చైనీస్ మెుబైల్ తయారీ కంపెనీ రియల్‌మీ (Realme)కి భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. ఆ కంపెనీ బడ్జెట్‌లో నాణ్యమైన మెుబైల్స్‌ను రిలీజ్ చేస్తూ టెక్ ప్రియులను ఆకర్షిస్తుంటుంది. ఈ క్రమంలోనే మరో సరికొత్త బడ్జెట్ ఫోన్‌ను లాంచ్ చేసేందుకు రియల్‌మీ సిద్ధమైంది. ‘Realme C65 5G’ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. దేశంలో రియల్‌మీ సీ-సిరీస్ నుంచి వస్తోన్న తొలి 5G ఫోన్ ఇదే కావడం విశేషం. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన కొంత సమాచారం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. వాటిపై ఓ లుక్కేద్దాం.
ఫోన్ స్క్రీన్
ఈ మెుబైల్ 6.71 అంగుళాల AMOLED స్క్రీన్‌తో రానున్నట్లు సమాచారం. దీనికి 2400 x 1080 pixels క్వాలిటీ, 120Hz రిఫ్రెష్ రేటు అందిస్తారట. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్, Helio G88 చిప్‌సెట్, ఆక్టాకోర్ ప్రొసెసర్‌తో ఈ ఫోన్ వర్క్ చేయనున్నట్లు లీకైన సమాచారం చెబుతోంది.
కెమెరా సెటప్
ఈ రియల్‌మీ ఫోన్ డ్యుయల్ కెమెరా సెటప్‌తో రానుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా + 2MP సెన్సార్ ఉండనుంది. ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్ చేస్తారట.
ర్యామ్ & స్టోరేజ్
Realme C65 5G ఫోన్‌ను మెుత్తం మూడు ర్యామ్ వేరియంట్లలో తీసుకొస్తున్నట్లు తెలిసింది. 4GB, 6GB, 8GB వేరియంట్లలో ఇది లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంటర్నల్ స్టోరేజ్ మాత్రం 128GB గానే ఉండనుందట.
బిగ్ బ్యాటరీ
ఈ నయా రియల్‌మీ ఫోన్‌ను పవర్‌ఫుల్ బ్యాటరీతో తీసుకొస్తున్నారు. 5000 mAh బ్యాటరీని మెుబైల్‌కు అమర్చనున్నారు. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేయనుంది.
కలర్ ఆప్షన్స్
Realme C65 5G స్మార్ట్‌ఫోన్ రెండు రంగుల్లో లాంచ్ కానుంది. గ్రీన్ (Green), పర్పుల్ (Purple) రంగుల్లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు.
ధర ఎంతంటే?
Realme C65 మెుబైల్ ధర, విడుదల తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ, డిసెంబర్‌లో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి. దీని ధర ర్యామ్‌ను బట్టి రూ.12,000-15,000 మధ్య ఉండవచ్చని అభిప్రాయ పడుతున్నాయి.