మన ఇంటి నివాసాల్లోకి పాము వస్తే చంపేస్తాం, లేదా ఎవరైనా పాములు పట్టేవాళ్లను ఫోన్ చేసి పిలుస్తాం. వాళ్ళు వచ్చి వాటిని పట్టుకొని వెళ్తూ ఉంటారు. అలాంటి క్రమంలో పలువురు పాము కాటుకు గురవుతూ ఉంటారు. అయితే కేరళలోని తిరువనంతపురానికి చెందిన వావా సురేష్ చాలా ఫేమస్ స్నేక్ క్యాచర్. ఎంత ఫేమస్ అంటే ఎంపీ కూడా అతనికి హాని జరిగిందని తెలుసుకొని దిగ్భ్రాంతి చెందేంత ప్రసిద్ధి. ఎన్నో పాములను తన చేతితో పట్టుకొని అటు ప్రజలకు, ఇటు పాములకు రక్షిణ ఇచ్చాడు. కాని చివరికి ఆ పాము కాటుకే గురై ఆసుపత్రి పాలయ్యాడు.
పూర్తి వివరాల్లోకెళ్తే… కేరళలోని తిరువనంతపురానికి చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ వావా సురేష్ పాము కాటుకు గురయ్యాడు. దీంతో అతడిని కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. కొట్టాయంలోని కురిచ్చి నాగు పామును పడుతున్న సమయంలో కాటుకు గురయ్యాడు. అతడికి చికిత్స అందిస్తున్న డాక్టర్ మాట్లాడుతూ.. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, అయితే ఆసుపత్రికి తీసుకువచ్చినప్పటి నుంచి ఆరోగ్యం కొంచెం మెరుగుపడిందని తెలిపారు. ‘వావా సురేష్ ఇప్పుడు వెంటిలేటర్‌పై ఉన్నారు, వైద్యానికి స్పందిస్తున్నారు. 18 గంటల తర్వాత అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు అతని రక్తపోటు, హార్ట్‌బీట్ సాధారణంగా ఉంది’ తెలిపారు.
సోమవారం సాయంత్రం కొట్టాయంలోని కురిచ్చి సమీపంలో విషపూరితమైన పామును గోనె సంచిలో వేసేందుకు ప్రయత్నించగా సురేష్ కుడి తొడపై పాము కాటేసింది. దీనిపై కాంగ్రెస్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ‘ఈ వార్త విన్నందుకు చింతిస్తున్నానని, చివరిసారి ఇలా జరిగినప్పుడు, సురేష్‌ను ఆసుపత్రిలో పరామర్శించాను, అతను కోలుకున్నాడని తెలవడంతో సంతోషించాను. తిరువనంతపురం ప్రజలకు ఆయన ధైర్యసాహసాలు కొనసాగించేలా దేవుడు ఆయనను కాపాడాలి’ థరూర్ ట్వీట్ చేశారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!