చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్ కంపెనీ రెడ్‌మీ నుంచి మరో అధునాతన ఫోన్ భారత్‌లో విడుదల కానుంది. Redmi 12 పేరుతో ఈ ఫోన్ మార్కెట్‌లో సందడి చేయనుంది. ఇప్పటికే పలు దేశాల్లో ఈ ఫోన్ అందుబాటులోకి రాగా.. అక్కడి వినియోగదారుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 1న భారత్‌లోనూ Redmi 12 ఫోన్‌ను రిలీజ్ చేయాలని తయారీ సంస్థ భావిస్తోంది. మరి ఈ ఫోన్ ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత? వంటి విషయాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఫోన్ డిస్‌ప్లే
రెడ్‌మీ 12 ఫోన్‌ను 6.79 అంగుళాల full HD+ (1,080 x 2,460 pixels) డిస్‌ప్లేతో తీసుకొస్తున్నారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. MediaTek Helio G88 SoC ప్రొసెసర్‌తో పనిచేయనుంది. Android 13, MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఫోన్‌లో అమర్చారు.
కెమెరా క్వాలిటీ
రెడ్‌మీ 12 ఫోన్ వెనుక భాగంలో 50MP+8MP+2MP కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 1080p@30fps క్వాలిటీ వీడియోకు ఇది సపోర్ట్ చేస్తోంది. అలాగే ఫ్రంట్ సైడ్ 8 MP కెమెరాను ఫిక్స్ చేశారు.
బ్యాటరీ
Redmi 12 ఫోన్‌ను 5000mAh బ్యాటరీతో తీసుకొస్తున్నారు. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని ఫోన్‌కు అందించారు. దీని వల్ల ఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ సంతృప్తికరంగా ఉంటుందని రెడ్‌మీ వర్గాలు తెలిపాయి.
స్టోరేజీ
Redmi 12 మూడు రకాల స్టోరేజీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 4GB RAM/128GB ROM, 8GB RAM/128GB ROM, 8GB RAM/256GB ROM వేరియంట్లలో మార్కెట్‌లోకి రానుంది. ఫోన్ వేగం, స్టోరేజ్ సామర్థ్యం ఎక్కువ ఉండాలని కోరుకునే వారికి చివరి వేరియంట్ చక్కటి ఆప్షన్.
4G మాత్రమే
Redmi 12 ఫోన్ 5Gకి సపోర్టు చేయదు. ఇది 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూటూత్ 5.3, GPS + GLONASS ఫీచర్లను కలిగి ఉంది. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సార్, కాంపస్, యాక్సిలోమీటర్ ఈ ఫోన్‌లో ఉన్నాయి.
కలర్స్
Redmi 12 ఫోన్ మెుత్తం నాలుగు రంగుల్లో అందుబాటులోకి రానుంది. మిడ్‌నైట్ బ్లాక్, స్కై బ్లూ, పోలార్ సిల్వర్, మూన్ స్టోన్ సిల్వర్ కలర్స్‌లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు.
ధర ఎంతంటే?
భారత్‌లో Redmi 12 ధరలను తయారీ సంస్థ ఇంకా ప్రకటించలేదు. అయితే 4GB + 128GB వేరియంట్ ధర రూ.12,500, 8GB + 128GB వేరియంట్ రూ.17,000 ఉండొచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పలు దేశాల్లో వీటిని విక్రయిస్తున్న ధర ఆధారంగా వారు ఈ అంచనాకు వచ్చారు. 8GB RAM/256GB వేరియంట్ ధర ఆగస్టు 1 తెలియనుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!