చైనాకు చెందిన టాప్ మెుబైల్ కంపెనీల్లో రెడ్‌మీ (Redmi) ఒకటి. ఈ కంపెనీ అతి తక్కువ బడ్జెట్‌లో అత్యాధునిక మెుబైల్స్‌ను రిలీజ్ చేస్తూ టెక్ ప్రియులను ఆకర్షిస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే భారత్‌లోనూ రెడ్‌మీ మంచి గుడ్‌విల్‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ఈ చైనీస్ కంపెనీ మరో సరికొత్త ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ‘Redmi 13c’ పేరుతో త్వరలోనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఫోన్‌కు సంబంధింన ఫొటోలను సైతం రివీల్ చేసింది. ఈ ఏడాది మార్చిలో తీసుకొచ్చిన ‘Redmi 12c’ మెుబైల్‌కు అనుసంధానంగా కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్ల సమాచారం ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతోంది. వాటిపై ఓ లుక్కేద్దాం.
మెుబైల్ స్క్రీన్
Redmi 13C మెుబైల్ 6.74 అంగుళాల full HD+ IPS LCD స్క్రీన్‌తో రానుంది. దీనికి హై క్వాలిటీ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందించారు. Android 13 ఆధారిత MIUI 14.0.1 ఆపరేటింగ్, MediaTek Helio G85 SoC ప్రొసెసర్‌తో ఈ ఫోన్ పనిచేయనుంది.
ర్యామ్ & స్టోరేజ్
ఈ రెడ్‌మీ మెుబైల్ రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి రానుంది. 4GB RAM / 128GB ROM, 8GB RAM / 256GB స్టోరేజ్ సామర్థ్యంతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఏడాది మార్చిలో వచ్చిన 12C మెుబైల్ కేవలం 4GB RAM / 128GB ROM వేరియంట్లలో రావడం గమనార్హం.
బిగ్ బ్యాటరీ
రెడ్‌మీ 13సీ మెుబైల్ పవర్‌ఫుల్ బ్యాటరీ సెటప్‌తో రానుంది. 5000 mAh Li-Po బ్యాటరీతో ఫోన్ రాబోతున్నట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ మెుబైల్‌కు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తున్నట్లు సమాచారం.
కెమెరా సెటప్
ఈ మెుబైల్ కూడా 12C మోడల్ లెక్కనే డ్యుయల్ రియర్ కెమెరా సెటప్‌తో రానుంది. 50MP ప్రైమరీ కెమెరా + 2MP మాక్రో సెన్సార్ ఫోన్‌కు వెనక భాగంలో ఉంటాయి. ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరా ఉండనుంది. ఈ కెమెరాలతో నాణ్యమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది.
అడిషనల్ ఫీచర్స్
ఈ రెడ్‌మీ మెుబైల్.. 4G నెట్‌వర్క్, Dual SIM + microSD, Wi-Fi 5GHz, 3.5mm ఆడియో జాక్, 68 x 78 x 8.09mm కొలతలతో 192g బరువును కలిగి ఉండనుంది.
కలర్ ఆప్షన్స్
రెడ్‌మీ 13సీ మెుబైల్ మెుత్తం నాలుగు రంగుల్లో రానున్నట్లు కంపెనీ రివీల్ చేసిన ఫొటోలను బట్టి తెలుస్తోంది. బ్లాక్ (Black), బ్లూ (Blue), లైట్ బ్లూ (Light blue), లైట్ గ్రీన్ (Light green) కలర్ ఆప్షన్స్‌తో లాంచ్ కానుంది.
ధర ఎంతంటే?
13C స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ తేదీ, ధరను రెడ్‌మీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ ఫోన్ బేసిక్ మోడల్ ధర రూ.6999 వరకూ ఉండొచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.