• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Realme Narzo 70 Pro 5G: స్టన్నింగ్‌ మెుబైల్‌తో వస్తోన్న రియల్‌మీ.. ఫీచర్లు ఇవే!

    చైనాకు చెందిన ప్రముఖ టెక్‌ కంపెనీ రియల్‌మీ (Realme) భారత్‌లో అధునాతన మెుబైల్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. ‘రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ’ (Realme Narzo 70 Pro 5G) పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. గతేడాది జులైలో తీసుకొచ్చిన ‘రియల్‌మీ నార్జో 60 ప్రో 5జీ’ మెుబైల్‌లో కీలకమైన అప్‌గ్రేడ్స్‌ చేసి ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ నయా మెుబైల్‌కు సంబంధించిన టీజర్‌ను రియల్‌మీ తాజాగా విడుదల చేసింది. అటు ఈ మెుబైల్‌కు సంబంధించిన ఫీచర్లు ఇవేనంటూ వార్తలు సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం టెక్‌ ప్రియుల దృష్టి ‘రియల్‌మీ నార్జో 70 ప్రో 5జీ’ మీద ఉన్నందున లీకైన ఫీచర్లపై ఓ లుక్కేద్దాం. 

    మెుబైల్‌ స్క్రీన్‌

    ఈ నయా రియల్‌మీ ఫోన్‌.. 6.67 అంగుళాల AMOLED స్క్రీన్‌తో రానున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనికి 1080 x 2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌, 120 Hz రిఫ్రెష్‌ రేట్‌, 2.5D గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్ కూడా ఉండనుందట. Android 13 OS, Mediatek Dimensity 1080 Chipsetతో ఫోన్‌ వర్క్ చేయనున్నట్లు తెలిసింది. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    Realme Narzo 70 Pro 5G మెుబైల్‌.. 8GB RAM / 128 GB స్టోరేజ్‌తో రాబోతున్నట్లు లీకైన సమాచారం చెబుతోంది. మరికొన్ని స్టోరేజ్‌ ఆప్షన్స్‌ కూడా ఈ ఫోన్‌లో ఉండవచ్చని అంటున్నారు. వర్చువల్‌ ర్యామ్‌ కింద మరో 8GB RAMను అదనంగా పొందవచ్చని సమాచారం. 

    బ్యాటరీ

    ఈ కొత్త రియల్‌మీ ఫోన్‌ను పవర్‌ఫుల్‌ బ్యాటరీతో తీసుకొస్తున్నట్లు తెలిసింది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కలిగిన 5000 mAh బ్యాటరీని ఫోన్‌కు అమరుస్తారని తెలిసింది. దీని ద్వారా మెుబైల్‌ను చాలా వేగంగా ఛార్జ్‌ చేసుకోవచ్చని, 48 గంటల వరకూ బ్యాటరీ లైఫ్‌ పొందవచ్చని టెక్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

    కెమెరా క్వాలిటీ

    ఈ Realme Narzo 70 Pro 5G ఫోన్‌.. ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో వస్తున్నట్లు తాజాగా విడుదలైన టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ఇందులో OIS ఆధారిత 50MP ప్రైమరి కెమెరా ఉంటుందని సమాచారం. అలాగే 13MP అల్ట్రావైడ్‌ కెమెరా, 2MP మ్యాక్రో సెన్సార్‌ ఫోన్‌ వెనుక భాగంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ముందు వైపు సెల్ఫీ, వీడియో కాల్ కోసం 16MP సెన్సార్‌ను ఫిక్స్ చేసినట్లు లీకైనా సమాచారం చెబుతోంది.

    కనెక్టివిటీ ఫీచర్లు

    ఈ మెుబైల్‌ 5G సపోర్టుతో వస్తోంది. Wi-Fi 5, Bluetooth v5.3, USB-C v2.0, GPS, Beidou, Glonass, Galileo వంటి కనెక్టివిటీ ఫీచర్లతో రానుంది. అలాగే ఫింగర్‌ ప్రింట్ సెన్సార్‌తో పాటు.. మ్యాగ్నటిక్‌ ఇండక్షన్ సెన్సార్‌, లైట్‌ సెన్సార్‌, ప్రాక్సిమిటీ, గైరో మీటర్‌, యాక్సిలోమీటర్‌, ఈ-దిక్సూచి వంటి సెన్సార్లు కూడా ఉండనున్నట్లు సమాచారం. 

    ధర ఎంతంటే?

    Realme Narzo 70 Pro 5G మెుబైల్‌.. వచ్చే నెల మార్చిలో లాంచ్‌ కానున్నట్లు తెలుస్తోంది. మార్చి 25న ఈ ఫోన్‌ విడుదలయ్యే అవకాశమున్నట్లు టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఆ రోజే ఫీచర్లు, ధర వంటి వాటిపై స్పష్టత రానుంది. అయితే టెక్‌ వర్గాలు అంచనా ప్రకారం ఈ ఫోన్ ధర రూ. 20 వేల లోపు ఉండొచ్చని అంటున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv