చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్ తయారీ కంపెనీల్లో రెడ్‌మీ (Redmi) ఒకటి. అతి తక్కువ బడ్జెట్‌లో అత్యాధునిక స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేసే కంపెనీగా రెడ్‌మీకి పేరుంది. అందుకే ఈ కంపెనీ ఏ చిన్న ఫోన్ రిలీజ్ చేసిన అది వినియోగదారుల్లో ఎనలేని ఆసక్తిని పెంచుతుంది. ఈ నేపథ్యంలోనే రెడ్‌మీ నుంచి మరో అత్యాధునిక ఫోన్ లాంఛ్ అయ్యింది. చైనాలో Redmi K60 Ultra పేరుతో ఈ ఫోన్‌ను రిలీజ్ చేశారు. అతి త్వరలోనే భారతీయులను సైతం ఈ ఫోన్ పలకరించనుంది. ఈ నేపథ్యంలో దాని ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర, వేరియంట్స్ వంటి అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
ఫోన్ డిస్‌ప్లే / స్క్రీన్
Redmi K60 Ultra స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల OLED స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనికి 1220 x 2712 పిక్సెల్ రిజల్యూషన్ అందించారు. 144Hz రేట్‌తో తీసుకొచ్చారు. ఈ మెుబైల్ స్క్రీన్‌పైనే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. MIUI 14 సపోర్ట్‌తో పనిచేసే Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఫోన్‌లో ఫిక్స్ చేశారు. ఈ ఫోన్ 8.5mm మందం, 204 గ్రాముల బరువు ఉంది.
స్టోరేజ్ సామర్థ్యం
రెడ్‌మీ కే60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను స్టోరేజీ ఆధారంగా నాలుగు వేరియంట్లు కలిగి ఉంది. 12GB RAM + 256GB స్టోరేజ్, 16GB RAM + 256GB స్టోరేజ్, 16GB RAM + 512GB స్టోరేజ్, 24GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు.
కెమెరా క్వాలిటీ
Redmi K60 Ultra స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన కెమెరా క్వాలిటీ కలిగి ఉంది. ఈ ఫోన్‌ను ట్రిపుల్ రియర్ కెమెరాతో తీసుకొచ్చారు. ఇందులో 50 MP ప్రైమరీ కెమెరా ఫిక్స్ చేశారు. దానికి జతగా 8 MP అల్ట్రా వైడ్, 2 MP మాక్రో కెమెరాలను అమర్చారు. వీటి సాయంతో నాణ్యవంతమైన ఫొటోలు, వీడియోలు తీసుకోవచ్చని రెడ్‌మీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక ముందు వైపు 20MP సెల్ఫీ కెమెరా ఉంది.
బిగ్ బ్యాటరీ
Redmi K60 Ultra స్మార్ట్‌ఫోన్‌కు 5000mAh బ్యాటరీని ఫిక్స్ చేశారు. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీని సాయంతో మెుబైల్‌ను త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చని రెడ్‌మీ వర్గాలు తెలిపాయి.
రికార్డు సేల్స్
Redmi K60 Ultra మెుబైల్‌కు కొనుగోలుదారుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సేల్స్ ప్రారంభమైన తొలి 5 నిమిషాల్లో 2,20,000 యూనిట్లు అమ్ముడుపోయినట్లు రెడ్‌మీ వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున ఈ మెుబైల్‌ను బుక్ చేసుకుంటున్నట్లు పేర్కొన్నాయి.
కలర్స్
Redmi K60 Ultra మెుబైల్‌ను విదేశాల్లో మూడు రంగుల్లో విడుదల చేశారు. బ్లాక్, వైట్, గోల్డ్ కలర్స్‌లో ఇది అందుబాటులోకి వచ్చింది. భారత్‌లోనూ ఇవే కలర్స్‌లో ఫోన్ రిలీజయ్యే ఛాన్స్ ఉంది.
ధర ఎంతంటే?
Redmi K60 Ultra మెుబైల్‌ను భారత్‌లో ఏ ధరకు విక్రయిస్తారో తయారీ సంస్థ ఇంకా ప్రకటించలేదు. అయితే వేరియంట్లను బట్టి చైనాలో వివిధ ధరలకు ఈ మెుబైల్‌ను అమ్ముతున్నారు. ఆ ధరలను భారతీయ కరెన్సీకి అన్వయిస్తే 12GB RAM+256GB వేరియంట్ ధర రూ.31,907, 16GB RAM+256GB ఫోన్ ధర రూ. 34,234, 16GB RAM + 512GB ధర రూ. 37,641, 24GB + 1TB ధర సుమారు రూ.42 వేలుగా ఉంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!