• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Samsung Galaxy XCover 7: శాంసంగ్‌ నుంచి ధనాధన్‌ గెలాక్సీ ఫోన్‌.. ఫీచర్లు ఇవే!

    ప్రముఖ టెక్ బ్రాండ్ శాంసంగ్‌.. మరో అడ్వాన్స్‌డ్‌ మెుబైల్‌ను లాంచ్‌ చేసింది. Samsung Galaxy XCover 7 పేరుతో దీన్ని విడుదల చేసింది. ఆరు నెలల క్రితం తీసుకొచ్చిన Galaxy XCover 6 Pro మెుబైల్‌లో అప్‌గ్రేడ్స్‌ చేసి ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇది కఠిన పరిస్థితులను తట్టుకుని నిలవగలదని శాంసంగ్‌ వర్గాలు తెలిపాయి. దుమ్ము, నీరు నుంచి పటిష్టమైన రక్షణను ఫోన్‌కి అందించినట్లు చెప్పాయి. ఈ గెలాక్సీ ఫోన్‌లో ఉన్న మరిన్ని ఫీచర్ల గురించి ఇప్పుడు చూద్దాం. 

    మెుబైల్ స్క్రీన్‌

    ఈ ఫోన్‌ 6.6 అంగుళాల FHD+ స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనికి 1,080 x 2,408 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, 60Hz రిఫ్రెష్‌ రేట్‌ను అందించారు. Android 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్, మాలి జీ57 జీపీయూతో ఫోన్‌ వర్క్‌ చేయనుంది. 

    ర్యామ్‌ & స్టోరేజ్‌

    ఈ గెలాక్సీ మెుబైల్‌ను 6GB RAM / 128 GB స్టోరేజ్ ఆప్షన్స్‌తో తీసుకొచ్చారు. microSD కార్డు ద్వారా 1TB వరకూ స్టోరేజ్‌ సామర్థ్యాన్ని పెంచుకునే వెసులు బాటును కల్పించారు.

    బిగ్‌ బ్యాటరీ

    Samsung Galaxy XCover 7 ఫోన్‌లో పవర్ బ్యాకప్ కోసం 4,050mAh బ్యాటరీని ఫిక్స్ చేశారు. దీనికి 15W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను అందించారు. దీని సాయంతో ఫోన్‌ను వేగంగా ఛార్జ్‌ చేసుకునేందుకు వీలవుతుంది. 

    కెమెరా

    Galaxy XCover 7 మెుబైల్‌.. సింగిల్‌ రియర్‌ కెెమెరాతో లాంచ్‌ అయ్యింది. ఫోన్‌ వెనక భాగంలో 50MP కెమెరాను అమర్చారు. దానికి LED ఫ్లాష్‌ సపోర్టు అందించారు. ఇక ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్‌ చేశారు. 

    సెక్యూరిటీ

    ఈ గెలాక్సీ ఫోన్‌లో భద్రత కోసం ఫేస్‌ అన్‌లాక్, శాంసంగ్ నాక్స్, శాంసంగ్ నాక్స్ వాల్ట్ ఉన్నాయి. అలాగే IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్, MIL-STD-810H మిలిటరీ స్టాండర్డ్స్ రేటింగ్ కూడా  ఫోన్‌కు అందించారు.

    కనెక్టివిటీ ఫీచర్లు

    Galaxy XCover 7 ఫోన్‌లో డ్యూయల్‌ సిమ్‌ (Nano + SIM), 5జీ సపోర్ట్‌, WiFi, బ్లూటూత్‌, NFC, GPS,  GLONASS, Galileo, BeiDou, QZSS, 3.5mm ఆడియో జాక్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. అలాగే ప్రాక్సిమిటి, గైరో స్కోప్‌, జియోమెట్రిక్‌ వంటి సెన్సార్లు ఫోన్‌కు అందించారు.

    ధర ఎంతంటే?

    Samsung Galaxy XCover 7 డివైజ్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అయితే ఈ ఫోన్‌ ధర రూ.32,590గా ఉండవచ్చని టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv