కమెడియన్‌గా కడుపుబ్బా నవ్వించాలన్నా… హీరోగా ఎంట్రీ ఇచ్చి వినోదాన్ని పంచాలన్నా యాక్టర్ సునీల్ తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు విభిన్న పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేకత ఫ్యాన్ ఫాలోయింగ్‌ని ఏర్పరచుకున్న ఈ అందాల రాముడు ఫిబ్రవరి 28న తన 47వ బర్త్ డే వేడుకలను నిర్వహించుకున్నాడు.
ఈ సందర్భంగా ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసి ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఈ ఫొటో కాస్త సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. సునీల్ చేసిన మంచి పనికి నెటిజన్లు కామెంట్ల రూపంలో ప్రశంసిస్తున్నారు. దాదాపు ట్విట్టర్ ఫొటోలకు 8000 లైకులు కొట్టి సునీల్ పట్ల ఉన్న అభిమానాన్ని, అతడు చేసిన మంచి పనిని మెచ్చుకుంటున్నారు.
పవన్ కల్యాణ్ సినిమాతో ప్రస్థానం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో జన్మించిన సునీల్ కమెడియన్‌గా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1996లో పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ సినిమాలో చిన్న గుర్తింపులేని రోల్‌లో నటించారు. తదనాంతరం చిరునవ్వుతో, నువ్వే కావాలి లాంటి సినిమాల్లో కమెడియన్ పాత్ర పోషించి అందరినీ హాస్యానందంలో ముంచిలేపాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తనదైన పంచ్‌లతో ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
విభిన్న పాత్రలు
సునీల్ తొలుత కమెడియన్‌గానే వెండితెరకు పరిచయమైనప్పటికీ హీరో కావాలనే పట్టుదలతో ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇతను హీరోగా నటించిన మొట్టమొదటి ఫిల్మ్ అందాల రాముడు. ఆ తర్వాత మర్యాద రామన్న, పూల రంగడు, తడాఖా తదితర సినిమాల్లో హీరోగా మెరిశాడు. అలాగే కలర్ ఫొటో, ఇటీవల రిలీజైన పుష్ప సినిమాల్లో నెగిటివ్ రోల్‌ను కూడ సునీల్ పోషించాడు. విభిన్న పాత్రలలో నటిస్తూ తెలుగు సినీ అభిమానులకు వినోదం పంచుతూనే ఉన్నాడు. సునీల్ దాదాపు 177 సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను, పురస్కారాలను అందుకున్నాడు.
రాబోయే సినిమాలు
హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా ప్రస్తుతం బిజీగా మారాడు. వేదాంతం రాఘవయ్య, ముఖ చిత్రం, తీస్మార్ ఖాన్, F3, మర్యాద కృష్ణయ్య, నాకేంటీ, సంబరాల రాంబాబు సినిమాల్లో భిన్న పాత్రలు పోషించనున్నాడు. అలాగే రామ్ చరణ్- డైరెక్టర్ శంకర్ కాంబోలో రానున్న పాన్ ఇండియా మూవీ ఆర్‌సీ 15లో కూడ సునీల్ నటిస్తున్నట్లు సమాచారం.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి