టెక్ దిగ్గజం సోనీ (Sony) సరికొత్త ఇయర్ బడ్స్ (Earbuds)ను ఇవాళ భారత్‌లో లాంఛ్ చేసింది. ‘Sony WF-1000XM5’ పేరుతో దీన్ని పరిచయం చేసింది. ఈ ఏడాది జులైలోనే పలు దేశాల్లో ఈ ఇయర్ బడ్స్ విడుదలై మంచి ఆదరణ సంపాదించాయి. ఈ క్రమంలోనే వీటిని భారత్‌లోనూ సోనీ రిలీజ్ చేసింది. ఈ ఇయర్‌బడ్స్ అత్యుత్తమమైన సౌండ్ క్వాలిటీని అందిస్తాయని పేర్కొంది. దీంతో టెక్ ప్రియుల్లో వీటిపై ఎనలేని ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ‘Sony WF-1000XM5’ ధర, ఫీచర్స్, ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రొసెసర్
‘Sony WF-1000XM5’ ఇయర్‌బడ్స్‌లో ఇంటిగ్రేటెడ్ ప్రాసెసర్ V2 చిప్‌తో పాటు, నాయిస్ క్యాన్సిలేషన్ కోసం QN2e ప్రాసెసర్‌ను అమర్చారు. అలాగే కొత్త డైనమిక్ డ్రైవర్ Xని ఇవి కలిగి ఉన్నాయి. మెరుగైన కాల్ నాణ్యత కోసం డీప్ న్యూరల్ నెట్‌వర్క్ (DNN) ప్రాసెసింగ్ వీటికి అందించారు.
నాణ్యమైన కాల్స్
ప్రతి ఇయర్‌బడ్‌లో బోన్ కండక్షన్ సెన్సార్‌లు అమర్చబడి ఉంటాయి. వీటి ద్వారా కాల్ మాట్లాడే సమయంలో కాల్స్ నాణ్యత మెరుగ్గా ఉంటుందని కంపెనీ పేర్కొంది. బిగ్గరగా, గజి బిజీగా ధ్వనులతో ఉన్న పరిసర వాతావరణంలో కూడా మెరుగైన కాల్ నాణ్యతను ఇవి అందిస్తాయి. ఎటువంటి నాయిస్ డిస్ట్రబెన్స్ ఉండదు.
కనెక్టివిటీ
ఇది బ్లూటూత్ 5.3 కనెక్టివిటీని కలిగి ఉంది. వాయిస్ అసిస్టెంట్ Google లేదా Alexa సపోర్ట్ ఉంటుంది. చార్జింగ్ కోసం USB టైప్-C పోర్ట్‌ను అందించారు. అలాగే Qi చార్జర్‌ని ఉపయోగించి వైర్‌లెస్‌గా కూడా చార్జ్ చేయవచ్చు.
ఛార్జింగ్ లైఫ్
ఈ ఇయర్‌బడ్స్‌ను ఒకసారి చార్జ్ చేస్తే 8 గంటల నుంచి 12 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంది. దుమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం దీనికి IPX4 రేటింగ్‌ను అందించారు.
ధర ఏంతంటే?
ఈ ఇయర్‌బడ్స్ ధరను సోనీ రూ.24,990గా సోనీ నిర్ణయించింది. ప్రీ ఆర్డర్‌పై రూ.3000 క్యాష్ బ్యాక్‌తో పాటు , SRS-XB100BT Speakerను ఉచితంగా ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ వెసులు బాటు నేటి నుంచి (సెప్టెంబర్ 27) అక్టోబర్ 15 వరకూ మాత్రమే ఉంటుందని చెప్పింది.