హాట్ బ్యూటీ రుహానీ శర్మ (Ruhani Sharma) తన గ్లామర్ షోతో మరోమారు సోషల్ మీడియాను హీటెక్కించింది. రెడ్ కలర్ జాకెట్‌లో ఎద అందాలను ఆరబోసింది.
ఎర్రటి జాకెట్‌తో తెల్లటి అందాలను ప్రదర్శించి నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ ఫొటోలకు స్మైలింగ్ ఎమోజీని క్యాప్షన్‌గా పెట్టి కుర్రకారుకు కొంటె వల విసిరింది.
రుహానీ శర్మ అందాలతో పాటు ఫిట్‌నెస్ కూడా ఈ ఫొటోల్లో కనిపించింది. ఆమె ఫిజిక్ అద్భుతంగా ఉందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రుహానీ శర్మ.. తమిళ చిత్రం ‘కడైసి బెంచ్ కార్తీ’ (Kadaisi Bench Karthi) అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
2018లో వచ్చి ‘చిలసౌ‘ చిత్రంతో ఈ అమ్మడు తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్‌కు జోడీగా నటించి మెప్పించింది.
‘చిలసౌ’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో రుహానీకి వెంటనే టాలీవుడ్‌లో అవకాశం దక్కలేదు. దీంతో ఈ భామ ఫోకస్ మలయాళ ఇండస్ట్రీపై పడింది.
2018లో ‘కమల’ అనే చిత్రంలో నటించిన రూహానీ.. ఆ సినిమా ద్వారా మలయాళ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో మంచి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది.
2020లో విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ‘హిట్‘ సినిమాలో ఈ బ్యూటీకి అవకాశం దక్కింది. ఇందులో నేహా పాత్రలో తెలుగు ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది.
ఆ తర్వాత ‘అవసరాల శ్రీనివాస్’ కథానాయకుడిగా చేసిన ‘నూటక్క జిల్లాల అందగాడు‘ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. కానీ, రుహానీ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
గతేడాది ‘హర్ ; చాప్టర్ 1’ (Her – Chapter 1) అనే లేడీ ఒరియేంటెడ్ చిత్రంలో నటించిన ఈ భామ.. పోలీసు అధికారిణి పాత్రలో అదరహో అనిపించింది.
ఈ ఏడాది సంక్రాంతికి రీలైజన ‘సైంధవ్‘ చిత్రంలో డా.రేణు పాత్రలో కనిపించి రుహానీ ఆకట్టుకుంటుంది. ఇందులో వెంకటేష్‌తో పోటీ పడి నటించి అందరి ప్రశంసలు అందుకుంది.
మెగా హీరో వరుణ్ తేజ్ రీసెంట్ చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’లోనూ రుహానీ శర్మ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం పరాజయం పాలైనప్పటికీ.. రుహాని శర్మ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
తాజాగా ‘శ్రీరంగ నీతులు’ అనే సినిమాలోనూ ఈ ముద్దుగమ్మ నటించింది. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ రూహానీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ప్రస్తుతం రుహానీ.. హిందీలో ‘బ్లాకౌట్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
బ్లాక్ బాస్టర్ హిట్స్ రానప్పటికీ రుహానీ శర్మకు సోషల్ మీడియాలో ఏ మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఈ అమ్మడు మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.