మరో వైకాపా ఎమ్మెల్యే అసమ్మతి రాగం
నెల్లూరులో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కాల్ ట్యాపింగ్ వివాదం సీఎం జగన్ దగ్గరకు చేరగా… మరో ఎమ్మెల్యే నుంచి నిరసన ఎదురయ్యింది. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అసమ్మతి సెగతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. ఉదయగిరి నియోజకవర్గం పరిశీలకుడిగా వచ్చిన ధనుంజయ రెడ్డి వ్యవహారశైలి తనకు ఇబ్బందిగా మారిందని ఆరోపించారు. ఈ విషయంపై సీఎం జగన్కు ఫిర్యాదు చేశారు. తనపై పెత్తనం చేయడం కుదరదని వెల్లడించారు.