లైగర్ సినిమాపై నిన్నటివరకు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులకు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ సినిమా విడుదలైన తర్వాత ఉదయం నుంచి సోషల్‌మీడియాలో డైరెక్టర్‌పై, విజయ్‌పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అంత బిల్డప్ ఇచ్చి మీరు తీసిన సినిమా ఇదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఐఎండీబీలో లైగర్‌కు 2+ రేటింగ్ లభించింది. లైగర్‌పై అంత పెద్దఎత్తున విమర్శలు రావడానికి కారణం ఏమిటి అంటే..
విజయ్ దేవరకొండ ఓవర్ కాన్ఫిడెన్స్ కొంపముంచిందా?
సినిమా ప్రారంభమైన నాటినుంచి విడుదలకు ముందువరకు విజయ్ చేసిన కొన్ని స్టేట్మెంట్స్పై ఇప్పుడు భారీగా ట్రోలింగ్ జరుగుతుంది. అవి ఏంటంటే..
- లైగర్ కలెక్షన్స్ రూ.200 కోట్ల నుంచి ప్రారంభమవుతాయి
- మీకు ఇష్టం ఉంటే సినిమా చూడండి లేకపోతే చూడొద్దు
- లైగర్ ఒక కల్ట్ మూవీ అవుతుంది
దీంతో పాటు లాక్డౌన్ సమయంలో లైగర్‌కు రూ.200 కోట్ల భారీ ఓటీటీ ఆఫర్ వచ్చినప్పటికీ దాన్ని రిజెక్ట్ చేశారు. రూ.200 కోట్లు అనేది చాలా చిన్న మొత్తం అని విజయ్ అన్నాడు. దీంతో ఇప్పుడు ఆ రూ.200 కోట్లు అప్పుడే తీసుకోవాల్సింది కదా అంటున్నారు. విజయ్‌తో పాటు చిత్రబృందం సినిమా విజయంపై చాలా నమ్మకం కనబరిచారు. కచ్చితంగా సినిమా భారీ హిట్ అవుతుందని తెలిపారు. ఈ సినిమా నా సెకండ్ ఇన్నింగ్స్ అనుకోండి అని కూడా పూరీ ప్రకటించాడు. దీంతో పూరీ సినిమాలు పోకిరి, ఇడియట్ రేంజ్లో ఊహించుకున్నారు. కానీ వాటికి ఏమాత్రం ఈ కథ సరిపడలేదు.
మూలాలను మరిచారు
ఈమధ్యకాలంలో మన సినిమాలు బాలీవుడ్లో అంత పెద్ద సక్సెస్ అవడానికి కారణం ఇక్కడ కల్చర్ నార్త్ ప్రజలకు నచ్చడం. అందుకే సౌత్ సినిమాలను వాళ్లు అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. కానీ ఆ ఒక్క విషయం మరిచిపోయి లైగర్ టీమ్ మొదటినుంచి బాలీవుడ్ మీద శ్రద్ధ పెట్టింది. అక్కడ ప్రజలను దృష్టిలో పెట్టుకొని సినిమాను తెరకెక్కించారు. లైగర్ తెలుగులో చూస్తున్నవాళ్లకు హిందీ డబ్బింగ్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలిగింది. పాటలు కూడా ఇక్కడవాళ్లకు అసలు కనెక్ట్ కాలేదు. సినిమాలో కూడా డైలాగ్స్ ఎక్కువగా హిందీవే ఉండటం కూడా ప్రతికూలంగా మారింది. ముంబయిలోని ఉండి అక్కడే షూటింగ్ పూర్తిచేశారు. బాలీవుడ్లో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేశారు. కరీంనగర్ కుర్రాడి కథ అన్నారు కానీ సినిమాలో విజయ్ తప్ప ఎవరూ తెలుగులో మాట్లాడలేదు. కేవలం డబ్బింగ్ మాత్రమే తెలుగులో చెప్పారు. ఇవన్నీ సినిమా ఫ్లాప్ కావడానికి కారణాలుగా మారాయి.
కథ పట్టుతప్పింది
ఎంత భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీసినా ఎంత పెద్ద నటులను తీసుకన్నా కంటెంట్ లేకపోతే అది ప్రేక్షకులకు రుచించదు. ఈ సినిమాకు బడ్జెట్, బాలీవుడ్ నటులు, మైక్ టైసన్ వంటి లెజెండ్‌ను మొదటిసారి ఇండియన్ సినిమాలో నటిస్తున్నాడని హైప్ ఇచ్చారు. కానీ సినిమా చూసిన తర్వాత అసలు టైసన్ కి ఏం చెప్పి ఒప్పించారని కామెంట్స్ చేస్తున్నారు. అంత పెద్ద లెజెండ్‌ను సినిమాకు సరిగ్గా ఉపయోగించుకోలేదని అంటున్నారు. కథలో లాజిక్ లేకుండా హీరో తన లక్ష్యాన్ని చేరడం అంతా డ్రామాటిక్‌గా అనిపిస్తుంది. పూరీ సినిమాల్లో డైలాగ్స్ హైలెట్‌గా నిలుస్తాయి. కానీ అనవసమైన ప్రయోగాలకు వెళ్లి, హీరోకి నత్తి పెట్టి పూరీ తన చేతుల్ని తానే కట్టేసుకున్నాడు. సినిమాపై ఎంత విమర్శలు వచ్చినా విజయ్‌దేవరకొండ కష్టాన్ని మాత్రం అందరు గుర్తిస్తున్నారు. మూవీ కోసం ఆయన కష్టపడి బాడీని పెంచిన విధానం తెరపై కనిపించింది.
చాలా ఎక్కువగా ఊహించుకున్నారు
కథలో బలం లేకపోయినా లైగర్ టీమ్ మాత్రం సినిమా భారీ సక్సెస్ అవుతుందని ఊహించుకున్నారు. దీంతో ప్రమోషన్స్ కూడా నెల రోజుల ముందు నుంచే ప్రారంభించి బారీ ఎత్తున ఖర్చు పెట్టారు. వచ్చిన ఓటీటీ ఆఫర్‌ను కూడా తిప్పికొట్టి మేము అంతకంటే ఎక్కువ సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. కానీ అది బెడిసికొట్టింది. మొదటి ఆట నుంచే విమర్శలు వస్తుండటంతో కలెక్షన్లలో వెనకపడింది. వీకెండ్ తర్వాత సినిమా థియేటర్లలో కనిపిస్తుందో లేదో కూడా డౌటే అంటున్నారు. అదే జరిగితే 2022లో విడుదలైన సినిమాలలో ఇదే అతిపెద్ద డిజాస్టర్‌గా మిగులుతుందని అంచనా వేస్తున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!