రెడ్‌మీ నోట్ 12 ప్రో 5G(Redmi Note 12 Pro 5G) నుంచి ఎట్టకేలకు టాప్ వేరియంట్ భారత్‌లో లాంఛ్ అయింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో మూడు రకాల స్టోరేజ్ వేరియంట్లను షావోమీ(Xiaomi) పరిచయం చేసింది. ఈ ఏడాది జనవరిలోనే వీటిని గ్రాండ్‌గా లాంఛ్ చేసింది. తాజాగా నాలుగో స్టోరేజ్ వేరియంట్‌ని భారత్‌లో రిలీజ్ చేసింది. మరి, ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర, తదితర వివరాలు తెలుసుకుందామా.
కెమెరా సెటప్
రెడ్‌మీ నోట్ 12 ప్రో 5G ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరాతో వస్తోంది. ఈ ప్రైమరీ కెమెరాకు సోనీ IMX766 సెన్సార్ అమర్చడంతో తక్కువ వెలుతురు లోనూ ఫొటోలు తీసే వెసులు బాటు ఉండనుంది. 8MP అల్ట్రా వైడ్ సెన్సార్, 2MP మ్యాక్రో సెన్సార్‌లు కెమెరా సెటప్‌లో ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌కి ఇది సపోర్ట్ చేస్తుంది. 16MP సెల్ఫీ కెమెరా దీని సొంతం.
డిస్‌ప్లే
ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెస్ రేటుతో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ అమోల్డ్(AMOLED) డిస్‌ప్లేని కలిగి ఉంది. డిస్‌ప్లేకి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. పిక్సెల్ డెన్సిటీ 394ppiగా ఉంది.
పర్ఫార్మెన్స్
పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో రెడ్‌మీ నోట్ 12 ప్రో 5G ఫోన్‌ను తీసుకొచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8050 SoC చిప్‌సెట్‌ని ఈ మెుబైల్‌కు ఫిక్స్ చేశారు. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. MIUI 13, ఆండ్రాయిడ్ 12 వర్షన్ ఆపరేటింగ్ సిస్టంలకు ఈ స్మార్ట్‌ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
బ్యాటరీ
రెడ్‌మీ నోట్ 12 ప్రో 5G భారీ బ్యాటరీని కలిగి ఉంది. 5000mAh కెపాసిటీతో వస్తోంది. 67వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. ఫలితంగా ఫోన్‌ను వేగంగా చార్జ్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.
కలర్స్
రెడ్‌మీ నోట్ 12 ప్రో 5G నాలుగు కలర్స్‌లలో అందుబాటులో ఉంది. స్టార్‌డస్ట్ పర్పుల్(Stardust Purple), ఫ్రెస్టెడ్ బ్లూ(Frosted Blue), ఒనిక్స్ బ్లాక్(Onyx Black) రంగుల్లో లభ్యమవుతోంది.
ఇతర ఫీచర్లు
ఈ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తోంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో పాటు స్టీరియో స్పీకర్స్ ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం. ఇన్‌ఫ్రా రెడ్ బ్లాస్టర్, తదితర అదనపు ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
స్టోరేజ్
రెడ్‌మీ నోట్ 12 ప్రో 5G నాలుగు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. తాజాగా రిలీజైన వేరియంట్ 12GB RAM 256 GB స్టోరేజ్‌ని కలిగి ఉంది. ఇది వరకు ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM+ 128 GB, 8GB RAM+128GB, 8GB RAM+256GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ధర
12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999గా కంపెనీ నిర్ణయించింది. షావోమీ వెబ్‌సైట్‌తో పాటు ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లోనూ ఆర్డర్ చేయొచ్చు. రిటైల్ స్టోర్లకి వెళ్లి కూడా కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్ లభిస్తోంది.
మిగతా వేరియంట్ల ధర..
6GB+128GB storage వేరియంట్ ధర రూ.24,999, 8GB+128GB వేరియంట్ ధర రూ.26,999గా ఉంది. ఇక, 8GB+256GB మోడల్ స్మార్ట్‌ఫోన్ రూ.27,999కు లభిస్తోంది.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్