• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అందుకే రెండు చోట్ల పోటీ: కేసీఆర్

    రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృది ఆగదని ఇంకా ముందుకు సాగుతుందన్నారు. మేడ్చల్ జిల్లా కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘త్వరలో జరగబోయే ఎన్నికల్లో 95 నుంచి 100 అసెంబ్లీలను గెలుస్తున్నాము. రాష్ట్రానికే తలమానికంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దుతాం. నియోజకవర్గంలో ఏ ఒక్క నిరుపేద కూడా ఉండకూడదనేదే మన లక్ష్యం. గజ్వేల్‌ను వదిలిపెట్టి పోయేది లేదు, కామారెడ్డిలో పోటీ చేయడానికి కొన్నికారణాలు ఉన్నాయి’ అని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు.

    నేడు సుప్రీంలో బీఆర్ఎస్ పిటిషన్ విచారణ

    నేడు సుప్రీంలో బీఆర్ఎస్‌ పిటిషన్‌పై విచారణ జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులను మరో పార్టీకి కేటాయించడంపై సుప్రీంను బీఆర్ఎస్‌ ఆశ్రయించింది. ఫ్రీ సింబల్స్ జాబితాలో కారు గుర్తును పోలిన గుర్తులను తొలగించాలని పిటిషన్ దాఖలు చేసింది. రోడ్ రోలర్, చపాతి మేకర్, ట్రక్కు, టైప్ మిషిన్ వంటి గుర్తులు కారును పోలిన గుర్తులుగా బీఆర్ఎస్ పేర్కొంది. ఈ గుర్తుల వల్ల గత ఎన్నికల్లో భారీగా నష్టపోయినట్లు విన్నవించింది.

    కేసీఆర్ ఎన్నికల రథం సిద్ధం

    తెలంగాణ ఎన్నికల ప్రచారానికి BRS ప్రచార రథం సిద్ధమైంది. గులాబీ వర్ణంలో రూపొందిన ఈ బస్సులో అన్ని రకాల ఆధునిక వసతులు కల్పించారు. సీఎం కేసీఆర్ ఈ వాహనం ద్వారా ప్రసంగిస్తారు. ఈ వాహనంపై తెలంగాణ, భారత దేశ చిత్ర పటంతో పాటు రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఈరోజు సాయంత్రం హుస్నాబాద్ నుంచి సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అక్కడి సభలో బీఆర్ఎస్ మెనిఫెస్టో ప్రకటించనున్నారు.

    ‘తెలంగాణను ఆంధ్రలో కలపాలనుకుంటున్నారు’

    మంత్రి గంగుల కీలక వ్యాఖ్యలు చేశారు. “కేసీఆర్ లేని తెలంగాణను ఊహించలేం. ఆంద్రవాళ్లు తెలంగాణను తిరిగి ఆంధ్రలో కలపాలని చూస్తున్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ గురించి ఎందుకు? కాంగ్రెస్ బీ ఫారమ్‌లు బీజేపీ ఆఫీస్‌లో బీజేపీ బీ ఫారమ్‌లు కాంగ్రెస్ ఆఫీసులో తయారవుతున్నాయి. ఎన్నికలప్పుడు వచ్చేవారిని చూసి ప్రజలు మోసపోవద్దు’ అని చెప్పుకొచ్చారు.

    రేవంత్, హరీష్ బలికా బకరాలు: బండి

    BRS, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటేనని బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. “ఇతర పార్టీలలో డబ్బులు ఇచ్చి కండువాలు కప్పుతున్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ఒక్కటి. ప్రధాని మాట్లాడిన తర్వాత వాస్తవ విషయాన్ని ప్రజలు గుర్తించారు. బీజేపీని గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారు. మంచి అభ్యర్థులను కిషన్ రెడ్డి నాయకత్వంలో ఎంపిక చేసి ఢిల్లీకి పంపాం. కానీ కాంగ్రెస్ లిస్ట్ ప్రగతి భవన్‌కి వెళ్ళింది. రేవంత్ రెడ్డికి తెలియట్లేదు. కేసీఆర్‌ 30 మందికి పైసలు పంపారు. తెరవెనుక ఏమీ జరుగుతుందో అయన తెలుసుకోవడం లేదు. … Read more

