• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Redmi 13R 5G: ఊహకందని ఫీచర్లతో రెడ్‌మీ నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌.. ఓ లుక్కేయండి!

    చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్‌ తయారీ కంపెనీల్లో రెడ్‌మీ (Redmi) ఒకటి. ఈ కంపెనీ ఫోన్లకు భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. తక్కువ బడ్జెట్‌లో అడ్వాన్స్‌డ్‌ మెుబైల్స్‌ను రెడ్‌మీ లాంచ్‌ చేయడమే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే మరో సరికొత్త బడ్జెట్‌ మెుబైల్‌ను ఈ చైనీస్‌ కంపెనీ లాంచ్ చేసింది. ‘రెడ్‌మీ 13ఆర్‌ 5జీ’ (Redmi 13R 5G) పేరుతో దానిని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో మెుబైల్‌ ఫీచర్లు, ప్రత్యేకతలు, ధర వంటి విశేషాలు ఏవో ఇప్పుడు చూద్దాం. 

    మెుబైల్ స్క్రీన్‌

    ఈ రెడ్‌మీ ఫోన్.. 6.74 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్‌ కలిగి ఉంది. దీనికి 1,600 x 720 pixels క్వాలిటీతో పాటు, 90Hz రిఫ్రెష్‌ రేట్‌, Gorilla Glass ప్రొటెక్షన్‌ అందించారు. MediaTek Dimensity 6100+ SoC ప్రొసెసర్‌, Mali-G57 MC2 జీపీయూ, ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత MIUI 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్‌ రన్‌ అవుతుంది. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    Redmi 13R 5G స్మార్ట్‌ఫోన్‌ను 4GB of LPDDR4X RAMతో తీసుకొచ్చారు. 128GB UFS 2.2 స్టోరేజ్‌ను ఫోన్‌కు అందించారు. microSD కార్డ్‌ ద్వారా స్టోరేజ్‌ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే వెసులుబాటు ఉంది. 

    కెమెరా క్వాలిటీ

    ఇక కెమెరాల విషయానికి వస్తే ఈ ఫోన్ వెనక భాగంలో డ్యుయల్‌ రియర్‌ కెమెరా సెట్‌ను ఫిక్స్‌ చేశారు. 50MP ప్రైమరీ కెమెరాను ఫోన్‌కు అందించారు. ఫ్రంట్‌ వైపు  5MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. 

    బిగ్‌ బ్యాటరీ

    ఈ మెుబైల్‌ను బడ్జెట్‌లోనే తీసుకొచ్చినప్పటికీ ఫోన్‌కు పవర్‌ఫుల్‌ బ్యాటరీని అందించారు. 5,000mAh బిగ్‌ బ్యాటరీని ఫిక్స్‌ చేశారు. ఇది USB Type-C పోర్ట్‌ ద్వారా 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 

    అడిషనల్‌ ఫీచర్లు

    ఈ ఫోన్ బరువు 192 గ్రాములు. 168mm x 78mm x 8.09mm పరిమాణం ఉంటుంది. అలాగే సైడ్‌ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్‌ సెన్సార్‌, 3.5mm ఆడియో జాక్‌ను ఫోన్‌ కలిగి ఉంది. 

    కలర్‌ ఆప్షన్స్‌

    మెుత్తం మూడు కలర్‌ ఆప్షన్స్‌లో ఫోన్‌ను తీసుకొచ్చారు. స్టార్‌ రాక్‌ బ్లాక్‌ (Star Rock Black), ఫాంటసీ పర్పుల్‌ (Fantasy Purple), వేవ్‌ వాటర్‌ గ్రీన్‌ Wave Water Green) రంగుల్లో మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకోవచ్చు. 

    ధర ఎంతంటే?

    ఇక ధర విషయానికి వస్తే… Redmi 13R 5G మెుబైల్‌ 4జీబీ + 128జీబీ వేరియంట్ ధర చైనాలో CNY 999గా నిర్ణయించారు. దీన్ని బట్టి భారత్‌లో ఈ ఫోన్‌ విలువ రూ.11,700 వరకూ ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv