భారత్‌లో మంచి బ్రాండ్ వాల్యూ ఉన్న టెక్ కంపెనీల్లో శాంసంగ్ (Samsung) ఒకటి. ముఖ్యంగా ఈ కంపెనీ రిలీజ్ చేసే శాంసగ్ గెలాక్సీ (Samsung Galaxy) మెుబైళ్లకు భారత మార్కెట్ మంచి డిమాండ్ ఉంది. ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చిలో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ ఏ54 5G (Samsung Galaxy A54 5G), గెలాక్సీ ఏ34 5G (Galaxy A34 5G) మెుబైల్స్ వినియోగదారులను విపరీతంగా ఆకర్షించాయి. గణనీయమైన సేల్స్‌ను నమోదు చేశాయి. తాజాగా ఈ మెుబైల్స్‌ను కొనాలని భావించే వారికి శాంసంగ్ గుడ్‌న్యూస్ చెప్పింది. వీటి ధరలను తగ్గించినట్లు ప్రకటించింది.
తగ్గింపు ఎంతంటే?
శాంసంగ్ గాలక్సీ A54 మెుబైల్ 8GB + 256GB వేరియంట్ ధరను ప్రారంభంలో రూ. 40,999గా నిర్ణయించారు. అదే విధంగా గెలాక్సీ A34 స్మార్ట్‌ఫోన్ 8GB + 128GB ధరను రూ.30,999గా కంపెనీ పేర్కొంది. తాజాగా ఈ ధరలపై శాంసంగ్ రూ.2000 క్యాష్‌బ్యాక్ ప్రకటించింది. ICICI, SBI క్రెడిట్ కార్డ్స్‌పై మరో రూ.2000 డిస్కౌంట్ ఉంది. దీంతో గెలాక్సీ A54 రూ.36,999, గెలాక్సీ A34 రూ.26,999లకే అందుబాటులోకి వచ్చాయి. అంటే ఒక్కో మెుబైల్‌పై ఏకంగా రూ.4000 తగ్గింది. అంతే కాకుండా 12 నెలల నో కాస్ట్ EMI, జీరో డౌన్ పేమెంట్ సౌకర్యం కూడా ఈ మెుబైల్స్‌పై ఉన్నాయి. మరి ఈ స్మార్ట్‌ఫోన్స్ ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Samsung Galaxy A54 5G
గెలాక్సీ A54 మెుబైల్.. వైట్ కలర్‌లో తాజాగా విడుదలైంది. యువతులను ఆకర్షించేందుకు గాను ఈ రంగును తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ 6.4 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందించారు. ఇది One UI 5.1 ఆధారిత ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతుంది.సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. బ్యాక్ కెమెరా సెటప్‌లో 50 MP ప్రైమరీ కెమెరా, 12 MP అల్ట్రా వైడ్ కెమెరా, 5MP మాక్రో కెమెరా ఉంది. ఇది 5,000mAh బ్యాటరీని కలిగి ఉండగా, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
Samsung Galaxy A34 5G
ఇందులో 6.6 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 8జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ వర్క్ చేస్తుంది. ఈ మెుబైల్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ప్రధాన కెమెరా సామర్థ్యం 48 MP కాగా దీంతోపాటు 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 5 MP మాక్రో సెన్సార్ కూడా అందించారు. ముందు వైపు 13 MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్ చేశారు. 5జీ, వైఫై, బ్లూటూత్ జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో అందించారు. ఏ34 బ్యాటరీ సామర్థ్యం 5000 mAhగా ఉంది.