చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం Realme భారత మార్కెట్లోకి సరికొత్త స్మార్ట్ ఫొన్(Realme P2 Pro 5G)ను విడుదల చేసింది. గత ఏడాది వచ్చిన P1 Pro 5G ఇది అప్‌డేట్ వెర్షన్. కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా మారాయి.Realme P2 Pro 5G స్మార్ట్ ఫోన్‌లో అత్యంత వేగవంతమైన Snapdragon చిప్‌ను అమర్చారు. దీంతో పాటు కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఇది మంచి గేమింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో ఒక కర్వ్‌డ్ AMOLED డిస్ప్లే, డ్యూయల్-కెమెరా సెట్‌అప్, పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, స్టీరియో స్పీకర్లను కలిగి ఉంది. వీటితో పాటు ఈ స్మార్ట్ ఫోన్ ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.
Realme P2 Pro 5G స్పెసిఫికేషన్లు
ప్రాసెసర్
Realme P2 Pro 5G స్మార్ట్ ఫొన్ Snapdragon 7s Gen 2 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది, ఇది 12GB వరకు RAM, 512GB వరకు UFS 3.1 స్టోరేజ్‌తో వచ్చింది. దీనికి అదనంగా, 12GB వరకు వర్చువల్ RAMగా కూడా అందుబాటులో ఉంటుంది. Realme P2 Pro 5G ఈ విభాగంలో అతిపెద్ద (4,500mm²) VC కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉందని పేర్కొంది.
డిస్‌ప్లే
Realme P2 Pro 5G 6.7 అంగుళాల FHD+ కర్వ్‌డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, దీని పీక్ బ్రైట్‌నెస్ 2,000 నిట్స్. ఈ డిస్‌ప్లే 20,000 లెవెల్ వరకు ఆటోమేటిక్ బ్రైట్‌నెస్ అడ్జస్ట్మెంట్, AI గేమింగ్ ఐ ప్రొటెక్షన్, రైన్వాటర్ స్మార్ట్ టచ్, 2160Hz PWM డిమ్మింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ సాంప్లింగ్ రేట్ కలిగి ఉంది.
కెమెరా
ఇక కెమెరా విషయానికొస్తే… ఇందులో ప్రధాన కెమెరా 50MP Sony LYT-600 ప్రైమరీ సెన్సార్‌ను f/1.88 యాపర్చర్ OIS(ఆఫ్టికల్ ఇమెజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్‌తో కలిగి ఉంది, అలాగే 8MP అల్ట్రావైడ్ లెన్స్ f/2.2 యాపర్చర్‌తో వస్తుంది. ముందువైపు, ఈ ఫోన్ 32MP సెల్ఫీ కెమెరాను f/2.45 యాపర్చర్‌తో కలిగి ఉంది.
బ్యాటరీ
ఈ ఫోన్ 5,200 mAh బ్యాటరీతో 80W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఇది IOT రిజర్వ్ చార్జింగ్, ఇతర స్మార్ట్ చార్జింగ్ ఫీచర్లను AI సాయంతో అందిస్తుంది. IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌ను కలిగి ఉంది.
ఆపరేటింగ్ సిస్టమ్
ఈ గ్యాడ్జెట్ Android 14 ఆధారిత realme UI 5.0 పై పనిచేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 4G, 5G, Wi-Fi 6, Bluetooth 5.2 సపోర్ట్ చేస్తుంది. ఇక సౌండ్ విషయానికొస్తే.. Realme P2 Pro 5G డ్యూయల్ స్టీరియో స్పీకర్లను Dolby Atmos, Hi-Res ఆడియోతో ఇయర్ డ్రమ్స్‌ను షెక్ చేస్తుంది.
కలర్ ఆప్షన్స్
Realme P2 Pro 5G రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ప్యారట్ గ్రీన్ మరియు ఈగల్ గ్రే రంగులలో అందుబాటులో ఉంది.
Realme P2 Pro 5G ధర
ఇండియాలో Realme P2 Pro 5G ప్రారంభ ధర 8GB/128GB మోడల్‌కు రూ.21,999 గా నిర్ణయించారు. దీనితో పాటు 12GB/256GB, 12GB/512GB వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి, వీటి ధరలు వరుసగా రూ.24,999, రూ.27,999గా నిర్ణయించారు.
ఆఫర్లు
దీపావళికి ముందు Realme P2 Pro 5G కొనుగోలు చేసే వినియోగదారులు అన్ని మూడు మోడళ్లపై రూ.2,000 డిస్కౌంట్ పొందవచ్చు. అదనంగా, 12GB/256GB, 12GB/512GB మోడళ్లపై రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించబడుతుంది.
సేల్ ఎప్పుడంటే?
Realme P2 Pro 5G స్మార్ట్ ఫోన్‌ను realme.com, Flipkart ఇతర రిటైలర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. సెప్టెంబర్ 17 సాయంత్రం 06:00 గంటలకు Realme P2 Pro 5G ఎర్లీ బర్డ్ సేల్ ప్రారంభం కానుంది.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్