• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Samsung Galaxy F15 VS Nokia G42 5G: ఈ బడా కంపెనీల కొత్త మెుబైల్స్‌లో దేనిది పైచేయి..!

    ప్రముఖ మెుబైల్ కంపెనీ శాంసంగ్‌ ఇవాళ సరికొత్త మెుబైల్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 15 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను (Samsung Galaxy F15) విడుదల చేసింది. గతేడాది డిసెంబర్‌లో తీసుకొచ్చిన ‘గెలాక్సీ ఏ15’ (Galaxy A15 5G) మెుబైల్‌కు రీబ్రాండ్‌ వెర్షన్‌గా శాంసంగ్‌ ఈ ఫోన్‌ పరిచయం చేసింది. అయితే ఇటీవల ప్రముఖ టెక్‌ కంపెనీ నోకియా కూడా ‘నోకియా జీ42 5జీ’ (Nokia G42 5G) పేరుతో కొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ రెండూ మిడ్ రేంజ్‌ మెుబైల్స్‌ కావడంతో పాటు.. ప్రముఖ కంపెనీలకు చెందడంతో టెక్‌ ప్రియుల దృష్టి వీటిపై పండింది. ఈ రెండు ఫోన్ల ఫీచర్లు ఎలా ఉన్నాయి? వీటిలో ఏది కొంటే బెటర్? ఇప్పుడు చూద్దాం. 

    మెుబైల్ స్క్రీన్‌

    Samsung Galaxy F15 5G మెుబైల్‌.. 6.5 అంగుళాల FHD+ Super AMOLED స్క్రీన్‌తో మార్కెట్‌లోకి వచ్చింది. దీనికి 1,080×2,340 పిక్సెల్స్ క్వాలిటీ, 90Hz రిఫ్రెష్‌ రేట్‌, octa-core MediaTek Dimensity 6100+ చిప్‌సెట్‌, Android 14 ఆధారిత One UI 5 OSను కలిగి ఉంది. ఇక Nokia G42 5G మెుబైల్‌ విషయానికి వస్తే.. 6.56 అంగుళాల HD+ LCD స్క్రీన్‌, 90Hz రిఫ్రెష్ రేట్‌, 560 నిట్స్‌ పీక్స్‌ బ్రైట్‌నెస్‌, octa-core Qualcomm Snapdragon 480+ చిప్‌సెట్‌,  Android 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఫోన్‌ వచ్చింది. 

    స్టోరేజ్‌ & ర్యామ్‌

    Galaxy F15 5G మెుబైల్‌ను కంపెనీ రెండు వేరియంట్లలో లాంచ్‌ చేసింది. 4GB RAM + 128GB, 6GB RAM + 128GB వేరియంట్లలో మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. microSD కార్డు ద్వారా స్టోరేజ్‌ను మరింత పెంచుకునేందుకు కంపెనీ వీలు కల్పించింది. శాంసంగ్‌తో పోలిస్తే నోకియా.. ర్యామ్‌, స్టోరేజ్‌ విషయంలో కాస్త అప్‌డేటెడ్‌గా ఉంది. 6GB + 128GB, 8GB + 256GB ఆప్షన్స్‌తో Nokia G42 5G ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ర్యామ్‌, స్టోరేజ్‌ సామర్థ్యం ఎక్కువ కోరుకునే వారికి నోకియా మెుబైల్‌ సరైన ఎంపికలా ఉండవచ్చు. 

    కెమెరా క్వాలిటీ

    Samsung Galaxy F15 5G మెుబైల్‌.. ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌తో వచ్చింది. 50MP ప్రైమరీ కెమెరా + 5MP సెకండరీ సెన్సార్‌ + 2MP షూటర్‌ ఈ ఫోన్‌లో ఉన్నాయి. 13MP సెల్ఫీ కెమెరాను కూడా మెుబైల్‌కు ఫిక్స్ చేశారు. అటు Nokia G42 5G ఫోన్ వెనుక భాగంలో రెండు కెమెరాలతో మాత్రమే మార్కెట్‌లోకి వచ్చింది. 50MP ప్రైమరీ కెమెరా + 2MP సెన్సార్‌తో పాటు LED ఫ్లాష్‌లైట్‌ ఫోన్‌ వెనక భాగంలో అమర్చారు. ముందు వైపు 8MP ఫ్రంట్‌ కెమెరాను కూడా ఫిక్స్‌ చేశారు. కెమెరా పరంగా చూస్తే శాంసంగ్‌ కాస్త బెటర్‌ ఆప్షన్‌గా కనిపిస్తోంది.

