబంధించిన కీలకమైన ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
మెుబైల్ స్క్రీన్
Realme 12 Pro వేరియంట్ 6.7 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రానున్నట్లు సమాచారం. దీనికి 2,412 x 1,080 పిక్సెల్స్ రిజల్యూషన్‌ను కూడా అందిస్తారని తెలుస్తోంది. Octa Core 2.2GHz చిప్‌సెట్, Qualcomm’s Snapdragon 7s Gen 2 ప్రొసెసర్‌తో ప్రో మోడల్ వర్క్ చేయనున్నట్లు లీకైన సమాచారం చెబుతోంది. ఇక Realme 12 Pro+ వేరియంట్ octa-core 2.4GHz చిప్‌సెట్‌తో రానుందట.
ర్యామ్ & స్టోరేజ్
Realme 12 Pro సిరీస్.. నాలుగు స్టోరేజ్ ఆప్షన్స్‌లో రానున్నట్లు ఆన్‌లైన్‌లో ప్రచారం జరుగుతోంది. 6GB RAM / 128GB ROM, 8GB RAM / 256GB ROM, 12GB RAM / 512GB ROM, 16GB RAM / 1TB స్టోరేజ్ వేరియంట్లలో వచ్చే ఛాన్స్ ఉంది.
కెమెరా
Realme 12 Pro వేరియంట్.. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో రానున్నట్లు తెలుస్తోంది. 50 MP ప్రైమరీ కెమెరా + 32 అల్ట్రావైడ్ + 8MP సపోర్టింగ్ సెన్సార్ ఇందులో ఉండనున్నాయి. అటు 12 Pro+ మోడల్.. 64MP ప్రైమరీ కెమెరా + 50MP అల్ట్రావైడ్ + 8MP సెన్సార్లతో రానుందని లీకైన సమాచారం చెబుతోంది. రెండు వేరియంట్లు ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉండనున్నాయి.
బ్యాటరీ
రియల్‌మీ 12 ప్రో సిరీస్ 5,000mAh బ్యాటరీతో రానున్నట్లు టెక్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికి 80W SUPER VOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును అందిస్తారని తెలిసింది.
ఫోన్ సైజ్
Realme 12 Pro సిరీస్.. 5G నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేయనుంది. ఈ సిరీస్‌లోని ప్రో మోడల్ 161.47mm x 74.02mm x 8.75mm కొలతలను కలిగి ఉందని సమాచారం. అలాగే 12 Pro+ వేరియంట్ 161.47mm x 74.02mm x 8.75mm కొలతలతో పాటు 196 గ్రాముల బరువు ఉంటుందని నెట్టింట వైరల్ అవుతోంది.
కలర్ ఆప్షన్స్
Realme 12 Pro సిరీస్ మూడు కలర్ వేరియంట్లలో లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. స్నో మౌంటెన్ గోల్డ్ (Snow Mountain Gold), ఫీక్వాన్ గ్రీన్ (Feiquan Gree), స్టార్ బ్లాక్ (Star Black) కలర్ ఆప్షన్స్‌లో లభించనున్నట్లు సమాచారం.
ధర ఎంతంటే?
Realme 12 Pro సిరీస్ లాంచింగ్ తేదీని చైనీస్ కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. ఆ రోజే ధర, మెుబైల్ ఫీచర్లపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. అయితే Realme 12 Pro మెుబైల్ 8GB RAM / 256GB ROM వేరియంట్ ధర రూ. 29,999గా ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Realme 12 Pro ప్రారంభ వేరియంట్ ధర రూ.24,990 వరకూ ఉంటుందని అభిప్రాయపడుతున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
Celebrities Featured Articles Movie News
Anasuya Bharadwaj: నా భర్త కోపరేట్ చేయట్లేదు.. ఆనసూయ హాట్ కామెంట్స్ వైరల్