• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Shravana Masam: శ్రావణమాసంలో మాంసాహారం తినొద్దని ఎందుకు చెబుతారో తెలుసా?

    తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం చాలా పవిత్రమైనది. ముఖ్యంగా హిందువులు ఈ మాసంలో శుచి, శుభ్రత పాటిస్తారు. చాలా మంది ఉపవాసాలు కూడా చేస్తారు. అయితే, శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఒక మాట అంతటా వినిపిస్తుంటుంది. అదే, ‘శ్రావణమాసంలో మాంసాహారం తినొద్దు’అని. కొందరు ఈ వాదనను లెక్కచేయరు. ఇదేదో మూఢ నమ్మకంగా పరిగణించి దీని వెనక ఉన్న వాస్తవాన్ని విస్మరిస్తారు. మరి, శ్రావణమాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు? తింటే ఏమవుతుంది? దీని వెనక ఏమైనా శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయా? తెలుసుకుందాం. 

    సాధారణంగా శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంటుంది. ఇంగ్లిష్ నెలల ప్రకారం సగటుగా జులై మధ్య నుంచి ఆగస్టు మిడ్ వరకు కొనసాగుతోంది. కొన్నిసార్లు అధిక మాసం వస్తుంటుంది. ఈ సారి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఆగస్టు 17 నుంచి నిజ శ్రావణ మాసం మొదలైంది. దీంతో ప్రత్యేక పూజలు, వరలక్ష్మీ వ్రతాలు, కుంకుమార్చనలతో ఆలయాల్లో సందడి నెలకొంది. ఈ క్రమంలోనే మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీని వెనక మతపరమైన, శాస్త్రీయ పరమైన కారణాలు ఉన్నాయి.

    వ్యాధులు

    వర్షాకాలం ఆరంభం కాగానే చాలా మంది వ్యాధుల బారిన పడుతుంటారు. ముఖ్యంగా, హెపటైటిస్, కలరా, డెంగీ వంటి రోగాలు దరిచేరతాయి. నీరు నిల్వ ఉండటం, శుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో ఈ వ్యాధులు వ్యాపిస్తాయి. ఇవే కాకుండా, పరిశుభ్రత లోపించడంతో పలు రకాలైన ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ఈ సమస్య మాంసాహార జంతువులకు కూడా ఎదురవుతుంది. దీంతో వాటి ద్వారా ఇన్‌ఫెక్షన్లు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు నమ్ముతారు. 

    సూర్యరశ్మి లేమి

    వానాకాలంలో వాతావరణం దాదాపుగా చల్లగానే ఉంటుంది. ఎడతెరపి లేని వర్షాలు కురిసినప్పుడు అసలు సూర్యోదయం జరగదు. దీంతో చాలా మంది కాస్త మెత్తబడతారు. సూర్యరశ్మి నుంచి విటమిన్ డి అందుతుంది. ఇది లోపిస్తే శరీరం త్వరగా అలసిపోతుంది. ఇది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. వానాకాలంలో సూర్య కిరణాలు తగ్గుముఖం పట్టడంతో జీర్ణ క్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా మాంసం వంటి అధిక ప్రొటీన్లు, కొవ్వులు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే జీవ గడియారం ఆలస్యమవుతుంది. ఫలితంగా ఆరోగ్యంపై చూపే ప్రభావం ఉంటుంది.  

    రోగ నిరోధక శక్తి

    వర్షాకాలంలో వాతావరణ మార్పులతో రోగ నిరోధక శక్తి కాస్త తగ్గుతుంది. అందుకే, చాలా మంది జ్వరాల బారిన పడతారు. ఆయుర్వేదం కూడా ఇదే సూచిస్తోంది. కాబట్టి, తేలికపాటి ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రసాలు తీసుకుంటే జీర్ణ క్రియ కూడా మెరుగ్గా పనిచేస్తుంది. మాంసాహారం తీసుకుంటే శరీరం ఉత్సాహంగా ఉండదు. 

    సంతానోత్పత్తి

    శ్రావణ మాసం సంతానోత్పత్తికి ప్రతీతి. జీవులు, జలచరాల సంతానోత్పత్తికి ఈ మాసం అనుకూలం. ఈ ప్రక్రియలో ఉన్నప్పుడు జలచరాలు కొన్ని వ్యర్థాలను నీటిలో విడుదల చేస్తుంటాయి. వీటిని చేపలు/రొయ్యలు తింటుంటాయి. ఇలా, ఆహారం కాస్త కలుషితం అవుతుంది. పైగా, గర్భంతో ఉన్న జీవాలను, గుడ్లు పెడుతున్న వాటిని చంపకూడదనే విశ్వాసం ప్రబలంగా నాటుకు పోవడం దీనికి మరొక కారణం. 

    పండగల నెల

    శ్రావణమాసంలో హిందువుల పండగలు మొదలవుతాయి. రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణాష్టమి, నాగపంచమి, ఓనం వంటి పండుగలు ఈ నెలలోనే వస్తాయి. కాబట్టి, ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటారు. దీంతో పాటు, ఆలయాలకు వెళ్లే వారు మాంసాహారం ముట్టుకోకూడదని ప్రజల విశ్వాసం. ఈ నెలలో ప్రతి రోజు ఏదొక పూజా కార్యక్రమం ఉంటుంది. ఫలితంగా మాంసాహారాన్ని దూరం పెడతారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv