బాలీవుడ్లో వచ్చిన యాక్షన్ చిత్రాల సిరీస్‌లో ‘ధూమ్’ (Dhoom)కి ప్రత్యేక స్థానం ఉంది. 2004లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పటికే పలు సీక్వెల్స్ వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద అవన్నీ సూపర్ హిట్స్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే త్వరలో ‘ధూమ్ 4’ పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. చిత్ర నిర్మాణసంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films) ఈమేరకు సన్నాహాలు కూడా మెుదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే కోలీవుడ్ సూపర్ స్టార్ సూర్య ఈ చిత్రంలో నటించనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.
సూర్య పాత్ర అదే?
హిందీలో వచ్చిన ధూమ్, ధూమ్ 2, ధూమ్ 3 చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. త్వరలోనే ‘ధూమ్ 4’ పట్టాలెక్కించేందుకు నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్ సన్నాహాలు చేస్తోంది. ‘ధూమ్, పార్ట్ 2, 3’లకు కథను అందించిన ఆదిత్య చోప్రానే (Aditya chopra) ఈ సినిమాకీ వర్క్ చేస్తున్నారని సమాచారం. ఇందులో షారుక్ ఖాన్ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో కోలీవుడ్ నటుడు సూర్యను అతడికి ప్రతినాయకుడిగా తీసుకోవాలని చిత్ర వర్గాలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటికే సూర్యను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రోల్లో యాక్ట్ చేేసేందుకు ఆయన ఆసక్తి చూపారని టాక్. దీంతో అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సూర్య ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.
రోలెక్స్‌గా మార్క్!
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమ్ట చిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. డ్రగ్స్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో తమిళనటుడు విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ముఖ్య పాత్ర పోషించాడు. అయితే క్లైమాక్స్‌లో డ్రగ్ డీలర్లకు హెట్‌గా సూర్య కనిపించిన సర్ప్రైజ్ చేశారు. రోలెక్స్ పాత్రలో అతడి లుక్ ఎంతో క్రూరంగా కనిపించింది. ‘విక్రమ్ 2’ చిత్రంలో సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నట్లు ఈ క్లైమాక్స్ ద్వారా డైరెక్టర్ స్పష్టం చేశారు. అంతకుముందు ‘24’ చిత్రంలోనూ సూర్య విలన్‌గా చేశాడు. ఇందులో రెండు పాత్రలు పోషించగా అందులో ఒకటి నెగిటివ్ రోల్.
చరణ్‌కు విలన్‌గా సూర్య!
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ (Ram Charan), తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ రాబోతున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కథను సూర్యకు వినిపించగా అది అతడికి బాగా నచ్చిందని సమాచారం. అయితే రామ్‌చరణ్‌కు స్టోరీ వినిపించాల్సి ఉందని తెలుస్తోంది. రామ్‌చరణ్ కూడా ఓకే చెప్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో హను రాఘవపూడి కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ సినిమా తర్వాతే రామ్-సూర్య సినిమాలు పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు.
12 వేల థియేటర్లలో ‘కంగువా’!
సూర్య ప్రస్తుతం ‘కంగువా’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీ సూర్య కెరీర్లో 42వ ప్రాజెక్ట్‌గా రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కంగువ గ్లింప్స్‌తో పాటు పోస్టర్లు విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు చిత్రబృందం ప్రకటించింది. అయితే దసరాకు కాకుండా నవంబర్ 15న కంగువాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రపంచ వ్యాప్తంగా 10భాషల్లో 12 వేల థియేటర్లలో దీన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట.
Celebrities Featured Articles Movie News
Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్!