హిందీ బిగ్‌బాస్ ఓటీటీ సీజన్3 విజేతగా టాలీవుడ్ నటి సనా మక్బుల్ (Sana Makbul) నిలిచింది. టైటిల్‌తో పాటు రూ.25 లక్షల బహుమతిని అందుకుంది. దీంతో ఈ అమ్మడి పేరు నెట్టింట మార్మోగుతోంది.
సనా మక్బుల్ గురించి తెలుసుకునేందుకు బిగ్ బాగ్ ఆడియన్స్ ఆసక్తికనబరుస్తున్నారు. ఈ భామను ఎక్కడో చూశామే అని తెలుగు ప్రేక్షకులు సైతం బుర్రలు బద్దలు కొట్టుకున్నారు.
ముంబయిలో పుట్టి పెరిగిన సనా మక్బుల్ తెలుగు ఫిల్మ్‌తోనే సినీ రంగ ప్రవేశం చేసింది. ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి ఆకట్టుకుంది.
సినిమాల్లోకి రాకముందు సనా టెలివిజన్ నటిగా కెరీర్ ప్రారంభించింది. ‘ఇషాన్ : సప్నో కో అవాజ్ దే’, ‘కితనీ మెహబ్బత్ హై 2’, ‘ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్?’, ‘అర్జున్’ వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు సంపాదించింది.
ఆ ఫేమ్‌తోనే దిక్కులు ‘చూడకు రామయ్య’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ ట్రయాంగిల్ లవ్ చిత్రంలో సంహిత పాత్రలో నటించింది. అందం, అభినయంతో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.
ఆ తర్వాత ‘రంగూన్’ (2017) అనే తమిళ ఫిల్మ్‌తో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇక అదే ఏడాది ‘కాదల్ కండీషన్స్ అప్లే’ అనే మూవీలోనూ సనా మక్బూల్ నటించింది.
2017లో ‘మామ ఓ చందమామ’ అనే తెలుగు ఫిల్మ్‌లో సనా మక్బూల్ నటించింది. ఇందులో బుజ్జమ్మ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.
తెలుగులో చేసిన రెండు చిత్రాలు కమర్షియల్‌గా హిట్ కాకపోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో బాలీవుడ్‌పై సనా ఫోకస్ పెట్టింది.
హిందీలో గేమ్స్, వినోదానికి సంబంధించిన పలు రియాలిటీ షోలలో పాల్గొని అక్కడి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.
ఈ క్రమంలోనే ఇటీవల ‘బిగ్ బాస్ ఓటీటీ 3’ రియాలిటీ షోలో పాల్గొని తన ప్రవర్తనతో అందరి చేత ప్రసంసలు అందుకుంది. తాజాగా టైటిల్ సైతం గెలుచుకొని విజేతగా నిలిచింది.
సనా మక్బూల్ పలు మ్యూజిక్ వీడియోలలో నటించింది. ‘ఖేలేగి క్యా?’, ‘సైకో’, ‘గల్లాన్’, ‘ఎక్ తూ హి తో హై’ ఆల్బమ్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంది.
బుల్లితెర షోలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు రచ్చ రచ్చ చేస్తోంది. బిగ్‌బాస్‌కు వెళ్లకముందు వరకూ తన హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను హోరెత్తించింది.
ఈ అమ్మడి అందచందాలను చూసి నెటిజన్లు మైమరిపోయారు. ఇంతటి అందాల తారకు హీరోయిన్‌గా ఎందుకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో సనా మక్బూల్‌కు పెద్ద ఎత్తునే ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఖాతాను 2.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్