• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Samsung Galaxy F34 5G: నెల రోజుల వ్యవధిలో మరో 5G ఫోన్‌.. దీని ఫీచర్లకు మతి పోవాల్సిందే..

    భారత మార్కెట్‌పై టెక్ దిగ్గజం శాంసంగ్ ఫోకస్ పెట్టింది. వరుసగా మీడియాకోర్ స్మార్ట్‌ఫోన్‌లను లాంఛ్ చేస్తూ ఇండియన్ యూజర్లను ఆకట్టుకుంటోంది. గత నెలలో గెలాక్సీ M34 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంఛ్ చేయగా, తాజాగా గెలాక్సీ F34 5Gని తీసుకొచ్చింది. దాదాపుగా M34 5G సిరీస్‌ని పోలి ఉందీ స్మార్ట్‌ఫోన్.  ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ ఆర్డర్స్ ప్రారంభం కాగా ఈ నెల(ఆగస్టు 11) నుంచి దేశంలో ఓపెన్ సేల్ ప్రారంభం కానుంది. మరి, రెండు వేరియంట్లలో లాంఛ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లేంటో తెలుసుకుందాం. 

    డిస్ ప్లే

    Samsung Galaxy F34 Display విషయానికి వస్తే.. ఇందులో 6.46 అంగుళాల సూపర్ అమోల్డ్(AMOLED) స్క్రీన్‌ను ఫిక్స్‌ చేశారు. 120Hz రిఫ్రెష్ రేటుతో ఇది వస్తోంది. ఈ డిస్‌ప్లేకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లభిస్తోంది.

    స్టోరేజీ

    రెండు వేరియంట్లలో Samsung Galaxy F34 Storage అందుబాటులో ఉంది. మెుదటిది 6GB RAMతో పాటు 128GB స్టోరేజీని కలిగి ఉంది. రెండోది 8GB RAM / 128GB ROMతో వస్తోంది. 

    పర్ఫార్మెన్స్

    Samsung Galaxy F34 స్మార్ట్‌ఫోన్‌.. ఆండ్రాయిడ్ 13+ OneUI 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేయనుంది. ఇందులో పవర్‌ఫుల్ ఎక్సినోస్ 1280 చిప్‌సెట్‌తో ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. నాలుగేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ని కంపెనీ అందిస్తుంది.

    కెమెరా

    శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ మెుబైల్‌ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగా పిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లు ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 13మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

    బ్యాటరీ

    Samsung Galaxy F34లో భారీ Battery ఉంది. 6000mAh కెపాసిటీ దీని సొంతం. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 2 రోజుల పాటు నిరంతరాయంగా లైఫ్ ఇస్తుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీతో వస్తోంది.

    కనెక్టివిటీ

    వైఫై, బ్లూటూత్ 5.3 లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఇందులో ఉన్నాయి. ఆడియో జాక్ ఫెసిలిటీ లేదు.

     

    కలర్స్

    Samsung Galaxy F34 రెండు రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఎలక్ట్రిక్ బ్లాక్, మిస్టిక్ గ్రీన్ కలర్స్‌లో ఇష్టమైన దానిని ఎంపిక చేసుకోవచ్చు. 

    ధర

    6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999. కేవలం రూ.2,111 నుంచి నోకాస్ట్ ఈఎంఐ ప్రారంభం అవుతుంది. ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ బ్యాంక్ కార్డులపై రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.16,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.18,999కు సొంతం చేసుకోవచ్చు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv