స్మార్ట్ ఫోన్స్ దిగ్గజం శాంసంగ్.. మరో కొత్త మొబైల్(Samsung Galaxy M05)ను గురువారం( సెప్టెంబర్ 12) భారత మార్కెట్లో లాంచ్ చేసింది. బెసిక్ మోడల్‌గా శాంసంగ్ దీనిని తీసుకొచ్చింది. రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇవ్వనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5G కనెక్టివిటీ లేకపోయినా, 50MP ప్రధాన కెమెరా, పెద్ద డిస్ప్లే, అలాగే రెండేళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ (OS) అప్‌డేట్స్ అందుబాటులో ఉండనున్నాయి. గెలాక్సీ M05 ఫీచర్స్ ఓసారి పరిశీలిద్దాం.
డిస్‌ప్లే:
ఈ గ్యాడ్జెట్ 6.74 అంగుళాల హెచ్‌డీ+ పీఎల్‌ఎస్ (720 x 1600 పిక్సెల్స్)ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తోంది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐతో పనిచేస్తుంది. 60Hz రిఫ్రెష్ రేటు కలిగి ఉంది. ఇందులో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఉపయోగించారు. డ్యూయల్ నానో సిమ్‌కు సపోర్ట్ చేసేలా దీన్ని రూపొందించారు. మైక్రోఎస్‌డీ కార్డ్ సాయంతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకొనే సదుపాయం ఉంది.
కెమెరా
కెమెరాల విషయంలో శాంసంగ్ ఎక్కడా రాజీపడినట్లు కనిపించడం లేదు. వెనుక వైపు M05 50MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్, LED ఫ్లాష్‌తో వస్తుంది. ముందు భాగంలో, 8MP f/2.0 యాపర్చర్‌తో సెల్ఫీ కెమెరా అందించబడింది. దీంతో నాణ్యమైన ఫోటోలు తీసుకోవచ్చు.
సాఫ్ట్‌వేర్ పరంగా, ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 OS పై పనిచేస్తుంది. రెండేళ్ల పాటు OS అప్‌డేట్స్, మూడేళ్ల పాటు సెక్యూరిటీ ప్యాచ్‌లు అందిస్తామని కంపెనీ ధృవీకరించింది.
ఒక్క వేరియంట్ మాత్రమే
శాంసంగ్ నుంచి విడుదలైన ఈ కొత్త ఫోన్ ఒక వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. 4జీబీ+ 64జీబీ వేరియంట్ ధర రూ.7,999గా కంపెనీ నిర్ణయించింది. మింట్ గ్రీన్ రంగులో ఈ ఫోన్ లభిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్ ప్లాట్‌ఫామ్‌తోపాటు ఇతర రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు.
బ్యాటరీ
ఈ ఫోన్ 5000mAh బ్యాటరీని 25W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 5.3, GPS, 3.5mm ఆడియో జాక్, USB టైప్-సీ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధర
సాంసంగ్ గెలాక్సీ M05 భారతదేశంలో 4GB/64GB వేరియంట్ ధర రూ. 7,999గా నిర్ణయించబడింది. దీన్ని సాంసంగ్ వెబ్‌సైట్, అమెజాన్ మరియు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ల ద్వారా మింట్ గ్రీన్ కలర్ వేరియంట్‌లో కొనుగోలు చేయవచ్చు.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?