ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) లాంచ్ చేసిన నయా గెలాక్సీ ఫోన్ విక్రయాలు నేటి నుంచి భారత్‌లో మెుదలయ్యాయి. దేశీయంగా (Made in India) నోయిడా ఫ్యాక్టరీలో తయారైన గెలాక్సీ ఎస్24 సిరీస్ (Samsung Galaxy S24 Series) ఇవాళ్టి నుంచి టెక్ ప్రియులకు అందుబాటులోకి వచ్చింది. ఈ నయా గెలాక్సీ సిరీస్‌ను ఇంప్రెసివ్ ఫీచర్లతో శాంసంగ్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఇందులోని AI ఫీచర్లు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దీంతో టెక్ ప్రియులు గెలాక్సీ ఎస్24 కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తున్నాయి. మరి AI ఫీచర్లు ఎలా పనిచేస్తాయి? వాటితో మనకు కలిగే ప్రయోజనం ఏంటి? అలాగే మెుబైల్ ఇతర ఫీచర్లు, ధర వంటి విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
AI ఫీచర్స్
శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌లో అనేక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో ఫొటో అడ్జెస్టబుల్ ఫీచర్ ఒకటి. ఫొటోల్లో ఏదైనా ఒకదాన్ని సర్కిల్ చేసి సైజును అడ్జెస్ట్ చేసుకోవచ్చు. దానికి మరొక ఫొటోను జతచేయడం, తొలగించడం వంటివి చేయవచ్చు. అంతేకాకుండా మీరు చూస్తున్న వీడియోలో మీకు తెలియని వస్తువు కనిపిస్తే దాన్ని సర్కిల్ చేయడం ద్వారా గూగుల్‌లో అది ఏదో కనిపెట్టవచ్చు. ఎలాగో ఈ కింది వీడియో చూడండి.
అల్ట్రా జూమింగ్ ఫీచర్
ఏ ప్రీమియం మెుబైల్‌లో చూడని అల్ట్రా జూమింగ్ ఫీచర్‌ను గెలాక్సీ ఎస్24 సిరీస్‌ను అందించారు. దీని ద్వారా చాలా దూరంగా వస్తువులను సైతం మీ కెమెరాల్లో ఎంతో అద్భుతంగా బందించవచ్చు. కంటికి కనిపించని వస్తువులను కూడా గెలాక్సీ ఎస్24 కెమెరా కళ్లతో స్పష్టంగా చూడవచ్చు. అయితే ఈ ఫీచర్‌ను ట్రోల్ చేస్తూ కొన్ని వీడియోలు సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
AI కలర్ ఫొటో
ఏదైన బ్లాక్ & వైట్ ఫొటోను గెలాక్సీ ఎస్24 సాయంతో ఎంతో అందమైన కలర్ ఫొటోగా మార్చవచ్చు. ఇందులోని AI టెక్నాలజీ ఆ ఫొటోకు సరిపోయే కలర్లను ఆటోమేటిక్‌గా అందిస్తుంది. ఈ మాయ ఎలా ఉంటుందో ఈ కింద వీడియోలో వీక్షించండి.
ఏదైనా పర్యాటక ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే ప్రసిద్ధ కట్టడాలకు సంబంధించిన సమాచారం మనకు తెలియకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఈ నయా గెలాక్సీ ఫోన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సంబంధిత కట్టడాన్ని కెమెరాతో సర్కిల్ చేసి సెర్చ్ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా గూగుల్‌లో దాని గురించి తెలుసుకోవచ్చు. ఫ్యాషన్‌కు సంబంధించిన వస్తువుల గురించి కూడా ఇలాగే కనుగొనవచ్చు. కింద వీడియోలు చూస్తే మీకే క్లారిటీ వస్తుంది.
