సెక్స్‌ను క్రీడగా గుర్తించిన తొలిదేశంగా స్వీడన్ నిలిచింది. శృంగారంపై మరింత అవగాహన పెంచేందుకు ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. అంతేగాక ఇతర క్రీడల మాదిరే సెక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలను సైతం స్వీడన్ నిర్వహించనుంది.
స్వీడన్ ఫెడరేషన్ ఆఫ్ సెక్స్ సంస్థ ఈ పోటీలను నిర్వహించనుంది. జూన్ 8 నుంచే పోటీలు ప్రారంభం కానున్నాయి. 6 వారాల పాటు పోటీలు జరగనున్నాయి. ఇందులో పాల్గొనాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
జడ్జిలు, ప్రేక్షకుల సమక్షంలో ఈ పోటీలు జరుగుతాయి. ముగ్గురు సభ్యులతో కూడిన జ్యూరీ ఉంటుంది. వీరే న్యాయ నిర్ణేతలు. ఇందులో విశేషం ఏమిటంటే, జడ్జిల కన్నా ఎక్కువగా ఆడియెన్స్‌ని పోటీదారులు మెప్పించాల్సి ఉంటుంది.
వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఫలితాలు లెక్కిస్తారు. దంపతుల మధ్య సాన్నిహిత్యం, శృంగారంపై అవగాహన, ఓర్పు, సహనం వంటి వాటిని ప్రామాణికంగా తీసుకుని మార్కులు కేటాయిస్తారు.
16 విధాలుగా పోటీలు ఉంటాయి. ఓర్పు, బాడీ మసాజ్, ఫోర్ ప్లే, మూడ్ జోన్స్ వెలికితీయుట, మోహం, పెనెట్రేషన్ తదితర వాటిపై పోటీదారులకు పరీక్ష పెట్టనున్నారు.
పోటీల్లో పాల్గొనేవారికి ‘కామసూత్ర’పై అవగాహన కలిగి ఉంటే బోనస్ పాయింట్లు కేటాయిస్తారు. శృంగారం, మోహం, కామం తదితర అంశాలపై పరిజ్ఞానం ఉన్నవారికి అదనంగా మార్కులు వస్తాయి.
పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఆడియెన్స్ 70 శాతం ఓట్లు వేస్తారు. జ్యూరీ సభ్యులు మిగతా ఓటింగ్‌ని పూర్తి చేస్తారు. రోజుకు కనీసం 6 గంటల పాటు ఈ పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది. ఒక్కో మ్యాచ్ 45 నుంచి 60 నిమిషాల పాటు ఉండనుందట.
శృంగారాన్ని కూడా క్రీడగా నిర్వహించి ఫలితాలను రాబట్టడం ఐరోపా దేశాల్లో కొత్త పంథాకు నాంది పలికినట్లు ఉంటుందని స్వీడిష్ ఫెడరేషన్ ఆఫ్ సెక్స్ చీఫ్ డ్రాగన్ బ్రాటిచ్ వెల్లడించారు. రానున్న కాలంలో ఇతర దేశాలు కూడా వీటిని నిర్వహిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
యూరోపియన్ సెక్స్ ఛాంపియన్‌షిప్ పేరిట పోటీలు నిర్వహించనున్నారు. ఐరోపా దేశాలకు చెందిన ఎవరైనా ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులు. ఇప్పటికే వివిధ దేశాలకు చెందిన 20 మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు ఫెడరేషన్ ఛైర్మన్ డ్రాగన్ బ్రాటిచ్ వెల్లడించారు.
సెక్స్‌పై తొలిసారి ఛాంపియన్‌షిప్ క్రీడలు నిర్వహిస్తున్న ఏకైక దేశంగా స్వీడన్ చరిత్రలో నిలిచిపోనుంది. గూటెన్‌బర్గ్‌లో జూన్ 8 నుంచి ఈ క్రీడలు ప్రారంభం అవుతున్నాయి. సెక్స్‌ని క్రీడగా గుర్తించడం అభినందనీయం అని డ్రాగన్ బ్రాటిచ్ కొనియాడారు.
Celebrities Featured Articles Movie News
Pawan Kalyan: ‘ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా’.. ఫ్యాన్స్‌పై పవన్ ఫైర్