ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ తన తాజా స్మార్ట్‌ఫోన్ మోడల్ అయిన గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ (Samsung Galaxy S24 FE) ను ఆవిష్కరించింది. ఇది గతంలో విడుదల చేసిన ఎస్24 మోడల్‌కు పోలి ఉండే డిజైన్‌ను కలిగి ఉంది. ప్రీమియం సెగ్మెంట్లో ప్రతి సంవత్సరం ప్రవేశపెట్టే ఎస్ సిరీస్ ఫోన్లకు కొనసాగింపుగా, కాస్త తక్కువ ధరలో ఫ్యాన్ ఎడిషన్‌ను (FE) తీసుకొచ్చింది.
గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అన్ని మోడల్స్‌లో 8జీబీ ర్యామ్ ఉంది. ఇది 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లతో వస్తుంది. అక్టోబర్ 3 నుంచి దేశీయ మార్కెట్లో సేల్స్ ప్రారంభం కానున్నాయి. అయితే నేటి నుంచి( సెప్టెంబర్ 27) ప్రీ ఆర్డర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ బ్లూ, గ్రాఫైట్, గ్రే, మింట్, యెల్లో వంటి నూతన రంగులలో లభిస్తుంది.
శాంసంగ్ ఎస్24 ఎఫ్ఈకి సంబంధించిన ధరలను కంపెనీ రెండు వేరియంట్ల పరంగా ప్రకటించింది. 128జీబీ వేరియంట్ రూ.59,999గా, 256జీబీ వేరియంట్ రూ.65,999గా ఉంది. 512జీబీ వేరియంట్‌కు సంబంధించిన ధర ఇంకా వెల్లడించలేదు.
ఫీచర్ల పరంగా:
- ఆపరేటింగ్ సిస్టమ్: గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్‌యూఐ 6.1తో పనిచేస్తుంది.
- డిస్ప్లే: 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డైనమిక్ అమోలెడ్ 2X డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేటుతో అందుబాటులో ఉంటుంది.
- ప్రాసెసర్: 4నానో మీటర్ డెకా కోర్ ఎగ్జినోస్ 2400ఈ ప్రాసెసర్ అమర్చారు.
- బ్యాటరీ: 4700 ఎంఏహెచ్ బ్యాటరీ మరియు 25W ఫాస్ట్ ఛార్జింగ్ వ్యవస్థ ఉన్నాయి.
- రేటింగ్: ఐపీ68 రేటింగ్‌తో ఈ ఫోన్లో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉంటుంది.
- ఏఐ ఫీచర్లు: సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్లేషన్, నోట్ అసిస్టెంట్, ఇంటర్ప్రిటేర్ మోడ్ వంటి ప్రత్యేక ఏఐ ఫీచర్లు ఉన్నాయి.
కెమెరా
ఈ ఫోన్లో ప్రధాన ఫీచర్ కెమెరా సెటప్ అని చెప్పవచ్చు. ఇందులో AI ఆధారిత సాంకేతికతను ఉపయోగించారు. తద్వారా వినియోగదారులకు సృజనాత్మక ఫోటోగ్రఫీకి అవకాశం కల్పిస్తుంది
బ్యాక్ కెమెరా సెటప్:
- ప్రధాన కెమెరా:
- రెసొల్యూషన్: 50 MP
- ఫీచర్స్: ఆప్టికల్ ఇమేజ్ స్టబిలైజేషన్ (OIS), AI ఫోటోగ్రఫీ మోడ్లు రాత్రి సమయంలో చక్కగా ఫోటోలు తీసుకోవడానికి సహాయపడతాయి.
- టెలిఫొటో లెన్స్:
- రెసొల్యూషన్: 8 MP
- జూమ్: 3x ఆప్టికల్ జూమ్, దూరపు వస్తువులను స్పష్టంగా తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది.
- అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా:
- రెసొల్యూషన్: 12 MP
- ఫీల్డ్ ఆఫ్ వ్యూ: 123 డిగ్రీస్ యాంగిల్లో వీడియో రికార్డ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.
ఫ్రంట్ కెమెరా:
- రెసొల్యూషన్: 10 MP
- ఫీచర్స్: సెల్ఫీల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. వీడియో కాల్స్‌కు కూడా అనుకూలంగా ఉంటుంది.
వీడియో రికార్డింగ్:
- 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యం, వినియోగదారులు అధిక-రెసొల్యూషన్ వీడియోలను సులభంగా తీసుకోవచ్చు.
అదనపు ఫీచర్లు:
- AI ఫోటో అసిస్టెంట్: ఫోటోలు తీసేటప్పుడు ఉత్తమమైన ఫలితాలను పొందడానికి ఉపయోగపడుతుంది.
- సర్కిల్ టు సెర్చ్: ఈ ఫీచర్‌ను ఉపయోగించి, ఫోటోలను సులభంగా వర్గీకరించవచ్చు.
- లైవ్ ట్రాన్స్లేషన్: ఆవిష్కరణలను మరింత సులభతరం చేస్తుంది.
ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫొన్‌ను శామ్సంగ్ ఆఫిషియల్ వెబ్సైట్ ద్వారా ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు. అక్టోబర్ 3 నుంచి ఈ-కామర్స్ సైట్లలో అందుబాటులో ఉంటుంది.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?