    ‘బీఆర్ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు’

    రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల సందర్భంగా 54 మందితో కూడిన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిల తొలి జాబితాను ఆయన విడుదల చేశారు. వారితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ గత పదేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే 45 రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

    కేసీఆర్‌పై పోటీ చేస్తా: ఈటల

    బీజేపీ నేత ఈటల రాజేందర్ కీలక ప్రకటన చేశారు. అధిష్టానం అవకాశం ఇస్తే కేసీఆర్ పోటీ చేసే రెండు చోట్లా పోటీ చేస్తానని ప్రకటించారు. హుజూరాబాద్‌లో మీరే కథానాయకులు అవ్వాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. భార్య జమున కేసీఆర్‌పై పోటీకి దిగుతారంటూ వస్తున్న ప్రచారం వాస్తవం కాదని రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈటల ప్రకటనతో కేసీఆర్‌పై పోటీకి బీజేపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో కొన్నిరోజులు వేచి చూడాల్సిందే..

    ‘కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు’

    తెలంగాణలో సీఎం కేసీఆర్ అవినీతి పాలన కొనసాగుతోందని కేఏపాల్ ఆరోపించారు. కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు ఉన్నారని తెలిపారు. వారు గెలిచి మళ్లీ ఆ పార్టీలోనే చేరుతారని చెప్పారు. కాంగ్రెస్‌లో ఉన్న తమ వాళ్లను గెలిపించుకునేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు.. అలాగే తెలంగాణ జనసేన, వైసీపీ పార్టీలను కూడా కేసీఆర్ వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాశాంతి పార్టీలో 60శాతం మంది బీసీలకు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేఏపాల్ స్పష్టం చేశారు. మరో వారం రోజుల్లో తమ పార్టీ అభ్యుర్థులను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

    ఎన్నికల గుర్తులపై ఢిల్లీ హైకోర్టుకు బీఆర్ఎస్

    బీఆర్ఎస్ ఎన్నికల సింబల్ అయిన కారును పోలిన గుర్తును అసెంబ్లీ ఎన్నికల్లో మరో పార్టీకి కేటాయించొద్దంటూ ఆ పార్టీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. కెమెరా, చపాతీ రోలర్, రోడ్డు రోలర్, సోప్‌డిష్, టెలివిజన్, కుట్టుమెషిన్, ఓడ, ఆటోరిక్షా వంటి కారును పోలిన గుర్తులను వచ్చే ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థులు, గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు కేటాయించొద్దని బీఆర్ఎస్ ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించనుంది.

    వచ్చే 5 ఏళ్ల కోసం బీజేపీని ఎన్నుకోండి: అమిత్ షా

    వచ్చే 5 ఏళ్ల కోసం మూడు పార్టీల మధ్య ఎవరిని ఎన్నుకోవాలనేది తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఆదిలాబాద్ సభలో అమిత్ షా పిలుపునిచ్చారు. ‘2014 ముందు దేశంలో అశాంతి, మహిళ లకు రక్షణ లేదు.. యువత ఉద్యోగాలు లేక, పారిశ్రామికవేత్తలు కూడా ఆందోళన.. దేశం ఏమవుతుంది అనే అవేదన ఉండేది. 9 ఏళ్ల తర్వాత దేశం పరిస్థితి ఏందో అర్థం చేసుకోవచ్చు. మోదీ పైన అవినీతి ఆరోపణలు లేవు. అంతర్గత రక్షణ పటిష్టంగా తయారయ్యింది. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసాం. విదేశాల్లో భారత్ … Read more