• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Realme C51 Review: రూ.10 వేల లోపు తోపు ఫోన్‌.. ధర, ప్రత్యేకతలు ఇవే!

    భారత్‌లో మంచి క్రేజ్‌ ఉన్న చైనా మెుబైల్‌ కంపెనీల్లో రియల్‌మీ ఒకటి. ఈ కంపెనీ రిలీజ్‌ చేసే స్మార్ట్‌ఫోన్‌కు భారత్‌లో మంచి క్రేజ్‌ ఉంది. దీనికి అనుగుణంగానే ఆ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త మెుబైల్స్‌ను లాంచ్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో బడ్జెట్‌ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ‘రియల్‌మీ సీ51’ (Realme C51) పేరుతో ఆ నయా స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ ఫోన్‌ వినియోగదారులకు తప్పక నచ్చుతుందని రియల్‌మీ అంటోంది. తక్కువ ధరలో మంచి ఫోన్‌ కోరుకునే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌ చెబుతోంది. ఈ నేపథ్యంలో రియల్‌మీ సీ51 ఫీచర్లు, ధర, ఇతర పూర్తి వివరాలను ఈ కథనంలో చూద్దాం. 

    ఫోన్‌ స్క్రీన్

    రియల్‌మీ సీ51 స్మార్ట్‌ఫోన్‌ను 6.74 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేతో తీసుకొచ్చారు. 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందించారు. యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌తో ఇది పనిచేస్తుంది. రియల్‌మీ నార్జో ఎన్53, రియల్‌మీ సీ53 లాంటి మొబైల్స్‌లో ఇదే ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్‌ 13 ఔట్‌ ఆఫ్‌ బాక్స్‌ ఓఎస్‌ను ఫోన్‌కు అందించారు. 

    డైనమిక్‌ ర్యామ్‌

    రియల్‌మీ సీ51 (Realme C51) ఫోన్‌ 4GB RAM + 64GB స్టోరేజ్‌ వేరియంట్‌లో మాత్రమే లభిస్తోంది. ఈ మొబైల్‌లో డైనమిక్ ర్యామ్ ఫీచర్ ఉంది. దీని ద్వారా ర్యామ్‌ను మరో 4GB వరకూ పెంచుకోవచ్చు. అంటే 8GB RAM సామర్థ్యాన్ని పొందవచ్చు. 

    కెమెరా క్వాలిటీ

    ఈ మెుబైల్‌ను తక్కువ బడ్జెట్‌లో తీసుకొచ్చినప్పటికీ కెమెరా నాణ్యత విషయంలో రాజీపడలేదు.  ఇందులో 50 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. కెమెరాలో 50MP మోడ్, వీడియో, నైట్ మోడ్, పనోరమిక్ వ్యూ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

    బిగ్‌ బ్యాటరీ

    రియల్‌మీ సీ51 మెుబైల్‌కు సాలిడ్‌ బ్యాటరీ అందించారు.  5000mAh బ్యాటరీని ఫోన్‌కు ఫిక్స్‌ చేశారు. ఇది 33వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 50 శాతం వరకు కేవలం 28 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌లో మినీ క్యాప్సుల్ కూడా ఉంది. దీని ద్వారా బ్యాటరీ స్టేటస్, డేటా యూసేజ్, డైలీ స్టెప్స్ లాంటి వివరాలు తెలుసుకోవచ్చు. 

    5G సపోర్ట్‌

    రియల్‌మీ సీ51 మెుబైల్‌ 5G నెట్‌వర్క్‌కు సపోర్టు చేస్తుంది. అలాగే 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ (side mounted fingerprint scanner) డ్యూయల్‌ సిమ్‌ సపోర్ట్‌తో ఈ ఫోన్ వచ్చింది. 

    కలర్స్‌ 

    రియల్‌మీ సీ51 మెుబైల్‌ను రెండు రంగుల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మింట్ గ్రీన్, కార్బన్ బ్లాక్ కలర్స్‌లో మీకు నచ్చిన రంగును ఎంచుకునే వెసులుబాటును కల్పించారు. 

    ధర ఎంతంటే?

    రియల్‌మీ సీ51 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.8,999గా నిర్ణయించారు. HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో కొంటే రూ.500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫలితంగా రూ.8,499 ధరకే ఫోన్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంది.

    Buy from Flipkart

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv