ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ యుగం నడుస్తోంది. దీంతో వాహనాలు సైతం అధునాతన ఎలక్ట్రానిక్ ఫీచర్లతో వస్తున్నాయి. ప్రస్తుతం భారత్ కూడా ఎలక్ట్రానిక్ స్కూటర్ల హబ్‌గా మారుతోంది. ఇంధన ధరలు మండిపోతుండటంతో వాహనాల దారులు సైతం ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో అధునాతన పీచర్స్‌లో ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ అంకుర సంస్థ రన్‌ఆర్ మెుబిలిటీ (RUNR Mobility) కొత్త విద్యుత్ బైక్‌ను రిలీజ్ చేసింది. ‘RunR HS Electric Scooter’ పేరుతో మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బ్యాటరీ సామర్థ్యం
RunR HS Electric Scooterను 60V 40AH లిథియమ్ అయాన్ బ్యాటరీతో తీసుకొచ్చారు. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఇందులో BMS ఫీచర్ కూడా ఉంది.
ఇది ఎప్పటికప్పుడు బ్యాటరీ సమాచారాన్ని రైడర్‌కు చూపిస్తుంటుంది.
టాప్ స్పీడ్
RunR HS Electric Scooterకు 1.5 kw BLDC మోటార్‌ను అమర్చారు. దీని సాయంతో గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించవచ్చని సదరు కంపెనీ తెలిపింది.
భద్రతకు భరోసా
RunR HS Electric Scooterకు LED లైట్స్ ఫిక్స్ చేశారు. ఇది ప్రకాశవంతంగా వెలుగుతూ రాత్రివేళల్లోనూ ప్రయాణించేందుకు ఉపయోగపడనున్నాయి. అలాగే యాంటీ థెఫ్ట్ అలారమ్, డివైజ్ లొకేటర్ ఫీచర్లను ఎలక్ట్రిక్ స్కూటర్ కలిగి ఉంది.
LCD డిస్‌ప్లే
LCD డిస్‍ప్లేతో RunR HS Electric Scooterను తీసుకొచ్చారు. ఈ డిస్‍ప్లేలో విభిన్నమైన ఫీచర్లు యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే వాహనానికి సంబంధించిన సమాచారం కూడా ఈ డిస్‌ప్లేపై చూడొచ్చు.
కలర్స్
RunR HS Electric Scooter ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. వైట్, బ్లాక్, గ్రే, రెడ్, గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో మీకు నచ్చినది ఎంపిక చేసుకోవచ్చు.
ధర ఏంతంటే?
RunR HS Electric Scooter ప్రారంభ ధరను రూ.1.25 లక్షలుగా నిర్ణయించారు. ఇది ఎక్స్ షోరూం ధర. ప్రాంతాలను బట్టి ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలో స్వల్ప మార్పులు ఉండొచ్చు.
ఎక్కడ లభిస్తాయంటే?
ఈవీ స్కూటర్ తయారీ సంస్థ RUNR Mobility.. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల విక్రయ సంస్థ ఎలక్ట్రిక్ వన్‌తో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ఎలక్ట్రిక్ వన్ సంస్థకు చెందిన షోరూమ్‌లలో RunR HS Electric Scooters లభించనున్నాయి.