    బ్యాటరీ

    Samsung Galaxy F15 5G మెుబైల్‌ ఏకంగా 6,000mAh బ్యాటరీతో భారత్‌లో అడుగుపెట్టింది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే రెండ్రోజుల పాటు నిర్విరామంగా బ్యాటరి లైఫ్‌ పొందవచ్చని కంపెనీ వర్గాలు తెలిపాయి. సింగిల్ ఛార్జ్‌తో 25 గంటల వీడియో ప్లేబ్యాక్‌ సమయాన్ని పొందవచ్చని పేర్కొంది. అటు నోకియా 20W ఫాస్ట్‌ఛార్జింగ్ సపోర్టు కలిగిన 5,000mAh బ్యాటరీని ఫోన్‌కు అందించింది. బెటర్‌ బ్యాటరీ లైఫ్‌ కోరుకునే వారిని నోకియా కంటే శాంసంగ్ ఎక్కువగా ఆకర్షిస్తుంది. 

    కనెక్టివిటీ ఫీచర్లు

    Galaxy F15 5G ఫోన్‌.. Wi-Fi 02.11a/b/g/n/ac, Bluetooth 5.3, GPS, 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌, USB Type-C పోర్ట్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కలిగి ఉంది. అలాగే యాక్సిలోమీటర్‌, గైరో, సెన్సార్‌, జియోమాగ్నటిక్‌ సెన్సార్‌, ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ ఫోన్‌లో ఉంది. అటు Nokia G42 5G సైతం వైఫై, GPS, Bluetooth 5.1, USB Type-C ఫీచర్లతో పాటు.. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌తో లభించనుంది. కనెక్టివిటీ, సెన్సార్లు, సెక్యురిటీ ఫీచర్ల పరంగా ఈ రెండూ ఫోన్లు సమానంగా ఉన్నాయి.

    కలర్ ఆప్షన్స్‌ 

    Samsung Galaxy F15 మెుబైల్‌ మూడు రంగుల్లో లభిస్తోంది. యాష్‌ బ్లాక్‌ (Ash Black), గ్రూవీ వైలెట్‌ (Groovy Violet), జాజీ గ్రీన్‌ (Jazzy Green) రంగుల్లో ఈ ఫోన్‌ పొందవచ్చు.  అటు Nokia G42 5G మెుబైల్‌ను కూడా మూడు రంగుల్లో పొందవచ్చు. గ్రే (Grey), పింక్‌ (Pink), పర్పుల్‌ (Purple) కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు.

    ధరలు ఎంతంటే?

    Galaxy F15 5G ప్రారంభ వేరియంట్‌ (4GB RAM + 128GB) ధరను కంపెనీ రూ.12,999 నిర్ణయించింది. 6GB RAM + 128GB మోడల్‌ను రూ.14,499 దక్కించుకోవచ్చని పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు శాంసంగ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఇక Nokia G42 5G ధర విషయానికి వస్తే బేసిక్ మోడల్‌ (4GB + 128GB)ను Rs. 9,999లకే కొనుగోలు చేయవచ్చు.  6GB + 128GB వేరియంట్‌ కావాలంటే రూ.12,999 ఖర్చు చేయాలి. లేటెస్ట్‌ వేరియంట్‌  8GB + 256GB ధరను రూ.16,999గా ప్రకటించింది. March 8 నుంచి ఈ వేరియంట్‌ అమెజాన్‌, HMD వెబ్‌సైట్‌లో లభించనుంది. 

    ఏది కొంటే బెటర్‌?

    Samsung Galaxy F15, Nokia G42 5G మెుబైల్స్‌ను పరిశీలిస్తే రెండూ దాదాపుగా ఒకే తరహా ఫీచర్లను కలిగి ఉన్నాయి. అయితే కెమెరా, బ్యాటరీ, ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విషయంలో మాత్రం శాంసంగ్‌ మెుబైల్‌ కాస్త బెటర్‌ ఛాయిస్‌గా కనిపిస్తోంది. ర్యామ్‌ & స్టోరేజ్ అంశంలో అయితే నోకియాది పైచేయిగా ఉంది. బడ్జెట్‌ పరంగా చూస్తే నోకియా ధర రూ.10 వేల లోపే ఉంది. అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను కోరుకునే వారు శాంసంగ్‌ను కొనుగోలు చేయవచ్చు. బడ్జెట్‌ సమస్యలు ఉన్న వారు మాత్రం నిరభ్యంతరంగా నోకియాను ఆర్డర్‌ చేసుకోవచ్చు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv