• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Smartphones in August: బాబోయ్‌.. ఒక్క నెలలో ఇన్ని స్మార్ట్‌ఫోన్స్‌ వస్తున్నాయా.. మెుబైల్‌ ప్రియులకు ఇక పండగే..!

    ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ యుగం నడుస్తోంది. ప్రతీ వ్యక్తి జీవితంలో మెుబైల్ అంతర్భాగంగా మారిపోయింది. దీని ని గమనించిన ప్రముఖ మెుబైల్ సంస్థలు ఎప్పటికప్పుడు అత్యాధునిక ఫోన్లను లాంచ్‌ చేస్తూ మార్కెట్‌ను పెంచుకుంటున్నాయి. ఇదిలా ఉంటే స్మార్ట్‌ఫోన్స్‌ను అమితంగా ఇష్టపడేవారికి ఆగస్టు నెల పండగే అని చెప్పొచ్చు. కారణం ప్రముఖ మెుబైల్‌ కంపెనీలు తమ కొత్త మోడళ్లను ఈ నెలలోనే రిలీజ్‌ చేయబోతున్నాయి. ఇంతకీ ఆ ఫోన్లు ఏవి?. అవి ఎలాంటి ఫీచర్లు కలిగి ఉన్నాయి?. వాటి మార్కెట్ ధర ఎంత ఉండవచ్చు? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

    Infinix GT 10 Series

    ఇన్ఫినిక్స్‌ జీటీ 10 సిరీస్‌ ఫోన్ రెండు వేరియంట్లలో ఆగస్టు 3న విడుదల కానున్నాయి. ఇన్ఫినిక్స్‌ జీటీ 10 ప్రో, ఇన్ఫినిక్స్‌ జీటీ 10 ప్రో ప్లస్‌ పేర్లతో ఇవి రానున్నాయి. వీటి  ధర రూ.20,000 లోపు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా, ఈ ఫోన్‌ 120 రిఫ్రెష్‌ రేటుతో 6.74 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లేతో రానుంది. అలాగే 5000 mAh బ్యాటరీ, 108 MP ట్రిపుల్‌ కెమెరా ఫీచర్లను కలిగి ఉంది. జీటీ ప్రోలో మీడియాటెక్‌ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌, జీటీ 10 ప్రో ప్లస్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 

    Redmi 12 5G

    రెడ్‌మీ నుంచి ఈ నెలలో మరో అత్యాధునిక ఫోన్‌ మార్కెట్‌లోకి రానుంది. రెడ్‌మీ 12 5జీ పేరుతో ఆగస్టు మెుదటి వారంలో దీనిని లాంఛ్‌ చేయనున్నారు. ఈ ఫోన్‌ 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.79 అంగుళాల Full HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 ప్రాసెసర్‌ను వాడారు. కాగా, ఇదే ఫీచర్లతో పోకో ఎమ్ 6 ప్రో మోడల్‌ తీసుకొస్తున్నట్లు సమాచారం. అలాగే షావోమి ఫోల్డ్‌ 3 ఫోన్‌ కూడా ఈ నెలలోనే రానున్నట్లు తెలిసింది. అయితే దీని ధర, ఫీచర్లపై స్పష్టత లేదు. 

    Realme GT Neo 6

    ప్రముఖ చైనా మెుబైల్‌ కంపెనీ రియల్‌మీ నుంచి ఈ నెలలోనే మరో కొత్త మోడల్ లాంచ్‌ కానుంది.  రియల్‌మీ జీటీ నియో 6 పేరుతో దీన్ని తీసుకొస్తున్నారు. ఆగస్టు చివరి వారంలో ఇది లాంచ్‌ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మెుబైల్‌ 144 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ను వినియోగించారు. వెనకవైపు 50MP బ్యాక్ ట్రిపుల్‌ కెమెరాలు ఫిక్స్ చేశారు. అలాగే మీడియాటెక్‌ డైమెన్సిటి 9000 ప్రాసెసర్‌, 4,600 mAh బ్యాటరీ, 240 వాట్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్‌ సపోర్టు చేస్తుంది. 

