ఇంటి పరిశుభ్రత అనగానే ముందుగా గుర్తుకువచ్చేవి వాక్యూమ్ క్లీనర్స్ (Vacuum Cleaners). ఇవి శ్రమను తగ్గించడంతో పాటు, ఎంత పెద్ద ఇంటినైనా క్షణాల్లో శుభ్రం చేసేస్తాయి. ప్రస్తుతం చాలా రకాల వాక్యూమ్ క్లీనర్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా బేసిక్, స్మార్ట్, రోబోటిక్ అనే మూడు వేరియంట్లలో వాక్యూమ్ క్లీనర్లు లభిస్తున్నాయి. వీటిలో రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ చాలా అడ్వాన్స్‌డ్ అని చెప్పవచ్చు. వీటిని ఒకసారి ప్రారంభించి వదిలేస్తే చాలు.. వ్యక్తి ప్రమేయం లేకుండా వాటంతట అవే క్లీనింగ్ పనులను చక్కబెట్టేస్తాయి. మార్కెట్‌లోని టాప్-5 రోబోటిక్ వాక్యుమ్ క్లీనర్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.
1. ECOVACS DEEBOT N8 PRO
బెస్ట్ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లను అందిస్తున్న కంపెనీల్లో ‘ECOVACS’ కచ్చితంగా టాప్ ప్లేస్‌లో ఉంటుంది. ఈ కంపెనీ రిలీజ్ చేసిన ‘ECOVACS DEEBOT N8 PRO’ రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఇది నేలపై ఉన్న దుమ్ము, దూళితో పాటు మరకలను సైతం తొలగిస్తుంది. టైల్స్, మార్బుల్స్, చెక్క, కార్పెట్ ఇలా అన్ని రకాల ఫ్లోర్లను (Flores) శుభ్రం చేస్తుంది. ECOVACS స్మార్ట్ యాప్ ద్వారా దీనిని కంట్రోల్ చేయవచ్చు. ఎప్పటికప్పుడు దీని క్లీనింగ్ స్టేటస్‌ను యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది 2000 చదరపు అడుగులకు పైగా క్లీనింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ వాక్యూమ్ క్లీనర్ అసలు ధర రూ. 79,900 కాగా అమెజాన్ దీనిపై ఏకంగా 56% డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఇది రూ.34,900 అందుబాటులోకి వచ్చింది.
2. MI Xiaomi Robotic Vacuum
ప్రముఖ టెక్ దిగ్గజం షావోమి (Xiaomi) కూడా పవర్ ఫుల్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్‌ను తయారు చేసింది. ఈ కంపెనీ రిలీజ్ చేసిన MI Xiaomi Robotic Vacuumకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. LDS Laser Navigation Systemతో దీన్ని తయారు చేశారు. 4.5 గంటల రన్‌టైమ్‌ను కలిగి ఉంది. ఈ వాక్యూమ్ క్లీనర్‌ను గూగుల్ అసిస్టెన్స్ (Google Assistant), అమెజాన్ అలెక్సా (Amazon Alexa) ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఆండ్రాయిడ్, IOS యూజర్లు దీనిని ఉపయోగించవచ్చు. 2000 చదరపు అడుగుల ఇంటిని సైతం ఇది చాలా ఈజీగా కవర్ చేస్తుంది. దీని అసలు ధర రూ.39,999 కాగా, అమెజాన్ దీనిని 25% డిస్కౌంట్‌తో రూ.29,999 అందిస్తోంది.
3. KARCHER RCV 3, 2-in-1
మార్కెట్‌లో లభిస్తున్న మరో అత్యుత్తమమైన రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ ‘KARCHER RCV 3, 2-in-1’. దీనిని KARCHER RCV యాప్ ద్వారా సులభంగా కంట్రోల్ చేయవచ్చు. ఇది ఎలాంటి ఫ్లోర్‌నైనా అద్భుతంగా శుభ్రం చేయకలదు. పెంపుడు జంతువుల శరీరం నుంచి వచ్చి పడే వెంట్రుకలను సైతం తొలగించి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుతుంది. LiDAR Technology రూపొందిన ఈ వాక్యూమ్ క్లీనర్ ఇతర వాటితో పోలిస్తే అతి తక్కువ శబ్దం చేస్తుందని కంపెనీ చెబుతోంది. దీని అసలు ధర రూ.54,800. కానీ, అమెజాన్ 45% రాయితీతో రూ.29,999 దీనిని అందిస్తోంది.
4. ILIFE T10s Robotic Vacuum Cleaner
ఈ వాక్యూమ్ క్లీనర్‌కు కూడా మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తోంది. ILIFE T10s యాప్‌ను ఉపయోగించి దీన్ని కంట్రోల్ చేయవచ్చు. ఏ సమయంలో క్లీన్ చేయాలో ముందుగానే యాప్ ద్వారా నిర్దేశించవచ్చు. అలెక్సా, గూగుల్ హోమ్ ద్వారా కూడా ఈ వాక్యూమ్ క్లీనర్‌ను నియంత్రించవచ్చు. సున్నితమైన ఫ్లోర్లనే కాకుండా కఠినమైన సిమెంట్ నేలను సైతం ఇది శుభ్రం చేస్తుంది. మూడు రకాల క్లీనింగ్ మోడ్‌లను ఈ వాక్యూమ్ క్లీనర్ కలిగి ఉంది. అమెజాన్‌లో ఇది రూ.38,548లకు అందుబాటులో ఉంది.
5. TP-Link Lidar Navigation
ఈ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్‌ను Tapo యాప్ ద్వారా ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. ఇది LiDAR & Gyro Dual Navi System, 4200 Pa Hyper Suction, Carpet Auto-Boost ఫీచర్లను కలిగి ఉంది. 5 గంటల పాటు నిర్విరామంగా పనిచేయగల సామర్థ్యం ఈ వాక్యూమ్ క్లీనర్‌కు ఉంది. 4L Large Dust Bagను కూడా ఇది కలిగి ఉంది. ఎంత సమయంలో ఇది ఇంటిని శుభ్రం చేస్తుందో Tapo యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వాక్యూమ్ క్లీనర్ అసలు ధర రూ.67,999 కాగా అమెజాన్ దీనిపై 41 శాతం రాయితీ ఇస్తోంది. ఫలితంగా దీన్ని రూ.39,999కే పొందవచ్చు.
Celebrities Featured Articles Movie News
Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్!