AI కాలింగ్ ట్రిక్స్
పర్యాటక ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి భాష తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. విదేశాల్లో ఉండే క్లైయింట్స్ మాట్లాడాల్సి వచ్చినప్పుడు కూడా ఇదే సమస్య ఎదురవుతుంది. అయితే దీనికి గెలాక్సీ ఎస్24లోని AI కాలింగ్ ఫీచర్ ద్వారా చెక్ పెడుతుంది. పరభాష మాట్లాడే వారితో చక్కగా మాట్లాడేలా చేస్తుంది. అది ఏలాగో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది.
ఇక మెుబైల్ ఫీచర్ల, ధర విషయానికి వస్తే..
మూడు వేరియంట్లలో..
Galaxy S24 Series నుంచి మూడు వేరియంట్లలో ఫోన్లు సేల్స్‌కు వచ్చాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 (Samsung Galaxy S24), గెలాక్సీ ఎస్24 ప్లస్ (Galaxy S24+), గెలాక్సీ ఎస్24 అల్ట్రా (Galaxy S24 Ultra) మోడల్స్‌లో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.
మెుబైల్ స్క్రీన్
గెలాక్సీ ఎస్24 మోడల్ 6.2 అంగుళాల FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. S 24+, S24 Ultra వేరియంట్లు 6.7 అంగుళాలు, 6.8 అంగుళాల QHD+ స్క్రీన్‌తో లాంచ్ అయ్యాయి. వీటికి 120Hz రిఫ్రెష్ రేట్, 2600 Nit పీక్ బ్రైట్‌నెస్ అందించారు. S24 Ultra మోడల్‌లో ఎస్ పెన్ కూడా ఉంటుంది. ఈ అల్ట్రా ఫోన్ టిటానియం ఫ్రేమ్‌తో తయారవ్వగా మిగిలిన రెండు వేరియంట్లు అల్యూమినియం మెటీరియల్‌తో రూపొందాయి.
ర్యామ్ & స్టోరేజ్
ఈ నయా గెలాక్సీ సిరీస్ వేరియంట్ల ఆధారంగా వివిధ రకాల ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్స్‌ను కలిగి ఉన్నాయి. గెలాక్సీ ఎస్24 మోడల్ 8GB+256GB, 8GB+512GB వేరియంట్లలో, S24+ను 12GB+256GB, 12GB+512GB ఆప్షన్స్‌లో పొందవచ్చు. ఎస్24 అల్ట్రాను 12GB+256GB, 12GB+512GB, 12GB+1TB స్టోరేజ్ వేరియంట్లలో దక్కించుకోవచ్చు.
కెమెరా
Galaxy S24 Ultra మోడల్.. క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చింది. 200MP ప్రైమరీ + 50MP టెలిఫొటో + 10MP సపోర్టింగ్ సెన్సార్ + 12MP అల్ట్రా వైడ్ కెమెరాలు ఫోన్ వెనుక భాగంలో ఉన్నాయి. Galaxy S24, Galaxy S24+ వేరియంట్లు.. 50MP ప్రైమరీ + 10MP టెలిఫొటో + 12 అల్ట్రా వైడ్ కెమెరాలతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చాయి. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఈ మూడు ఫోన్లకు 12MP ఫ్రంట్ కెమెరాను ఫిక్స్ చేశారు. ఈ మెుబైల్స్‌తో 8K రిజల్యూషన్ క్వాలిటీ వీడియోలు రికార్డ్ చేయవచ్చు.
బిగ్ బ్యాటరీ
Samsung Galaxy S24 సిరీస్‌లోని మూడు వేరియంట్లు మూడు రకాల బ్యాటరీలతో లాంచ్ అయ్యాయి. Galaxy S24 మోడల్ 4,000mAh బ్యాటరీతో రాగా.. Galaxy S24+, Galaxy S24 Ultra వేరియంట్లు వరుసగా 4,900mAh, 5,000mAh బ్యాటరీలను కలిగి ఉన్నాయి. ఎస్24 అల్ట్రా, ఎస్24+ కి 45W ఫాస్ట్ ఛార్జింగ్ లభిస్తుంది. స్టాండర్డ్ మోడల్‌కు ఇది 25Wగా ఉంది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్స్ కూడా ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యూఐ 6.1 సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తాయి.