    Samsung Galaxy F34 5G

    శాంసంగ్‌ కూడా ఆగస్టులో సరికొత్త గెలాక్సీ మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 34 5ని ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. ఈ ఫోన్‌ 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేటుతో 6.4 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లేను కలిగిఉంది. 6000 mAh బ్యాటరీ, ఎగ్జినోస్‌ 1280 ప్రాసెసర్‌ను ఇందులో ఉపయోగించారు. అయితే దీని ధరపై శాంసంగ్‌ స్పష్టత ఇవ్వలేదు.  

    Vivo V29, V29E Series

    ఆగస్టు మూడు లేదా నాల్గో వారంలో వివో వీ 29, వీ 29ఈ వేరియంట్లు విడుదల కానుంది. ఇందులో 6.67 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లేను అమర్చారు. వీ29 మోడల్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుక 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 13MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌, రెండు 2MP కెమెరాలు ఫిక్స్ చేశారు. అలాగే 32 MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్ చేశారు. 5000 mAh బ్యాటరీ 60 వాట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. ఈ వేరియంట్ ధర దాదాపు రూ.35-40 వేల మధ్య ఉంటుందని అంచనా.

    OnePlus Open

    ప్రముఖ మెుబైల్‌ కంపెనీ ఆగస్టు 29న వన్‌ప్లస్‌ ఓపెన్‌ (OnePlus Open) పేరుతో మడత (ఫోల్డ్‌) ఫోన్‌ను విడుదల చేయనుంది. దీనిని తెరిచినప్పుడు 7.8 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లే, మూసినప్పుడు 6.3 అంగుళాల స్మాల్ స్క్రీన్‌ కనిపిస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 ప్రాసెసర్‌ను ఇందులో వాడారు. 64MP బ్యాక్ ట్రిపుల్‌ కెమెరాలు ఇస్తున్నారు. 4,800 mAh బ్యాటరీ గల ఈ ఫోన్‌ ధర దాదాపు రూ. లక్ష వరకూ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

    Tecno Pova 5 Series

    టెక్నో పోవా 5 సిరీస్‌ మెుబైల్స్‌ ఈ నెలలోనే అందుబాటులోకి రానున్నాయి. టెక్నో పోవా 5, టెక్నో పోవా 5 Pro పేరుతో వీటిని లాంచ్ చేయనున్నారు. ఆగస్టు రెండు లేదా మూడో వారంలో ఇది మార్కెట్‌లోకి రానుంది. వీటిలో 6000 mAh బ్యాటరీ, 45 వాట్‌ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. మీడియాటెక్‌ హీలియో జీ99 ప్రాసెసర్ ఇందులో అమర్చారు. ఈ ఫోన్‌ వెనుకవైపు LED ఫ్లాష్‌లైట్ ఫిక్స్ చేశారు.

    Motorola G40

    మోటొరోలా నుంచి ఈ నెలలో మరో ఫోన్‌ వినియోగదారులను పలకరించనుంది. మోటోరోలా జీ 40 ఫోన్‌ను ఆగస్టు రెండు లేదా మూడో వారంలో లాంఛ్‌ చేయనున్నారు. దీని ధర రూ.20,000 లోపు ఉండొచ్చని అంచనా. ఇందులో 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్‌ హీలియో జీ80 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 

    Poco F5 Series

    ఈ సిరీస్‌లో పొకో ఎఫ్‌ 5, పొకో ఎఫ్‌ 5 ప్రో మోడల్స్‌ లాంఛ్‌ కానున్నాయి. 64MP+8MP+2MP రేర్‌ కెమెరాలు అమర్చారు. ఫ్రంట్‌లో 16 MP సెల్ఫీ కెమెరాను ఫిక్స్ చేశారు. పొకో ఎఫ్‌ 5లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ అమోల్డ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌ డ్రాగన్‌ 7+ జెన్‌ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv