బాలీవుడ్ బ్యూటీ సంజీదా షేక్.. ‘హీరామండీ’ సిరీస్‌తో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది.

‘హీరామండి’లో వహీదా పాత్రలో కనిపించినా ఈ అమ్మడు.. నెగిటివ్ రోల్లో అలరించింది.

ముఖంపై గాటుతో ఆమె చేసిన పర్ఫార్మెన్స్ చూసి అన్ని భాషల ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

సంజీదా షేక్.. 20 డిసెంబర్, 1984లో కువైట్‌లో జన్మించింది.

సినిమాల్లోకి రాకముందు పలు హిందీ సీరియళ్లలో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.

ముఖ్యంగా ‘క్యా హోగా నిమ్మో కా’ అనే సీరియల్‌తో సంజీదాకు ఒక్కసారిగా క్రేజ్ వచ్చింది.

ఓ వైపు సీరియళ్లు, మరోవైపు టెలివిజన్ షోలు చేస్తూ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది.

2003లో వచ్చిన ‘భాగ్బన్’.. హిందీలో ఆమె చేసిన తొలి చిత్రం.

ఆ తర్వాత తమిళంలో పొన్నియన్ సెల్వన్ (2005), కన్నడలో ‘శుభం’ (2005) సినిమాలు చేసింది.

‘పంఖ్’, ‘అష్కే’, ‘నవాబ్జీదే’, ‘తైష్’, ‘కాలి ఖుషీ’, ‘మెయిన్ తే బాపు’ చిత్రాలతో అలరించింది.

ఈ ఏడాది హిందీలో వచ్చిన ‘ఫైటర్’ సినిమాలోనూ సంజీదా ఓ కీలక పాత్రలో కనిపించింది.

ప్రస్తుతం బాలీవుడ్లో ‘కున్ ఫయా కున్’ అనే సినిమాలో ఈ భామ నటిస్తోంది.

సినిమా, సీరియల్స్‌తో పాటు పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ సంజీదా కనిపించింది.

‘బస్ ఏక్ బార్’, ‘అజ్నాబీ’, ‘రుకా హూన్’, ‘సయాన్’, ‘చహా హై తుజుకో’ వంటి ఆల్బమ్స్ చేసింది.

సంజీదా వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమెకు 2012లో వివాహం జరిగింది.

బాలీవుడ్ నటుడు అమీర్ అలీని పెళ్లి చేసుకుంది. సరోగసి విధానంలో బిడ్డను కూడా కన్నది.

అనివార్య కారణాల వల్ల భర్తతో సంజీదా 2020లో విడిపోయింది.

2021లో వీరికి విడాకులు మంజూరు కాగా, కూతురు ఐరా అలీ సంజీదా వద్దే ఉంటోంది.

కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడినట్లు సంజీదా ఓ ఇంటర్యూలో తెలిపింది.

ఆడిషన్స్ సమయంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది.

ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కుమార్తె ఐరాతో ఈ అమ్మడు గడుపుతుంటుంది.

కుమార్తె ఐరాతో తీసుకున్న ఫొటోలు, వీడియోలను సంజీదా తరచూ ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటుంది.
ప్రస్తుతం సంజీదా ఇన్స్టాగ్రామ్ ఖాతాను 4.8 మిలియన్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు.

Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్