‘మేడ్ ఇన్ ఇండియా’ ఫీచర్లు
ఈ దేశీయ శాంసంగ్ గెలాక్సీ మెుబైల్స్.. లైవ్ ట్రన్స్‌లేట్ (Live Translate), ఇంటర్ ప్రీటర్ (Interpreter), చాట్ అసిస్ట్ (Chat Assist), నోట్ అసిస్ట్ (Note Assist), ట్రాన్స్‌స్క్రిప్ట్ అసిస్ట్ (Transcript Assist) వంటి ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌లోని AI ఆధారిత శాంసంగ్ కీబోర్డ్ (AI built Samsung Keyboard).. మెసేజ్‌లను 13 భాషల్లోకి అనువాదం చేయగలదు.
ఏడేళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్
ఈ కొత్త శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లు కొనుగోలు చేస్తే 7 ఏళ్లపాటు ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను, సెక్యూరిటీ ప్యాచ్‌లను ఉచితంగా పొందవచ్చు. అన్ని స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఐపీ68 రేటింగ్‌తో ఉంటాయి. ఇది ఫోన్లకు దుమ్ము, దూళి నుంచి రక్షణను అందిస్తుంది.
కలర్ ఆప్షన్స్
Galaxy S24 మోడల్.. ఆంబర్ ఎల్లో (Amber Yellow), కోబాల్ట్ వైలెట్ (Cobalt Violet), ఒనీక్స్ బ్లాక్ (Onyx Black) రంగుల్లో లభించనుంది. Galaxy S24+ కేవలం కోబాల్ట్ వైలెట్ (Cobalt Violet), ఒనీక్స్ బ్లాక్ (Onyx Black) కలర్ ఆప్షన్స్‌ను కలిగి ఉంది. ఇక S24 Ultraను టైటానియం గ్రే, టైటానియం వైలెట్, టైటానియం బ్లాక్ రంగుల్లో పొందవచ్చు.
ధర ఎంతంటే?
Galaxy S24 సిరీస్ ధరలు అధికారికంగా విడుదలయ్యాయి. S24 Ultra ప్రారంభ వేరియంట్ ధర రూ.1,29,999గా ఉంది. Galaxy S24 బేసిక్ మోడల్ (8GB + 256GB)ను రూ.79,999లకు శాంసంగ్ ఆఫర్ చేస్తోంది. Galaxy S24+ ప్రారంభ వేరియంట్ (12GB + 256GB)ధర రూ.99,999గా నిర్ణయించారు.
Galaxy S24 (8GB 256GB)- రూ.79,999
Galaxy S24 (8GB 512GB)- రూ.89,999
Galaxy S24+ (12GB 256GB)- రూ.99,999
Galaxy S24+ (12GB 512GB)- రూ.1,09,999
Galaxy S24 Ultra (12GB 256GB)- రూ.1,29,999
Galaxy S24 Ultra (12GB 512GB)- రూ.1,39,999
Galaxy S24 Ultra (12GB 1TB)- రూ.1,59,999
సేల్స్ ఆఫర్లు
వినియోగదారులు Galaxy S24 Ultra, Galaxy S24+ మెుబైల్స్‌ను కొనుగోలు చేస్తే రూ.12,000 వరకూ రాయితీ పొందవచ్చు శాంసంగ్ ప్రకటించింది. అదే Galaxy S24 మోడల్‌ను కొనుగోలు చేస్తే రూ.10,000 వరకూ డిస్కౌంట్ పొందవచ్చని స్పష్టం చేసింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న శాంసంగ్ స్టోర్లలో ఈ నయా గెలాక్సీ మెుబైల్స్‌ను పొందవచ్చు. అమెజాన్ కూడా ఈ గెలాక్సీ ఫోన్లపై రాయితీలతో పాటు EMI సౌకర్యాన్ని ఆఫర్ చేస్తోంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!